దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి అక్కడ ప్రఫుల్లకి శిక్షణ మొదలయ్యింది. నిశికి అక్షర జ్ఞానం వుంది. అంతకు క్రితమే తనను దొంగలు రాజుకి అమ్మివేసినప్పుడు, అంతఃపురంలో కొంత నేర్పించారు. తరువాత భవానీ పాఠక్ నేర్పించాడు. ఇప్పుడు నిశి ప్రఫుల్లకు అక్షరమాల, రాయటం చదవటం నేర్పించింది.  వ్యాకరణం భవానీ పాఠక్ వచ్చి నేర్పించసాగాడు. ఒక ఆకలిగొన్న పులి వలె, ప్రఫుల్ల విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. ప్రఫుల్ల పట్టుదల, […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ సూక్తులు (రూమీ, హఫీజ్)

అనుసృజన సూఫీ సూక్తులు (రూమీ, హఫీజ్) అనుసృజన: ఆర్ శాంతసుందరి ప్రతి ఒక్క వాక్యం ఎంతో అర్ధవంతం. వేదాంత భరితం. సూఫీల నిరంతర అన్వేషణ సంఘర్షణానంతరం వారి మనసులో నిలిచిన భావ సంపద. ఇది మతాతీత మైన అనుభవసారం. 1. నాకు కావాలనుకున్న దాని వెంట నేను పరిగెత్తేటప్పుడు రోజులు ఒత్తిడితో, ఆత్రుత పడుతూ గడిచినట్టనిపిస్తుంది. కానీ నేను సహనం వహించి కదలకుండా కూర్చుంటే, నాకు కావాల్సింది ఏ బాధా లేకుండా నా దగ్గరకు ప్రవహిస్తూ వస్తుంది. దీన్ని […]

Continue Reading
Posted On :

ఆరాధన-8 (ధారావాహిక నవల)

ఆరాధన-8 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి కళాత్మకం           మళ్ళీ ఆదివారం నేను హూస్టన్ స్టూడియోకి వెళ్ళేప్పటికే మాధవ్ తో పాటు అతని తల్లి వరలక్ష్మి, మరదలు కాత్యాయని ఆఫీసులో నా కోసం వేచి ఉన్నారు. మాధవ్ వారిని పరిచయం చేశాడు. అతని తల్లి ఆప్యాయంగా పలకరించి, నాకు ధన్యవాదాలు తెలిపింది. కాత్యాయని చాలా అందమైన అమ్మాయి. సొగసైన కన్నులతో, చిరు మందహాసంతో ఓ కిన్నెరలా నాజూకుగా అనిపించింది. నా వద్దకి […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 51

నా జీవన యానంలో- రెండవభాగం- 51 -కె.వరలక్ష్మి           అకిరా కురసోవా గొప్పగా పిక్చరైజ్ చేసిన ‘తెర్సు ఉజాలా’ మూవీ చూస్తే ఏ సినిమా కైనా కథే ప్రాణం, ఏ కథకైనా నిజాయితీయే ప్రాణం అన్పించింది నాకు.           ఒక రోజు సి.బి. రావుగారు ఫోన్ చేసి ‘‘మీ అతడు – నేను కథలు చదివేను. నాకు చాలా నచ్చాయి. ‘ఈ మాట’ కోసం రివ్యూరాసాను’’ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 30

వ్యాధితో పోరాటం-30 –కనకదుర్గ పాపం శ్రీని ఏం సుఖపడ్డాడు నన్ను చేసుకుని. పెళ్ళయిన 4 ఏళ్ళకే ఈ రోగం తగులుకుంది. ఇక్కడికొచ్చాక కొంచెం బాగున్నాం అనుకుంటే ఇప్పుడు ఇలా బాధపడ్తు న్నాం. ఒక్కడే ఇద్దరు పిల్లల్ని అందులో ఒక పసికందుని చూసుకుంటూ, ఆఫీసుకి వెళ్తూ నన్ను చూడడానికి వస్తూ కష్టపడ్తున్నాడు. ఆర్ధిక విషయాలు నాతో అసలు మాట్లాడడు. నేను ఎన్నిసార్లు అడిగినా దానికి బదులేం చెప్పడు. “నేను చూసుకుంటాను కదా! నీకెందుకు మరొక ఆలోచన? ఇప్పటికే నొప్పితో, […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 27 (యదార్థ గాథ)

జీవితం అంచున -27 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి క్వశ్చనేర్ పూర్తయ్యాక మొట్టమొదటగా విద్యార్థులను డోనింగ్ అండ్ డోఫింగ్ చేసి చూపమన్నారు. డోనింగ్ ఆఫ్ PPE అంటే హ్యాండ్ వాష్ తో ప్రారంభo చేసి PPE ను ధరించే వరుస క్రమం అలాగే డోఫింగ్ ఆఫ్ PPE అంటే మళ్ళీ హ్యాండ్ వాష్ తో ప్రారంభo చేసి PPE ను విసర్జించే వరుస క్రమం. మనం చేసే డెమోలో డోనింగ్ మరియు డోఫింగ్ల […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-24

నా అంతరంగ తరంగాలు-24 -మన్నెం శారద నేను చూసిన మొదటి సినీ నటి అప్పుడు మా నాన్న గారు గురజాలలో పోస్టుమాస్టర్ గా చేస్తున్నారు. మాచర్ల నుండి ట్రాన్ఫర్ అయి గురజాల వచ్చాం. గవర్నమెంట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నీ అక్కడ సౌరయ్య కాంపౌండ్ లోనే ఉండేవి. ఆయనకు బస్ సర్వీస్ కూడా ఉండేది. మా ఇల్లు సరేసరి.. ముందు పోస్ట్ ఆఫీస్… వెనుక రెండు గదులు, వంటగది, బ్యాక్ యార్డ్, పైన బెడ్ రూమ్స్, పెద్ద ఓపెన్ టెర్రస్ […]

Continue Reading
Posted On :

బన్నారుగట్ట జూ పార్కు

బన్నారుగట్ట జూ పార్కు -డా.కందేపి రాణి ప్రసాద్ బన్నారుగట్ట నేషనల్ పార్క్ ను నేను దాదపుగా పాతికేళ్ళ క్రితం చూశాను. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఉన్నది. అప్పట్లో మేము నెలకోసారి రిలాక్సేషన్ కోసం బెంగుళూరు వచ్చేవాళ్ళం. పేషెంట్ల అనారోగ్య వాతావరణాల మధ్యనుండి చల్లని చెట్ల గాలుల కోసం బెంగుళూరు వచ్చేవాళ్ళం. అప్పుడు మా పిల్లలు మూడు, నాలుగేళ్ళ వయసుల వాళ్ళు. కాబట్టి వాళ్ళ సరదా పడాలంటే జూపార్కులే కదా మా ఫ్రెండు వాళ్ళ ప్యామిలీతో కలసి బన్నారుగట్ట నేషనల్ పార్కుకు వెళ్ళాం.   […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-65 హవాయి- ఒవాహూ ద్వీపం – హనోలూలూ (చివరి భాగం)

యాత్రాగీతం హవాయి దీవులు – ఒవాహూ ద్వీపం – హనోలూలూ (చివరి భాగం) -డా||కె.గీత మర్నాడు మా హవాయి యాత్రలో చివరి రోజు. ఆ ఉదయం సత్య, వరు మార్నింగ్ కామ్ అడ్వెంచర్ టూరు (Morning Calm Cruise adventure tour) కి వెళ్లారు. ఉదయం 7.30 నించి 11.30 వరకు సాగే ఈ టూర్ లో పడవ మీద సముద్రంలో కొంత దూరం వెళ్లి అక్కడ స్నోర్కిలింగ్ చెయ్యడం ప్రధానం. ఒక్కొక్కళ్ళకి దాదాపు $200 టిక్కెట్టు. […]

Continue Reading
Posted On :

ఆహారం విలువ

ఆహారం విలువ -కందేపి రాణి ప్రసాద్ చిక్కటి ఆడవి. చెట్లన్నీ ఎత్తుగా పెరిగి ఉన్నాయి అడవిలో జంతువులన్నీ పనులు చేసుకునే వేళ వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. కొన్ని కోతి పిల్లలు చెట్ల తీగల మీద ఉయ్యాలలు ఊగుతూ ఆడుతున్నాయి. తీగల్ని పట్టుకుని కిందకి జారుతూ మళ్ళీ చెట్ల మానుల నుంచి ఎగబాకుతూ జారుడుబల్ల ఆటలు ఆడుతున్నాయి. మధ్య మధ్యలో ఒకదాని నొకటి వెక్కిరించుకుంటూ ఉన్నాయి. తాడు పట్టుకొని ఊగుతూ ఆగి తలను గోక్కుంటున్నాయి. ఇంతలో […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -27 – వినయస్వభావము – ప్రహ్లాదుడు కథ

పౌరాణిక గాథలు -27 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి వినయస్వభావము – ప్రహ్లాదుడు కథ ప్రహ్లాదుడు ఒక చక్రవర్తి కొడుకు. అతడు ప్రేమ, అంకితభావం కలిగినవాడు. కాని అతడి తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి పూర్తి వ్యతిరేక భావాలు కలవాడు. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడికి తన కొడుకు భగవంతుణ్ని స్మరించుకోడం అంటే ఇష్టముండేది కాదు. ఎందుకంటే, అతడు భగవంతుడి కంటే తనే గొప్పవాడినని అనుకుంటూ ఉండేవాడు. తన కొడుకు కూడా తనలాగే ఉండాలని కోరుకునేవాడు. ప్రహ్లాదుణ్ని తన మార్గంలోనే నడవమని […]

Continue Reading
Posted On :

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -7 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 7 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద నవంబర్ 26 న బీ డీ ఓ , ఒకే డాక్టర్ ఆసుపత్రి డాక్టర్, సీపీడీఓ గమడాకు వచ్చి ప్రేమశిలను చూసారు. డాక్టర్ తన మోటర్ బైక్ మీద వచ్చాడు. తనతో బాటు ఒక సెలైన్ బాటిల్ కూడా తెచ్చాడు. ఆమె ఇంట్లో ఒక వాసానికి తగిలించి ఆమెకు డ్రిప్ పెట్టాడు. […]

Continue Reading
Posted On :

