అనుసృజన

శిథిలాలు

హిందీ మూలం: మంజూషా మన్

అనువాదం: ఆర్.శాంతసుందరి

ఎండా, వేడీ, వానా అన్నీ భరిస్తూ
మౌనంగా ఉంటాయి
పచ్చని నల్లని
పాచి పట్టిన గోడలు
కూలే గుమ్మటాలు
విరిగి పడే గోపురాలు.
చుట్టూ పొదలు
గోడల నెర్రెల్లో
మొలిచే రావి, తుమ్మ మొక్కలు.
విరిగిపోయిన కిటికీ
పగిలిపోయిన గవాక్షంలో నుంచి
బైటకి తొంగిచూసే
నిశ్శబ్దం
సవ్వడులకోసం,
తలుపు తట్టే చప్పుడు కోసం
ఎదురు చూస్తూ ఉంటుంది.
ఎదురు చూస