సస్య-6

సస్య-6 – రావుల కిరణ్మయి డిప్యుటేషన్ ఇవ్వబడిన పాఠశాలకు చేరుకుంది. ఆ పాఠశాల పరిసరాలు తనను ఆకట్టుకున్నాయి. తనొక్కతే ఉపాధ్యాయిని, అందరూ ఉపాధ్యాయులే. పరిచయాల తరువాత తరగతి గదిలోకి వెళ్ళింది. ఆ గది విజ్ఞానపు కర్మాగారంలా కాక కారాగారంలా తోచింది. అంతా బలవంతంగా బంధించబడిన పక్షుల్లా కనిపించారు. ఏ ఒక్కరిలోను ఉత్సాహం లేదు. ఆర్యభట్ట గనుక ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా ఈ తరగతి గది శూన్యతను చూసి సున్నాను కనిపెట్టేసేవాడు అనిపించింది. నవ్వుతూ విష్ చేసింది. ఎటువంటి […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-11 జనరేషన్ గ్యాప్

కాదేదీ కథకనర్హం-11 జనరేషన్ గ్యాప్ -డి.కామేశ్వరి  “డోంట్ బి సిల్లీ మమ్మీ హౌ డు యు ఎక్స్ పెక్ట్ మీ టు మేరీ ఎన్ అన్ నొన్ గై” నందిత అద్దం ముందు నిలబడి జుత్తు బ్రష్ చేసుకుంటూ. చేత్తో కర్ల్స్ తిప్పుతూ. అద్దంలో అన్ని యాంగిల్స్ నించి అందం చూసుకుంటూ తల్లి వంక చూడనైన చూడకుండా నిర్లక్ష్యంగా కొట్టి పారేసింది. కూతురి ధోరణి మాధవికి కోపం తెప్పించినా కోపం చూపితే యీ కాలం పిల్లలు అందులో […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-25 శ్రీమతి కొమ్మూరి ఉషారాణి కథ “అభ్యుదయం”

కథామధురం  ఆ‘పాత’ కథామృతం-25 శ్రీమతి కొమ్మూరి ఉషారాణి కథ “అభ్యుదయం”  -డా. సిహెచ్. సుశీల ప్రేమ, కాదల్, ఇష్క్, లవ్ … ఏ పేరుతో పిలిచిన “ప్రేమ” అన్న భావనే మధుర మైనది. యుక్త వయసులో ఉన్నవారు భవిష్యత్తులో తమ ప్రేమ ఎంత అందంగా, ఆహ్లాదకరంగా పరిణమించబోతుందో అని మధురంగా ఊహించుకొని మురిసిపోతారు. వయసు అయిపోయిన వృద్ధులు కూడా ప్రేమ అన్న పదం వినగానే తమ గతాన్ని తలుచుకొని, తమ ప్రేమ కథల్ని, ప్రేమ భావనల్ని జ్ఞప్తికి […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి దుర్లబ్ ప్రఫుల్లను ఎత్తుకుపోయిన రాత్రే వ్రజేశ్వర్ ప్రఫుల్ల ఇంటికి చేరుకున్నాడని ఇదివరకే చెప్పుకున్నాం కదా. ప్రఫుల్ల వుండే పూరింటిలోకి వెళ్లి చూస్తే, లోపల ఏ జాడా లేదు. ఇరుగూపొరుగుని అడుగుదామంటే అర్థరాత్రి, చుట్టూ అంధకారం. అంతకు కొన్ని క్షణాల క్రితమే ప్రఫుల్లని ఎత్తుకుపోయిన విషయం వ్రజేశ్వర్కి తెలియదు. ఒకవేళ ఎవరైనా బంధువుల ఇంటిలో పడుకోవటానికి వెళ్లి వుంటుంది అని […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ కవిత్వం

అనుసృజన సూఫీ కవిత్వం అనుసృజన: ఆర్ శాంతసుందరి సూఫీ కవిత్వంలో భగవంతుడితో కలయిక, ప్రేమ, మానవ చైతన్యంలోని అతి లోతైన భావాలు కవుల హృదయాలలో నుంచి పొంగి పొరలి, వారి కలాలలో నుంచి కవితలుగా జాలువారాయి. ఈ కవితలు పర్షియన్, టర్కిష్ భాషలలో మొదట రాసేవారు. కాని, ఈ రోజుల్లో ఉర్దూ, హిందీ భాషలలోనూ రాస్తున్నారు – అవి అనువాదాలుగా కూడా దొరుకు తాయి. ఆంగ్లంలో కూడా సూఫీ కవితలు రాస్తున్నారు.           […]

Continue Reading
Posted On :

ఆరాధన-7 (ధారావాహిక నవల)

ఆరాధన-7 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి దేవుడు చేసిన మనుషులు           మళ్ళీ ఆదివారం క్లాస్ ముగించుకుని స్టూడియో నుండి బయలుదేరుతుండగా గాల్వెస్టన్ నుండి విమలక్క ఫోన్ చేసింది.  ఐదు నిమిషాల్లో నా వద్దకు వస్తున్నానని చెప్పడంతో తన కోసం ఆగిపోయాను. ఆమెని చూసి, ఆమెతో మాట్లాడి కొంత కాలమయింది. విమలక్క నాకు దూరపు బంధువు. నా కన్నా కొన్నేళ్ళ ముందే అమెరికాకి వచ్చి మెడిసిన్ లో మాస్టర్స్ చేసి పిల్లల […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 26

యాదోంకి బారాత్-26 -వారాల ఆనంద్ మొదలయిందేదయినా ముగియకతప్పదు. కొన్ని ఎప్పుడు మొదలయ్యాయో తెలీదు, మరికొన్ని ఎప్పుడు ముగుస్తాయో చెప్పలేం. జీవితాల సంగతి అట్లా వుంచితే ఉద్యోగం విషయం మాత్రం మొదలయినప్పుడే  ముగింపు ఎప్పుడో తెలుస్తుంది. టైర్  అయినా లేకున్నా రిటైర్ అవడం తప్పదు కదా. అలాంటి ముగింపు నా ఉద్యోగ జీవితంలో కూడా వచ్చింది. అప్పటికే నాతో కలిసి పనిచేసినవాళ్లూ, కలిసి నడిచిన వాళ్ళూ రిటైర్ అయి విశ్రాంతి జీవితాల్లోకి వెళ్ళిపోయారు. “బతుకు ప్రయాణంలో ఎందరో స్నేహితులు ఎవరి స్టేషన్లో […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 50

నా జీవన యానంలో- రెండవభాగం- 50 -కె.వరలక్ష్మి           ఇంకొంత ముందుకెళ్తే పసుపురంగు పూలు, మరికొన్ని చోట్ల ఊదారంగు పూలు – కొండలకి ఆ పూలరంగు అలముకుంది. అక్కడి అందమంతా పూలలోనే ఉంది. 5.30 కి లాస్ ఏంజల్స్ ట్రాఫిక్ అంతా దాటుకుని అనాహేమ్ లోని కేరేజ్ ఇన్ హోటల్ కి చేరుకున్నాం. రెండు సెపరేట్ విశాలమైన రూమ్స్, మధ్యలో ఓ గుమ్మం, డ్రెస్సింగ్ ప్లేస్, రెస్ట్ రూమ్స్. అక్కడి ఇర్వేన్ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-50)

నడక దారిలో-50 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. తర్వాత రెండో పాప రెండు నెలలకీ, బాబు మూడున్నర ఏళ్ళకీ అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, నేను ఆర్టీసి హైస్కూల్ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 29

వ్యాధితో పోరాటం-29 –కనకదుర్గ అపుడే జాండిస్ జ్వరం వచ్చింది. ఇంక ఆ స్కూల్ కెళ్ళడం మాన్పించేసారు. ముందు వెళ్ళిన స్కూల్ లోనే 7వ తరగతి పరిక్ష రాయడానికి కొంత డబ్బులు తీసుకుని ఒప్పుకున్నారు. చాలా వరకు ట్యూషన్లో చదువుకుని పరీక్షలు రాసాను. పాస్ మార్కులతో మొత్తానికి పాసయ్యాను. 1978 నవంబర్లో మా అన్నయ్య భాను పెళ్ళయ్యింది. ఆ పెళ్ళికి జరిగిన హడావుడి, వాదనలు, నాన్నకు, అన్నకు మధ్య గొడవలు చూసి చాలా భయ మేసేది. అన్నకి అపుడే […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 26 (యదార్థ గాథ)

జీవితం అంచున -26 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి మా అమ్మాయి చిన్నప్పుడు ఎదైనా కొత్త గౌను కొంటే ఎంతో సంబరంగా వెంటనే వేసేసుకునేది. అమ్మాయి కొని వుంచిన కొత్త యూనిఫారం చూసే సరికి నా ప్రయాణ బడలిక మొత్తం పటాపంచలయ్యింది. చిన్న పాపాయిలా సంబరపడుతూ వెంటనే వేసేసుకున్నాను. యూనిఫారం అద్దినట్టు అందంగా నప్పింది. నూతనోత్సాహంతో ఫ్లైట్ దిగిన రోజునే షాపింగ్ చేసి నర్సింగ్ షూస్ కొనుక్కున్నాను. సిములేటెడ్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రారంభమయ్యే […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-64 హవాయి- ఒవాహూ ద్వీపం – హనోలూలూ (భాగం-5)

యాత్రాగీతం హవాయి దీవులు – ఒవాహూ ద్వీపం – హనోలూలూ (భాగం-5) -డా||కె.గీత మర్నాడు మావీ నించి బయలుదేరి ఒవాహూ ద్వీపానికి మా ప్రయాణం. మధ్యాహ్నం రెండుగంటలకు మా ఫ్లైట్ అయినా నేను చక్రాల కుర్చీలో ఉండడంతో ఎయిర్ పోర్టుకి ముందుగా వెళ్లాల్సి వచ్చింది. పదిన్నరకల్లా రిసార్ట్ నించి బయలుదేరి మావీ ద్వీపానికి సెలవు తీసుకుని పదకొండున్నర కల్లా ఎయిర్ పోర్టుకి చేరాం. ఎయిర్ పోర్టు దగ్గిర దిగి, చక్రాల కుర్చీ కోసం రిక్వెస్టు చేసినా కుర్చీలు […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -26 – ధర్మ ప్రవర్తన – విక్రమార్కుడు కథ

పౌరాణిక గాథలు -26 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ధర్మ ప్రవర్తన – విక్రమార్కుడు కథ ఉజ్జయినికి రాజు భర్తృహరి. అతడి తండ్రిపేరు చంద్రగుప్తుడు. అతడి సోదరులు విక్రమార్కుడు, భట్టి, వరరుచి. వీళ్లది బ్రాహ్మణ వంశం. భర్తృహరి పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్లు. కొంతకాలం రాజ్యపరిపాలన చేశాక భర్తృహరికి రాజ్య పాలన మీద విరక్తి కలిగింది. తన రాజ్యానికి విక్రమార్కుణ్ని రాజుని చేశాడు. రాజ్యం వదిలి అడవులకి వెళ్లిపోయాడు. అడవులకి వెడుతూ వెడుతూ తన దగ్గర ఉన్న […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-49)

నడక దారిలో-49 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. నాకు రెండో పాప రెండు నెలలకీ, బాబు మూడున్నర ఏళ్ళకీ అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, బియ్యీడీ పూర్తిచేసి, […]

Continue Reading
Posted On :

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -6 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 6 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద డిసెంబర్ 1998-జనవరి 1999 మధ్యలో నేనక్కడ టూర్ లో ఉన్నప్పుడు చూసిన వాటి గురించి ముందే చెప్పాను. గమడా రోడ్ లో ఖరారు చేసుకున్న వలస కూలీల రవాణా గురించి నేను గమనించినది ఇక్కడ ప్రస్తావించదగినదే. ఆ రాత్రి నేను కుర్తా పైజమా వేసుకుని శాలువా కప్పుకుని టౌన్ వీధుల్లో నడుస్తు […]

Continue Reading
Posted On :

సస్య-5

సస్య-5 – రావుల కిరణ్మయి మలుపు (సస్య విదుషి మాట మీద శ్రావణ్ ఇంటికి వంట చేయడానికి ఒప్పుకుంది. ఆ తరువాత …) ***           ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచింది. కాసేపు మంచంలో కూర్చుండి తరువాత ఒక గంటలో ఇంటి పనులు స్నానం పూజ ముగించుకుంది. చెల్లెను, తమ్ముడిని చదువుకోవడానికని నిద్ర లేపింది. అమ్మను లేపాలనుకోలేదు. నిద్రలో ఆమె కలలు అవి ఎప్పటికీ ఆమెకు కలలే. కానీ అమ్మ […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-10 అమ్మాయిలూ తొందరపడకండి !

కాదేదీ కథకనర్హం-10 అమ్మాయిలూ తొందరపడకండి ! -డి.కామేశ్వరి  ఓ చేతిలో ఏణార్ధం పాప, రెండో చేత్తో బరువయిన ప్లాస్టిక్ బ్యాగు, భుజానికి నిండుగా వున్నా హ్యాండు బ్యాగుతో బస్సు కోసం ఎదురు చూస్తూ అసహనంగా నిల్చుంది భారతి. ఎండాకాలం ఏమో ఉదయం ఎనిమిదన్నరకే ఎండ చుర్రుమంటోంది. ఉక్క చెమట, చీదరతో చేతిలో పాప చిరాగ్గా ఏడుస్తోంది. చేతిలో బరువు, దానికి తోడు పాప ఏడుపు . రాని బస్సు కోసం ఎదురు చూపుతో నీరసం వస్తోంది భారతికి. […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-24 ప్రేమలీల. బి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-24  ప్రేమలీల. బి  -డా. సిహెచ్. సుశీల మధ్యతరగతి జీవితాలను గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా అర్ధం కానిది ఏదో ఉంది అనిపిస్తుంది. మనోవేదనలకి ఒక ఇంచ్ దగ్గరలో, మందహాసాలకి ఒక ఇంచ్ దూరంలో ఉంటాయి వారి జీవితాలు. కింది తరగతికి దిగజారలేక, పై తరగతికి ఎగరలేక, గొప్పవారి హంగూ ఆర్భాటాలు చూసి నిట్టూర్పులు విడుస్తూ లోలోపల ముడుచుకుపోతూ వుంటారు. ఉన్నదానితో తృప్తి పడలేరు, లేనిదాన్ని అందుకోలేరు. దాని వల్ల సతమతమై పోతూంటారు. […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి భవానీ ఠాకూర్ తను ఇచ్చిన మాట ప్రకారం ప్రఫుల్లకు తోడుగా ఇద్దరు స్త్రీలను పంపించాడు. ఒకరు ఏ పని మీదైనా బయటకి వెళ్లిరావటానికి. ఈవిడ మధ్య వయస్కు రాలు, శ్యామ ఛాయ. రెండవ స్త్రీ వయసు ఇరవై వుంటుందేమో, తెల్లగా వుంది. ప్రఫుల్లకు ఎప్పుడూ ఇంటి దగ్గర తోడు వుండటానికి. ఇద్దరూ ప్రఫుల్లకు ప్రణామం చేశారు. మీ పేర్లేమిటని […]

Continue Reading
Posted On :

అనుసృజన- సాహిర్

అనుసృజన సాహిర్ హిందీ మూలం: సాహిర్ లుధియానవి అనుసృజన: ఆర్ శాంతసుందరి ‘లోగ్ ఔరత్ కో ఫకత్ జిస్మ్ సమఝ్ లేతే హైరూహ్ భీ హోతీ హై ఇస్ మే యె కహా( సోచతె హై’ అందరూ స్త్రీ అంటే శరీరమనే అనుకుంటారుఆమెలో ఆత్మ కూడా ఉంటుందని ఆలోచించరు.           ఇది రాసింది సాహిర్ లుధియానవి. హిందీ సినిమా పాటలు ఇష్టపడే వాళ్ళకి సాహిర్ పేరు సుపరిచితమే. కానీ ఆ పాటలలో స్త్రీవాదాన్ని వినిపించిన […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-22

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 22 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు కొత్తగా పెళ్ళి చేసుకుని, ఆస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న జంట. విష్ణు ఉద్యోగం వెతుక్కుని, ఆర్థికంగా ఇపుడిపుడే నిలదొక్కు కుంటున్నాడు. విశాల వైవాహిక జీవితంలో అడుగిడి, మరోప్రక్క కెరీర్ పై దృష్టి సారిస్తోంది. ఇద్దరూ నాలుగు రోజులు కాఫ్స్ హార్బర్ విహార యాత్రకి వెళ్ళారు. ***           భూమిపై మనిషి ప్రవేశం ఒంటరిగానే, అలాగే నిష్క్రమణ కూడా […]

Continue Reading
Posted On :

ఆరాధన-6 (ధారావాహిక నవల)

ఆరాధన-6 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి నేను హైదరాబాద్ చేరిన రెండో రోజునే ఎల్.వి.ఆర్ ఫౌండేషన్ వారి అవార్డు ఈవెంట్ కి తోబుట్టువులతో సహా చెన్నైకి బయలుదేరాను. ఫ్లయిట్ దిగుతూనే మమ్మల్ని ఎల్.వి. రామయ్యగారి మనుషులు నేరుగా వారి గృహానికి తీసుకుని వెళ్లారు. ఆయన సతీమణి మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. దగ్గరుండి స్వయంగా వడ్డన చేయగా మేము ఆరగించిన షడ్రుచుల విందు ఎన్నటికీ మరువలేము. విందు తరువాత రామయ్యగారు మరునాటి ఈవెంట్ గురించి చెప్పారు. వారి సంస్థ […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 25

యాదోంకి బారాత్-25 -వారాల ఆనంద్ ఒక్కోసారి నిలిచిపోవడం/ కాల్రెక్కలు కుదేసినట్టు కూలబడిపోవడం/ మంచిదేనేమో….. మనిషిదేముంది ఆకులు రాలిన చెట్టులాంటివాడు ఎండిన మోట బావిలాంటి వాడు మళ్ళీ చిగురిస్తాడు ఊటలోంచి ఎగిసిపడ్డ తేటనీరులా ఉప్పెన అవుతాడు ఒక్కోసారి నిలిచిపోవడంలోంచే ఉవ్వెత్తున ఎగిసిపడటానికి సత్తువ వొస్తుంది తలెత్తుక తిరగడానికి ప్రాణమొస్తుంది ***           బతుకు పరుగులో స్పీడ్ బ్రేకర్ అనుకున్నదాన్ని దాటేశాను. నిజానికి అది దాటగానే రహదారిలో ఓ మలుపు ఎదురయింది. మూల తిరిగి […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 49

నా జీవన యానంలో- రెండవభాగం- 49 -కె.వరలక్ష్మి           మెలకువ వచ్చేసరికి విండోలోంచి అద్భుతమైన దృశ్యం. మేఘాలకి పైన, 38 వేల అడుగుల ఎత్తులో ఉంది ఫ్లైట్. నీలిరంగు మీద దూది పింజలు పేర్చినట్టు, మంచుతో ఆకాశంలో పర్వతాల్ని భవనాల్ని తీర్చి దిద్దినట్టు ఉంది దృశ్యం. మొదటి సూర్యకిరణం వెనకనుంచి విమానం ఎడమ రెక్కమీద ఒక అంగుళం మేర మెరిసి క్రమక్రమంగా పెరిగింది. ‘‘మేఘాలను దాటి ఇంతపైకి వచ్చిన ఈ అనుభూతిని […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 28

వ్యాధితో పోరాటం-28 –కనకదుర్గ నా డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ చూసి ఇంకొన్ని టెస్ట్స్ చేసి చూసాక ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు. ప్రక్కన పేషంట్ని చూడడానికి చాలామంది మెడికల్, హాస్పిటల్ కౌన్సిలర్ వచ్చారు. ఒక కర్టన్ తప్ప ఏ అడ్డం లేదు పక్క పేషంట్ కి నాకు మధ్యన. మాటలన్నీ క్లియర్ గా వినిపిస్తాయి. “మీ పిల్లలకు ఇన్ ఫార్మ్ చేసారా?” “లేదు. మీరేం చెబ్తారో చూసి చెప్పాలనుకున్నాం.” “సర్జరీ తప్పకుండా చేయాలి. ఆ […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 25 (యదార్థ గాథ)

జీవితం అంచున -25 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఇల్లంతా బంధుమిత్రులతో క్రిక్కిరిసి వుందేగాని వాతావరణం ఆనందానికి బదులు ఉద్వేగంగా వుంది. ఎవరికి వారే వారి వారి పద్దతిలో అమ్మను బయిల్దేరటానికి ప్రేరేపిస్తు న్నారు. రాత్రి పన్నెండు గంటలకు ఫ్లైట్ డిపార్చర్.. కోవిడ్ పరీక్షల నిర్ధారణ, ఇతర సంబంధిత డాక్యుమెంట్స్ చెకింగ్ కారణంగా నాలుగు గంటలు ముందుగా రిపోర్ట్ చేయవలసి వుంది. ఇంటి నుండి ఏడు గంటలకు బయిల్దేరాలి. వచ్చిన బంధుమిత్రులంతా భోజనం […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-23

నా అంతరంగ తరంగాలు-23 -మన్నెం శారద నాకు తెలిసిన రమాప్రభ  శరత్ బాబు గారు చనిపోయినప్పుడు నేను ప్రత్యేకమైన పోస్ట్ పెట్టలేదు. శరత్ బాబు గారితో వున్న కొద్దిపాటి పరిచయం, రమా ప్రభ గారితో వున్న మరి కాస్త ఎక్కువ పరిచయం జ్ఞప్తికి వచ్చిమాత్రం బాధ పడ్డాను. శరత్ బాబు గారి నటన గురించో, అందం గురించో నేనిక్కడ ప్రస్తావించ దలచుకో లేదు. ఆయనకు లభించిన పాత్రలవరకూ ఆయన పాడు చేయకుండా న్యాయమే చేశారు. తెలుగులో కన్నా […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-63 హవాయి- మావీ ద్వీపం (భాగం-4)

యాత్రాగీతం హవాయి దీవులు – మావీ ద్వీపం (భాగం-4) రోజు -4 రోడ్ టు హానా -డా||కె.గీత మర్నాడు మావీలో తప్పనిసరిగా చూడవలసిన “రోడ్ టు హానా” సీనిక్ డ్రైవ్ చెయ్యడానికి నిశ్చయించుకున్నాం.  ఉదయం ఎనిమిది గంటల కల్లా తయారయ్యి కారులో కూర్చున్నాం. అసలు మావీ ద్వీప సందర్శనకు వచ్చే వారెవరైనా తప్పనిసరిగా ఈ  “రోడ్ టు హానా” సీనిక్ డ్రైవ్ చెయ్యకుండా వెళ్లరట. అయితే అంత ప్రసిద్ధి గాంచిన దైనా, చిన్న రోడ్ల వెంట, పర్వతాల అంచుల […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -25 – వజ్రాయుధాలు – దధీచి మహర్షి కథ

పౌరాణిక గాథలు -25 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి వజ్రాయుధాలు – దధీచి మహర్షి కథ దధీచి మహర్షి గొప్ప తపశ్శాలి. ఆయన భార్య లోపాముద్ర మహా పతివ్రత. ఆ రోజుల్లో వృత్రాసురుడనే రాక్షసుడు దేవతల్ని బాధి౦చడమే కాకు౦డా వాళ్ల అస్త్రాల్ని తీసుకెళ్లిపోయి యుద్ధానికి అ౦దుబాటులో లేకు౦డా చేస్తు౦డేవాడు. దేవతలకి భయ౦ వేసి దధీచి మహర్షిని కలిసారు. “మహర్షీ! మా అస్త్రాల్ని రాక్షసులు ఎత్తుకుపోకు౦డా మీ దగ్గర దాచి పెట్ట౦డి!” అన్నారు. ఆయన అ౦దుకు అ౦గీకరి౦చాడు. చాలా కాల౦ […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-23 నందగిరి ఇందిరాదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-23 నందగిరి ఇందిరాదేవి  -డా. సిహెచ్. సుశీల ఆడపిల్లలు బడికి వెళ్ళి చదువుకునే సంప్రదాయం లేని రోజుల్లో, కనీసం అక్షర జ్ఞానం లేని రోజుల్లో కూడా వారు ఇంట్లో అమ్మమ్మలు నానమ్మల ద్వారా విని నేర్చుకున్న పాటల్ని పాడుకునే వారు. శ్రామిక స్త్రీలు కూడా పొలం పనుల్లో వరినాట్లు లోనో, కలుపు తీస్తూనో, శ్రమ తెలియకుండా, అలుపు రాకుండా పాటలు పాడుకునేవారు. దంపుళ్ళ పాటలు, తిరగలి పాటలు, కవ్వం పాటలు నుండి పెళ్ళిసంబరాలకి […]

Continue Reading
Posted On :

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -5 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 5 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద 1999 లో ఆకలి చావుల కమీషనర్ గా నేను ఆ ప్రాంతం లో తిరిగాను. ఆ సమయానికి గ్రామ జనాభాలో పెద్ద సంఖ్యలో జనం అప్పుల వలలో ఇరుక్కుపోయారు. అంతకు మునుపు దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం, ఆ ప్రాంతంలో ఒక ఏడాది పాటు పనిచేసాను. ఆ సమయంలో ఆ ఆర్ధిక […]

Continue Reading
Posted On :

సస్య-4

సస్య-4 – రావుల కిరణ్మయి అన్వేషణ (సస్య కిటికీలో నుండి బయటి పరిసరాలను గమనిస్తుండగా శరీరానికి చల్లగా తగిలి కెవ్వున అరిచింది.ఆ తర్వాత…) ***           ఒక్కక్షణం గుండె ఆగి కొట్టుకున్నంత అనుభూతి కలిగింది. చప్పున  ఆమెకు ఇందాక  గండు తుమ్మెదను గాలి సాయంతో దూరంగా నెట్టిన సెంటుమల్లె పూల చెండు సాహసం గుర్తుకు రాగా, వెనక్కి తిరుగుతూనే ఎటువంటి ఆలోచనా చేయకుండానే విసురుగా దేనినో తోసివేస్తున్నట్టుగా చేతితో తోసివేసింది. ఊహించని […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-9 గుర్రపు కళ్ళెం

కాదేదీ కథకనర్హం-9 గుర్రపు కళ్ళెం -డి.కామేశ్వరి  రాజాధిరాజ……రాజమార్తాండతేజ…..వంది మాగధులు స్తోత్రం చేసే రాజాధిరాజు కాకపోయినా రంగాపురం జమిందారు రాజా రావుబహుద్దూర్ రంగరాజు గారి దివాణం …… రాణివాసంతో, దాసదాసీ జనంతో , విందులు, విలాసాలు , నాట్యాలు, అతిధి అభ్యాగతులతో కళకళలాడేది — ఆయనగారి ముఖ్య హాబీ గుర్రపు స్వారీ. ఎంత ఖర్చయినా సరే మంచి గుర్రం కనిపిస్తే కొనకుండా వదిలే వారుకారు. అరడజనుకి తక్కువ కాకుండా నల్లగా, ఎత్తుగా, బలంగా నిగ నిగలాడే గుర్రాలు సాలలో […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి           “ఈ పాడుబడిన ఇంటిలోనేనా నీకు మొహిరీలు దొరికింది?” అని అడిగాడు భవానీ పాఠక్.           “అవును”           “ఎంత బంగారం దొరికింది?”           “చాలా”           “అది కాదు, […]

Continue Reading
Posted On :

అనుసృజన- వేప మొక్క

అనుసృజన వేప మొక్క హిందీ మూలం: గీత్ చతుర్వేదీ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఇది ఒక వేప మొక్క దాన్ని వంగి ఇంక కొంచెం కిందికి వంగి చూస్తే కనిపిస్తుంది వేపచెట్టులా మరింత వంగితే మట్టిదేహమైపోతావు అప్పుడు దీని నీడని కూడా అనుభవించగలుగుతావు ఈ చిన్న పాప నీళ్ళుపోసి పెంచింది దీన్ని దీని పచ్చని ఆకుల్లోని చేదు నాలుకకి తెలియజేస్తుంది తీయదనం అంటే ఏమిటో ఎత్తైన వాటిని చూసి భయపడేవారు ఇక్కడికి రండి ఈ చిన్ని మొక్కనుంచి […]

Continue Reading
Posted On :

ఆరాధన-5 (ధారావాహిక నవల)

ఆరాధన-5 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి నేను టూర్ నుండి వచ్చేంత వరకు రెండు స్టూడియోలలోనూ శిక్షణ యధావిధిగా సాగింది. నాలుగు వారాల తరువాత బే-పోర్ట్ లోని ‘హెరిటేజ్ క్లాస్’ మొదలవగానే.. పన్నెండేళ్ళ స్టూడెంట్ తేజ వాళ్ళ అమ్మగారు లలిత ఓ ప్రతిపాదన చేసింది. “మేడమ్, ఈ క్లాసుల్లో మీ గురించి, మీరు ఇలా నృత్యంలో కొనసాగడం గురించి చెప్పగలిగితే బాగుంటుంది. పిల్లలకి స్పూర్తిదాయకంగా, మాకు ఆసక్తికరంగా ఉండగలదని అనుకుంటున్నాము.” అన్నది. ఓ నిముషం ఆలోచించాను.  “అలాగే.. […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 24

యాదోంకి బారాత్-24 -వారాల ఆనంద్ ఎందుకయినా మంచిది/ కనురెప్పలు తెరిచే వుంచాలి/ ప్రకృతి ఏ అందమయిన దృశ్యాన్నో నీ కంటిలో వేసి పోవచ్చు/పోతూ పోతూ ఓ తుంటరి మబ్బు తునక/ఇంధ్రధనుస్సుని సాక్షాత్కరింప చేయొచ్చు ఎందుకయినా మంచిది/ పిడికిలి తెరిచే వుంచాలి/ఎవరయినా చేతిలో చెయ్యేసి/ స్నేహ హస్తం కలిపేసి పోవచ్చు/ నడుస్తూ నడుస్తూ మనిషనేవాడు/ఓ ఆలింగనం ఇచ్చి పోవచ్చు ఎందుకయినా మంచిది/ హృదయం తెరిచే వుంచాలి/ మనసుగల ఏ మనిషో/ తలుపు తట్టకుండానే పలకరిచి పోవచ్చు/ కదుల్తూ కదుల్తూ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 48

నా జీవన యానంలో- రెండవభాగం- 48 -కె.వరలక్ష్మి 2010 జనవరిలో కేరళటూర్ కి పిలుపు వచ్చింది. ఆ మధ్య నెల్లూరు రచయితల సమావేశానికి వచ్చిన కొందరు రచయితలు ఈ టూర్ ప్లాన్ చేసారట. ఎవరి ఖర్చులు వాళ్లేపెట్టుకోవాలి. వివరాలన్నీ ఫోన్ కి మెసేజ్ పెట్టేరు. వెళ్లాలని అన్పించింది. ఒకసారి మా ఆడపడుచు వాళ్లతోనూ, మరోసారి మా గీత తీసుకెళ్తేనూ రెండుసార్లు కేరళ వెళ్లేను. అప్పుడు చూసిన ప్రదేశాలు వేరు. సరే, వస్తానని వాళ్లకి తెలియజేసేను. జనవరి 11 […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 27

వ్యాధితో పోరాటం-27 –కనకదుర్గ సాయంత్రం శ్రీని క్యాథి ఇంటికే డైరెక్ట్ గా వచ్చి సూసన్ ని కల్సి, కాసేపుండి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాడు. క్యాథి భర్త గ్యారికి పెన్సల్వేనియాలో ఉండడం ఎక్కువగ నచ్చలేదు. ఆయనకి కొండలెక్కడం, బైకింగ్, హైకింగ్, వీటన్నిటితో పాటు మెడిటేషన్ అంటే చాలా ఇష్టం. ఆయనకు ఎక్కువగా మనుషులతో గడపడమంటే అంత ఇష్టపడేవాడు కాదు. క్యాథి అందరిలో వుండాలని కోరుకునే మనిషి. ఆమె అనుకున్నట్టు భర్తకు నచ్చితే పిల్లలతో ఇక్కడే ఉండాలనుకుంది తన కుటుంబానికి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-48)

నడక దారిలో-48 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, మా బాబు అనారోగ్యంతో చనిపోయాడు. […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 24 (యదార్థ గాథ)

జీవితం అంచున -24 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి టూరిస్ట్లకు అనుమతి లేదని కేవలం ఆస్ట్రేలియా పౌరుల కోసమే రిపాట్రియేషన్ ఫ్లైట్స్… అమ్మకు వీసా వచ్చిన నాటి వార్త. ఆస్ట్రేలియా పౌరుల వెంట తల్లి, తండ్రి, స్పౌస్ రావచ్చని మూడు రోజుల్లో మార్పు చెందిన వార్త. ప్రయాణీకులు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకుని వుండాలన్న నిబంధన. వెంటనే అమ్మకు రెండో డోసు ఇప్పించేసాను. అయితే రిపాట్రియేషన్ ఫ్లైట్స్ లో మాదాకా అవకాశం […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-22

నా అంతరంగ తరంగాలు-22 -మన్నెం శారద 1986 లో అనుకుంటాను… నేను మయూరి వారపత్రిక తరపున కొంతమంది  రచయితల్ని ఇంటర్వ్యూ చేసాను. సహజంగా చాలామంది తాము ఇంటర్యూ చేయడం తక్కువగా భావించి ఒప్పుకోరు. నిజానికి ఇంటర్వ్యూ చేసేవారు ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తులు గురించి సమగ్రంగా తెలిసిన వారయి ఉండాలి. లేకుంటే మన టీవీ ఏంకర్స్ లా జుట్టు సవరించుకుంటూ, కళ్ళు మెరపించు కుంటూ దిక్కులు చూడాలి. మొత్తానికి పత్రిక యాజమాన్యం ఎవరెవర్నో సంప్రదించి వారు కాదనడంతో నా […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-62 హవాయి- మావీ ద్వీపం (భాగం-3)

యాత్రాగీతం హవాయి దీవులు – మావీ ద్వీపం (భాగం-3) రోజు -3 -డా||కె.గీత మూడవ రోజు మావీలో ప్రసిద్ధి గాంచిన చారిత్రాత్మక  ప్రదేశమైన “లహైనా” లో రకరకాల యాక్టివిటీస్ కోసం ఉదయానే బయలుదేరాం. ఉదయం అల్పాహారం కోసం కూడా లహైనాకే వెళ్లాలని నిర్ణయించుకున్నాం. 9గం.ల ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ సందర్శన, జిప్ లైన్, ఆక్వా బాల్ వంటి సాహసాలు బుక్ చేసుకున్నందున 8 గం.లకే  రిసార్టులో బయలుదేరాం. అయితే ఆ రోజు అనుకోకుండా జరిగిన ఓ […]

Continue Reading
Posted On :

ఎలుక పిల్ల పెళ్ళి

ఎలుక పిల్ల పెళ్ళి -కందేపి రాణి ప్రసాద్ ఒక ఎలుక తన కూతురికి పెళ్ళిచేయాలి అనుకున్నది. అనుకున్నదే తడవుగా తన మిత్రులందరికీ చెప్పింది. మా పిల్లకు మంచి సంబంధాలు చూడమని అందరినీ కోరింది. అందరూ మంచి సంబంధాలు చూస్తామని మాట ఇచ్చాయి . ఎలుక తన కూతురికి బాగా అందగాడైన భర్తను తీసుకురావాలని అనుకున్నది. ఒక రోజు నెమలి మంచి కబురు తీసుకు వచ్చింది . ” మీ పిల్లకు చాలా అందంగా ఉన్న వరుడిని చూశాను […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -24 – అల్పత్వము – నహుషుడు కథ

పౌరాణిక గాథలు -24 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి అల్పత్వము – నహుషుడు కథ నహుషుడు ఒక మహారాజు. అతడి తల్లి ‘స్వర్భానవి’, తండ్రి ‘ఆయువు’, భార్య ‘ప్రియంవద’. ఎన్నో క్రతువులు చేసి దైవత్వాన్ని పొంది ఇంద్రపదవిని కూడా పొందాడు. నహుషుడు ఇంద్రపదవిని ఎలా పొందాడో తెలుసుకుందాం. త్వష్టప్రజాపతికి విశ్వరూపుడు అనే పేరు గల కొడుకు ఉండేవాడు. ఇంద్రుడి మీద కోపంతో త్వష్టప్రజాపతి మూడు శిరస్సులు గల విశ్వరూపుణ్ని సృష్టించుకుని అతణ్ని ఎలాగయినా సరే ఇంద్రుణ్ని చెయ్యాలని నంకల్పించుకున్నాడు. […]

Continue Reading
Posted On :

ఆరాధన-4 (ధారావాహిక నవల)

ఆరాధన-4 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి నా శిష్యురాలు ప్రియాంక తల్లితండ్రులు శారద, నారాయణ గార్లు అకాడెమీ శ్రేయోభిలాషులు.   భరతనాట్యం అభ్యసించిన శారద అప్పుడప్పుడు స్టూడియోలో చిన్నపిల్లల క్లాసులు నిర్వహిస్తుంది. నాకు ఓ మంచి స్నేహితురాలు కూడా.  వారింట నాకు ఎప్పుడూ ఆప్యాయత, అభిమానాలే.  ప్రియాంక కోరినట్టుగా మావారు మురళి గారి తో కలిసి మరునాడు సాయంత్రం ఆరింటికి బయలుదేరి వాళ్ళింటికి వెళ్ళాము.  వారి కాబోయే అల్లుడు, ప్రియాంక కి కాబోయే భర్త నేతన్ గార్శియాని, […]

Continue Reading
Posted On :

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -4 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 4 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద నవంబర్ 1997 వచ్చేసరికి పూర్ణ, ప్రేమ శిలకు ముగ్గురు పిల్లలు. హృదానంద కాక మరో కొడుకు, కూతురు. ఈ లోగా పూర్ణా అధిక వడ్డీ, వడ్డీ చెల్లింపు విషవిలయానికి బలి పశువయాడు. ముందు తన భూమిని తాకట్టు పెట్టాడు. తరువాత అమ్మేసాడు. పూర్ణా ఒప్పందపు వలస కూలీగా ముందు జలంధర్ కింద, […]

Continue Reading
Posted On :

సస్య-3

సస్య-3 – రావుల కిరణ్మయి అనుమానం (పదివారాల  చిరు  నవల  మూడవ పదం) (సస్య, విదుషి ప్రాణ స్నేహితులు. సస్య కు వృత్తి రీత్యా లలిత నామమాత్రంగా నైనా నేర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. అందుకోసం విదుషి శ్రవణ్ అనే టీచర్ ని మాట్లాడి తమ తోటలో ఏర్పాటుచేసింది. సస్య బలవంతం గానే అక్కడికి చేరుకుంది. ఆ తరువాత) ***           ఏడుకొండల స్వామి మెట్లకు మల్లే ఉన్న పెద్ద మెట్లను ఒక్కొక్కటి […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-8 తలుపు గొళ్ళెం

కాదేదీ కథకనర్హం-8 తలుపు గొళ్ళెం -డి.కామేశ్వరి  ఆ రోజు శోభ శోభనం! రాత్రి పదిగంటలయింది. అమ్మలక్క లందరూ హస్యాలా డుతూ శోభని గదిలో వదిలి పైన తలుపు గొళ్ళెం పెట్టేశారు. తలుపు గొళ్ళెం పెట్టగానే సావిట్లో మంచమ్మీద పడుకున్న కావమ్మ గారి గుండెల్లో రాయి పడ్డట్టయింది. బితుకు బితుకుమంటూ తలుపు గొళ్ళెం వంక చూసింది. ‘అమ్మా శోభా- నాతల్లీ! నే నెంచేతూనే తల్లీ” అనుకుంది బాధగా, రాత్రి శోభ తెల్లచీర కట్టుకుని సన్నజాజులు తురుముకుని ముస్తాబవుతుంటే గదిలోకి […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-32 వస్తువు

పేషంట్ చెప్పే కథలు – 32 వస్తువు -ఆలూరి విజయలక్ష్మి పేషేంట్స్ వెయిటింగ్ హాల్ లో ఉన్న మ్యూజిక్ ఛానెల్ లో ఏం. ఎస్. సుబ్బలక్ష్మి కంఠం త్యాగరాయ కృతుల్ని వినిపిస్తూంది. అక్కడ డాక్టర్ శృతిచేత పరీక్ష చేయించు కోవడం కోసం వేచివున్న వారిలో కొంతమందికి ఆ సంగీతం ఏంతో ప్రశాంతతను కలిగి స్తూంటే, సినిమా పాటలంటే చెవికోసుకునే కొందరికి విసుగును కలిగిస్తూంది. విపరీత మైన టెన్షన్ తో శృతి రాక కోసం ఎదురుచూస్తున్న సీతారత్నం చెవుల్లోకి […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి           అక్కడ ఫూల్మణి బందిపోట్ల భయంతో పులి వెంటాడుతున్న లేడిలాగా వేగంగా పరిగెత్తసాగింది. ఫూల్మణికి ముందు దుర్లబ్ అంతకంటే వేగంగా పరిగెడుతున్నాడు. ఫూల్మణి “దుర్లబ్ నాకోసం ఆగు, నన్ను వదిలి వెళ్ళమాకు” అంటూ కేకలు పెట్టటం మొదలు పెట్టింది. దుర్లబ్ “అమ్మో నన్ను బందిపోట్లు పట్టుకుంటారు” అని గొణు క్కుంటూ, ధోతీ వదులై […]

Continue Reading
Posted On :

అనుసృజన- శరీరం

అనుసృజన శరీరం హిందీ మూలం: గీత్ చతుర్వేదీ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఇంతసేపటినుంచీ చీకటిని చూస్తున్నావు తదేకంగా అందుకే నీ కనుపాపలు మారాయి నల్లగా పుస్తకాలని కప్పుకున్న తీరు నీ శరీరాన్నే మార్చేసింది కాయితంగా మృత్యువు వస్తే నీటికి వచ్చినట్టు రావాలని అంటూ ఉండేవాడివి అది ఆవిరైపోతుంది చెట్టు మరణిస్తే మారుతుంది తలుపుగా నిప్పుని మృత్యువు మార్చేస్తుంది బూడిదగా నువ్వు మారిపో ఆవు పొదుగుగా కురిసిపో పాల ధారలుగా ఆవిరై నడిపించు పెద్ద పెద్ద ఇంజన్లని అన్నం […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-22 కల్యాణి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-22 కల్యాణి  -డా. సిహెచ్. సుశీల ఇంటి నీడలో గురి చూసి పాడే పాట (1990), నీలిమేఘాలు (1993), ముద్ర (2001), అపరాజిత ( 2022) వంటి స్త్రీవాద కవితా సంకలనాల్లో స్త్రీల వైయక్తిక, సామాజిక అసమానతలను, కౌటుంబిక వేధింపులను కవయిత్రులు రాసిన కవితలు వచ్చాయి, సంచలనాలు సృష్టించాయి. ఇంకా ఎందరో కవయిత్రులు రాసిన కవితా సంకలనాలు వెలువడ్డాయి. రచయిత్రులు స్త్రీల ఆవేదనలను వ్యక్తీకరిస్తూ కథలు, నవలలు రాస్తున్నారు. ఆలోచింపజేస్తున్నారు. అనేక సమస్యల్లో […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 23

యాదోంకి బారాత్-23 -వారాల ఆనంద్ సంతోషం అగ్గిపుల్లలా సర్రున వెలిగి ఆరిపోతుంది దుఃఖం ఆగరొత్తీలా కాల్తూ మనల్నీ మన పరిసరాల్నీ చాలాసేపు అంటిపెట్టుకునే వుంటుంది. ***           దుఃఖ వ్యక్తీకరణ మాధ్యమం కేవలం కన్నీళ్ళు కాదు, నా మట్టుకు నాకు కవిత్వం కూడా. అందుకే 2013-2014 సంవత్సరాల సంక్షోభ కాలంలో కవిత్వం నాకు పెద్ద అవుట్ లెట్ అయింది. చికిత్స విజయవంతమయి నిలకడయిన ఆరోగ్య స్థితిలో కరీంనగర్ చేరుకున్న నేను యధావిధిగా […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 47

నా జీవన యానంలో- రెండవభాగం- 47 -కె.వరలక్ష్మి అక్టోబర్ 13న నేనూ, మా అబ్బాయి కుటుంబం రాత్రి 8 గంటలకి కాచిగూడా స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కేం. ఉదయం 9.30 కి చిత్తూరులో దిగేం. అక్కడి నుంచి టేక్సీ లో రాయవేలూరు చేరుకున్నాం. మా అబ్బాయి ముందుగా బుక్ చేసి ఉండడం వల్ల కొత్తబస్టాండ్ దగ్గర్లో ఉన్న సెల్లి అమ్మన్ రెసిడెన్సీలో దిగేం. అప్పటికే అక్కడ కేరళటూర్ నుంచి వచ్చని మూడు జంటలు మా పెద్ద […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 26

వ్యాధితో పోరాటం-26 –కనకదుర్గ పాప పుట్టక ముందు ఆఖరిసారి చెకప్ కి వెళ్ళినపుడు, ఇండ్యూస్ చేయాల్సి వస్తుం దేమో అంటే నాకు భయమేసింది. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. చైతన్య పుట్టిన దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఈ కాన్పు ఇపుడు. మెడిసెన్ బాగా డెవలప్ అయ్యింది, నొప్పులకు ఎపిడ్యూరల్ అనే మందు కూడా తీసుకోవచ్చని చెప్పారు. అయినా సరే నాకు అపుడయిన అనుభవం ఒక చేదు తీపి అనుభవంలా అయ్యింది. చెకప్ నుండి ఇంట్లో […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-47)

నడక దారిలో-47 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 23 (యదార్థ గాథ)

జీవితం అంచున -23 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి భక్తి అనే పదానికి నాకు నిజమైన అర్ధం తెలియదు… ప్రపంచాన్ని నడిపించే ఒక సూపర్ నేచురల్ పవర్ కి దేవుడని పేరు పెట్టుకోవటం తప్ప. ఆ దేవుడిని కష్టనష్టాల్లో ప్రార్ధించుకోవటం తప్ప. ఆ రోజు GYDడయాగ్నొస్టిక్స్, పద్మారావునగర్లో అమ్మ వీసా మెడికల్స్ అప్పాయిం ట్మెంట్ దొరికింది. అంత క్రితం జరిగిన సైకియాట్రిస్ట్, న్యూరాలొజిస్ట్, కార్డియాలొజిస్ట్ ల ప్రత్యేక కన్సల్టేషన్ల విషయం బయల్పడకుండా, అమ్మకి […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-21

నా అంతరంగ తరంగాలు-21 -మన్నెం శారద మా నాన్నగారు నర్సరావుపేట లో జాబ్ చేస్తున్న రోజుల్లో మాకు వినుకొండ దగ్గర వున్న నకిరికల్ లో ఒక స్నేహితురాలు ఉండేది. తను అప్పుడప్పుడూ మా ఇంటికి వస్తుండేది. వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఒకసారి నకిరికల్ పంపమని అమ్మని బ్రతిమి లాడుతుండేది. మాకూ వెళ్ళాలని మహా సరదాగా ఉండేది కానీ అమ్మ ససేమిరా ఒప్పుకునేది కాదు. “నువ్వు చూసావుగా, మళ్ళీ వాళ్లేందుకు అక్కడకి?”అని తీసి పారేసేది. అమ్మ ఎదుట మాకేం ఫ్రీ […]

Continue Reading
Posted On :

చైనా మహాకుడ్యం

చైనా మహాకుడ్యం -డా.కందేపి రాణి ప్రసాద్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజధాని అయినటు వంటి బీజింగ్ ను దర్శించటానికి మేమంతా అంటే సుమారు 70 మంది డాక్టర్లు కుటుంబాలతో సహా బయల్దేరి వెళ్ళాము. నేను మావారు, మా చిన్నబ్బాయి స్వాప్నిక్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరాము. అందరూ అక్కడే కలుసుకొని చైనా బయల్దేరతారు. చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ వారి విమానంలో రాత్రి 9:25 ని॥లకు ఢిల్లీలోని టెర్మినల్ 3 నుండి షాంఘై […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-61 హవాయి- మావీ ద్వీపం (భాగం-2)

యాత్రాగీతం హవాయి దీవులు – మావీ ద్వీపం -హాలేకలా నేషనల్ పార్కు (భాగం-2) రోజు -2 -డా||కె.గీత హవాయీ దీవుల్లోకెల్లా బిగ్ ఐలాండ్ తరువాత రెండవ అతి పెద్ద ద్వీపం మావీ. దాదాపు 730 మైళ్ళ విస్తీర్ణం కలిగినది. మావీ నిజానికి అయిదు ద్వీపాల సమూహం. అవి మావీ, మలోకై, లానై, కహోలవే, మలోకినీ (Maui, Molokaʻi, Lānaʻi, Kahoʻolawe, Molokini) ద్వీపాలు. హవాయీ జానపద గాథల్లోని ప్రఖ్యాత వీరుడైన “మావీ” పేరు మీదుగా ఈ ద్వీపానికి […]

Continue Reading
Posted On :

తల్లి మాట వినని పిల్లపాము

తల్లి మాట వినని పిల్లపాము -కందేపి రాణి ప్రసాద్ “నొప్పి  తగ్గిందా తండ్రీ!” అంటూ అడిగింది నాగరాణి తన పుత్ర రత్నాన్ని. “ఇంకా చాలా నోప్పిగా ఉందమ్మా” ఏడుపు తన్నుకొస్తుండగా పాము పిల్ల బాధగా చెప్పింది. నాగరాణి అనే తల్లిపాము కూడా కళ్ళ వెంట నీరు కారుస్తూనే ఉన్నది.           “అయినా నేను జాగ్రత్తలు చెప్పి వెళ్ళాను, నువ్వు వినిపించుకోలేదు. పుట్ట విడిచి బయటకు రావద్దన్నానా! అంటూ తల్లి పాము తన కొడుకు […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -23 – వ్యసనము – నలమహారాజు కథ

పౌరాణిక గాథలు -23 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి వ్యసనము – నలమహారాజు కథ రుచిగా వంట చేసేవాళ్ళ పేర్లు చెప్పమంటే నలుడు, భీముడు అని వెంటనే సమాధానం చెప్పేస్తాం. నలుడు చేసిన పాకాన్ని (వంటని) నలపాకం అంటారు. ఇప్పటి వరకు ఆయన వంట గురించి చెప్పుకుంటున్నాము అంటే అంత రుచిని తెప్పించే కిటుకులేవో ఆయన దగ్గర ఉండే ఉంటాయి. నలమహారాజుకి కొన్ని శక్తులు ఉన్నాయి. కొంచెం గడ్డిని చేత్తో తీసుకుని విసిరితే చాలు నిప్పు పుట్టేదిట. కట్టెలు […]

Continue Reading
Posted On :

ఆరాధన-3 (ధారావాహిక నవల)

ఆరాధన-3 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి హూస్టన్ లో సాండల్-వుడ్స్ సిటీలోని మా స్టూడియోలో పన్నెండేళ్ళగా నిబద్దతతో శిక్షణ పొందుతున్న సౌమ్య, ప్రియాంక లు కూచిపూడి రంగప్రవేశం’ కార్యక్రమాలకి.. ఆరు నెల్లగా రేయింబవళ్ళు ప్రాక్టీస్ లు చేస్తున్నారు.  వారి కుటుంబాలు కూడా కళల పట్ల, నా పట్ల గౌరవంగా మసులుకుంటారు. ‘రంగప్రవేశ ప్రదర్శన’ విషయంగా కూడా అన్ని పద్దతులు పాటిస్తారు. రెండువారాల పాటు ఇండియా నుండి వచ్చిన వాద్య  బృందంతో రిహార్సల్స్ నిర్విఘ్నంగా జరిగాయి. నా నృత్య […]

Continue Reading
Posted On :

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -3 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 3 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద పూర్ణ జలంధర్ దగ్గర రెండువేలు అప్పుతీసుకున్నాక, వడ్డీ ఎప్పటిలానే నెలకు పది శాతం, భగర్తికి వెయ్యిరూపాయలు కట్టేసాడు. జలంధర ప్రభుత్వ స్టాంప్ డ్యూటీకని వందరూపాయలు ఉంచేసుకున్నాడు. పూర్ణ వలస కూలీగా ఆంధ్రా వెళ్ళిపోడానికి పత్రం రాసిచ్చాడు. దారిఖర్చుల కింద జలంధర్ మరో రెండు వందలు ఉంచుకున్నాడు. తన ప్రయాణానికి బట్టలు, ఒక […]

Continue Reading
Posted On :

సస్య-2

సస్య-2 – రావుల కిరణ్మయి అపురూపం (పదివారాల  చిరు  నవల  రెండవ పదం) (ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న సస్య ఆ రోజున తరగతిలో బోధన చేయలేక బాధతో కుంగిపోవడం చూసి వారి ప్రధానోపాధ్యాయులు అడగడంతో సస్య చెప్పడం మొదలు పెట్టింది.ఆ తరువాత) ***           అందువల్ల మీరందరూ మీ మీ తరగతుల విద్యార్థులను తీసుకొని గ్రంథాలయానికి వెళ్ళిరండి. అక్కడ మన విద్యార్థులకు అవసరమైనవి ,ఇంకా ఏవి కావలసి ఉన్నాయో చూసి మన పాఠశాల […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-7 హారతి పళ్ళెం

కాదేదీ కథకనర్హం-7 హారతి పళ్ళెం -డి.కామేశ్వరి  రెండు రోజుల ముసురు తరువాత ఊర్లో సూర్యడుదయించాడు. తెల్లారి సూర్యుడ్ని చూడగానే జనం సంతోషించారు. సంతోషించని దేవరన్నా వుంటే పూజారి మాధవయ్య ఒక్కడే. తెల్లారకుండా వుంటే ! సూర్యు డుదయించకుండా వుంటే! ఆ ముసురు ప్రళయంగా మారి యీ వూరు వాడ, యీ జగత్తుని ముంచేత్తేస్తే …..ఏ బాధ వుండదు. డబ్బు సంపాదించాలి – దినుసులు కొనాలి – వండాలి కడుపు నింపుకోవాలి , మానం కప్పుకోవాలి, పెళ్ళాడాలి, పిల్లల్ని […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-31 పొగచూరిన సంస్కృతి

పేషంట్ చెప్పే కథలు – 31 పొగచూరిన సంస్కృతి -ఆలూరి విజయలక్ష్మి నైటీ వేసుకుని సోఫాలో కూర్చుని రిమోట్ కంట్రోల్ మీటల్ని నొక్కుతూ కాసేపటి కోసారి టి.వి. ఛానెల్స్ ని మారుస్తూ దీక్షగా ప్రోగ్రామ్స్ ని చూస్తూంది స్నిగ్ధ. చివరకు జి.టి.వి. లో వస్తూన్న సినిమాను చూస్తూ అప్పటిదాకా అలంకార ప్రాయంగా చేతిలో వున్న పుస్తకాన్ని ప్రక్కన పడేసింది. వంట మనిషి టీపాయ్ మీద ఉంచిన గ్లాసులోని పాలు ఎప్పుడో చల్లారిపోయాయి. ఏ.సి. చల్లదనం శరీరాన్ని స్పర్శిస్తూంది. […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి           తల్లీకూతుళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు. ప్రయాణ బడలిక కారణమవ్వవచ్చు, మనేద కావచ్చు, ప్రఫుల్ల తల్లికి జ్వరం తగిలింది. ఏదన్నా ఎండిన రొట్టె ముక్క దొరికితే తింటున్నారు, లేకపోతే లేదు. కొన్ని రోజులకు తల్లికి జ్వరం ముదిరి విష జ్వరంగా మారి కాలాంతం చేసింది. ప్రఫుల్ల ఒంటరిదయ్యింది. ప్రఫుల్ల మీద లేనిపోని […]

Continue Reading
Posted On :

అనుసృజన- వీరవనితా!

అనుసృజన వీరవనితా! హిందీ మూలం: ముక్త అనుసృజన: ఆర్ శాంతసుందరి స్త్రీ దేహం మీద నీలం గుర్తులు రక్తం గడ్డ కట్టిన వైనం అత్యాచారం జరిగిందని చెబుతోంది పాత కథల్లో ఎప్పుడూ బైటికి రాని కథ ఇది అత్యాచారానికి గురైన ప్రతి స్త్రీ శరీరం అందంగా ఉంటుంది ఆ కథల్లో అత్యాచారం చేసే వాడి దౌర్జన్యం ఉండదు అత్యాచారం చేసిన రాజుల గోళ్ళ గురించి గాని పళ్ళ గురించి గాని ఆ కథలు చెప్పవు ఆ కథల్లో […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-21 శ్రీమతి అద్దంపూడి అన్నపూర్ణమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-21  శ్రీమతి అద్దంపూడి అన్నపూర్ణమ్మ  -డా. సిహెచ్. సుశీల “A phobia is an overwhelming and debilitating fear of an object, place, situation, feeling or animal ” ఫోబియా అనేది ఒక నిర్దిష్ట వస్తువు, పరిస్థితి లేదా కార్యాచరణ పై ‘నియంత్రించ లేని అహేతుకమైన’ భయం. నిజానికి కొందరికి ఈ భయం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క మూలాన్ని నివారించటం ఒకటే మార్గం. లేకుంటే ఒక్కొక్కసారి […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-21

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 21 – విజయ గొల్లపూడి జరిగినకథ:విశాల, విష్ణుసాయి కొత్తగా పెళ్లైన జంట. ఆస్ట్రేలియాలో పెర్మనెంట్ రెసిడెంట్స్ వీసాతో సిడ్నీ వచ్చారు. దేశం కాని దేశంలో బంధువులు ఎవరూ లేకపోయినా, క్రొత్త జీవన విధానానికి అలవాటు పడుతున్నారు. విష్ణు నూతన ఉద్యోగం నైట్ షిఫ్ట్ లో చేరాడు. విశాల నెల రోజులు వర్క్ ఎక్స్ పీరియన్స్ ప్రోగ్రాం టేఫ్ లో పూర్తి చేసింది. ***           కష్టాలు లేని […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 22

యాదోంకి బారాత్-22 -వారాల ఆనంద్ బతుకంటేనే పరుగు. పరుగంటేనే డైనమిజం. అమ్మ వొడిలో కన్ను తెరిచింది మొదలు చివర కన్ను మూసేంతదాకా పరుగే పరుగు.‘పరుగు ఆపడం ఓ కళ’ అన్నారెవరో. నిజమే పరుగు ఒక నాన్-స్టాటిక్ డై మెన్షన్. ఆ స్థితిలో వున్నవాడు పరుగు ఆపడమంటే స్టాటిక్ డైమెన్షన్ లోకి రావడమన్నమాట. అట్లా రావడం అంత సులభం కాదు. స్వచ్ఛందంగా రావడం మరీ కష్టం. ఎందుకంటే పరుగులో ఒక మజా వుంది. ఒక వూపు వుంది. నిలువనీయనితనం […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 46

నా జీవన యానంలో- రెండవభాగం- 46 -కె.వరలక్ష్మి ‘‘పరిపూర్ణత సాధించిన మనసు అద్దంలా అన్నిటినీ స్వీకరిస్తుంది. కాని దేన్నీ తనతో ఉంచుకోదు’’ అంటారు స్వామి చిన్మయానంద. ‘‘జీవితాన్ని మరీ తీవ్రంగా తీసుకోవద్దు, ఎందుకంటే అది నిన్ను అనుక్షణం దహించివేస్తుంది’’ ఒక ఫ్రెంచి సూక్తి. ఇలాంటివన్నీ చదివేటప్పుడు ఆచరణ సాధ్యాలే అన్పిస్తాయి. కాని నిజజీవితంలోకి వచ్చేసరికి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’. 2009 జూన్ 26 న ప్రపంచ ప్రసిద్ధ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ ఈ లోకాన్ని […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 25

వ్యాధితో పోరాటం-25 –కనకదుర్గ మొత్తానికి మా ట్రిప్ ముగించుకుని వచ్చాము. వారం రోజులు వెళ్ళివచ్చే వరకు బాగా అలసిపోయాను. శ్రీనివాస్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. నేను పడుకుని నిద్రపోయాను. శ్రీనివాస్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి నన్ను లేచి స్నానం చేసి రమ్మని నేను వచ్చేవరకు వేడి వేడి నూడుల్స్ చేసి పెట్టాడు. “నీకు అన్నం తినాలన్పించకపోతే కొద్ది కొద్దిగా ఇలాంటివి తింటూ వుండు, కొద్దిగానయినా శక్తి వుంటుంది.” అంటూ ఒక బౌల్ లో నూడుల్స్, స్పూన్ వేసి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-46)

నడక దారిలో-46 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       ( తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం , రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 22 (యదార్థ గాథ)

జీవితం అంచున -22 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి పీక్స్ ఆఫ్ స్ట్రెస్ ఎలా వుంటుందో నాకు అనుభవంలోకి తెచ్చింది అమ్మ. అమ్మ ఆరోగ్య పరీక్షలు, స్పెషలిస్ట్ అప్పాయింట్మెంట్లు, స్కాన్లు, అమ్మ పాస్పోర్ట్ రెన్యువల్, ఆ పైన వీసాకి అప్లై చేయటం…అన్నీ ఒత్తిడితో కూడుకున్న వ్యవహారాలే. అమ్మ వీసా మెడికల్స్ గురించైతే చెప్పలేని ఆందోళన. ఏ మాత్రం తేడాగా వున్నా వీసా రిజెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, అమ్మను కనిపెట్టుకుని వుండటం, […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-20

నా అంతరంగ తరంగాలు-20 -మన్నెం శారద అద్భుతమైన రంగస్థల , సినిమా నటి తెలంగాణ శకుంతల! హైదరాబాద్ వచ్చిన కొత్త రోజులు! సోమాజీ గూడాలో మేం అద్దెకున్న ఇంటి పక్కనే ఉండేవారు తెలంగాణా శకుంతల. ఆఁ ఇల్లు ఈ ఇంటి కాంపౌండ్ వాల్ ని ఆనుకుని వున్న చిన్న రేకు షెడ్. ఈ మాట చెబుతున్నది కేవలం ఆఁ నాడు ఆమె ఆర్ధిక పరిస్థితి వివరించడం కోసమే. చులకన చేయడం కోసం ఎంతమాత్రం కాదు. ఆమె మహారాష్ట్రకు […]

Continue Reading
Posted On :

అమృత్ సర్ స్వర్ణ దేవాలయం

 అమృత్ సర్ స్వర్ణ దేవాలయం -డా.కందేపి రాణి ప్రసాద్ సిక్కులు పరమ పవిత్రంగా భావించే నగరం, స్వర్ణ దేవాలయం ఉన్న నగరం, సీతమ్మను కాపాడిన వాల్మికి ఆశ్రమం ఉన్న నగరం, జనరల్ డయ్యర్ ఊచకోతకు బలై పోయిన జలియన్ వాలా బాగ్ ఉన్న ప్రాంతం, పాకిస్తాన్ తో కలసి ఉన్న నగరం, పంజాబ్ రాష్ట్ర ఆర్థిక నగరం అమృత్ సర్ ను చూసే ఆవకాశం లభిస్తే ఎవరైనా వదులుకుంటారా. దేశంలోని ఏకైక సిక్కుల పవిత్ర గురుద్వారా అమృత్ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-60 హవాయి- మావీ ద్వీపం (భాగం-1)

యాత్రాగీతం హవాయి దీవులు – మావీ ద్వీపం (భాగం-1)రోజు -1 -డా||కె.గీత ప్రయాణం:మొదటిసారి హవాయిలో బిగ్ ఐలాండ్ ని చూసొచ్చిన అయిదేళ్ళకి గానీ మళ్ళీ హవాయికి వెళ్ళడానికి కుదరలేదు మాకు. అందుకు మొదటి కారణం వెళ్ళిరావడానికి అయ్యే ఖర్చు కాగా, రెండోది అందరికీ కలిసొచ్చే సెలవులు లేకపోవడం. ఏదేమైనా ఇక్కడ జూలై నెలలో కాస్త ఖరీదెక్కువైనా వేసవిలో పిల్లలందరికీ సెలవులు కావడంతో ఈ సారి అందరినీ తీసుకుని వెళ్ళాం. ఎలాగైనా కుటుంబంతా కలిసి వెళ్తే ఉండే ఆనందమే […]

Continue Reading
Posted On :

అన్యాయం చేస్తే చావు తప్పదు

అన్యాయం చేస్తే చావు తప్పదు -కందేపి రాణి ప్రసాద్ అనగనగా ఒక అడవి ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలున్నాయి.  ఆ చెట్లనిండా పక్షులు గూళ్ళు కట్టుకుని కాపురం చేస్తున్నాయి. పావురాయి, పిచ్చుకలు, కాకులు, రామచిలుకలు, గోరింకలు ఇలా రకరకాల పక్షులకు నెలవుగా ఉండేవి. చెట్ల మీద గూళ్ళు కట్టుకున్న పక్షు లన్నీ జాతి భేదం మరచి అన్యోన్యంగా ఉంటాయి. ఒకరినొకరు ఆనందంగా పలకరించు కుంటాయి.           పొద్దున్న లేవగానే ఎవరి పిల్లలకు వాళ్ళు […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -22 – నమ్మకము – శబరి కథ

పౌరాణిక గాథలు -22 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి నమ్మకము – శబరి కథ ఆమె చాలా సామాన్యమైన స్త్రీ. కాని, ఆమె నమ్మకం చాలా గొప్పది. ఆ నమ్మకంతోనే ఆమె జీవితంలో అసాధ్యమైనదాన్ని సాధ్యామయినదాన్నిగా చేసుకోగలిగింది. ఆమె ఎవరో కాదు శబరి. ఆమె కథ భారతీయులందరికీ తెలుసు. శబరి అనగానే ఆశ్రమం తలుపు దగ్గర ఎవరి కోసమో ఆతృతతో ఎదురు చూస్తూ నిలబడిన ఒక వృద్ధురాలి చిత్రం మన మనస్సులో మెదులుతుంది. అప్పుడు శబరి చాలా చిన్నపిల్ల. […]

Continue Reading
Posted On :

ఆరాధన-2 (ధారావాహిక నవల)

ఆరాధన-2 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి           ‘బే-పోర్ట్ ఆసియన్ కమ్యూనిటీ’ వారి ప్రతిపాదనకి అంగీకారం తెలిపాను. మియా ఆనందానికి అంతు లేదనడానికి నిదర్శనంగా కమ్యూనిటి హాల్ ని డాన్స్ మరియు యోగా స్టూడియోగా మార్చి, అవసరమయిన హంగులన్నీ కూర్చి ఓ అధునాతన బ్యాలెట్ స్టూడియోలా తయారు చేయించారు అభినవ్, మియా దంపతులు. ‘అర్చనా ఫైన్-ఆర్ట్స్’ (బే-పోర్ట్ ఆర్ట్స్ స్టూడియో) అని నామకరణం చేసి ఫ్లైయర్స్ వేసి, సోషల్ మీడియా మాధ్యమాల్లో […]

Continue Reading
Posted On :

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -2 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 2 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద ముందు చెప్పిన సంఘటన జరిగిన ఏడాదిలోగా మరో కుటుంబం గమడా రోడ్ కి వచ్చి చేరింది. అది జహంగీర్ కుటుంబం. రాయపూర్ రైల్వే స్టేషన్ లో, అక్కడి నుండి వెళ్ళే  పాసెంజర్, గూడ్స్ ట్రెయిన్లలలో జహంగీర్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. రైల్ రోడ్ పాసెంజర్స్ వద్ద స్లిప్పర్లు, చెప్పులు, బాగ్ […]

Continue Reading
Posted On :

సస్య-1

సస్య-1 – రావుల కిరణ్మయి స్నేహం  (పదివారాల  చిరు  నవల  తొలి  పదం) *** కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు, మఱి యా కూరిమి విరసంబైనను నేరములే  తోచుచుండు నిక్కము  సుమతీ!           ప్రాథమిక  పాఠశాలలో  5వ తరగతి తెలుగు వాచకంలోని  “సూక్తి సుధ”పాఠంలోని ఈ పద్యం ఆ రోజు తాను బోధించడానికని పుస్తకం తెరిచింది,కానీ భావోద్వేగంతో గొంతు పెగలడంలేదు సస్యకి. శతకకారుడు బద్దెన తను అనుభవించి […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-6 బల్ల చెక్క

కాదేదీ కథకనర్హం-6 బల్ల చెక్క -డి.కామేశ్వరి  కోటేశ్వరరావు కోటికి పడగలెత్తిన వాడు. ఆయనకి అందమైన భార్య వుంది. ఆరు ఫ్యాక్టరీలున్నాయి, ఆరు భవంతులున్నాయి . ఆరు కంపెనీలలో షేర్లున్నాయి. ఆరు బ్యాంకుల్లో ఎకౌంట్లున్నాయి, అరవై లక్షలున్నాయి, ఆరు కార్లు , అరవై మంది నౌకర్లు, ఆరువేల మంది పనివాళ్ళు అయన చేతి కింద వున్నారు. ఆయనింట్లో ఆరు ఎయిర్ కండిషన్లు బెడ్ రూములు , ఆరు రంగుల ఫోన్లు, ఆరు టెలివిజన్లు , ఆరు టేపు రికార్డులు….. […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-30 మెరుపు

పేషంట్ చెప్పే కథలు – 30 మెరుపు -ఆలూరి విజయలక్ష్మి మిట్టమధ్యాహ్నమయినా హేమంత శీతలచ్ఛాయా జగతిని ఆచ్చాదించేవుంది. “మేడం” శృతి చాంబర్ లోకి ఆదుర్దాగా ప్రవేసించాడో యువకుడు. అతని కళ్ళల్లో బెదురూ! ముఖం మీద చిరుచెమటలు! “యస్” అంటూ తలెత్తిన శృతి జీవన్ ని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వింది. “మేడం! నేను ఆక్సిడెంట్ చేసాను. నా స్కూటర్ క్రింద ఒక కుర్రాడు పడ్డాడు.” ఏడుపు గొంతుకతో చెప్పాడు జీవన్. “ప్రమాదమైన దెబ్బలేం తగల్లేదు కదా!” అప్రయత్నంగా […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి           రాత్రి ఒకటవ ఝాముకి హరివల్లభ బాబు భోజనానికి వచ్చి కూర్చున్నాడు. ఇంటావిడ ప్రక్కనే కూర్చుని వడ్డిస్తున్నది.           “ఆ కులత తిరిగి పోయిందా?” అడిగాడాయన.           “రాత్రి పూట ఎలా వెళ్తుంది. ఈ రాత్రికి కోడలు అతిథి. ఇక్కడే వుంటుంది” అన్నది […]

Continue Reading
Posted On :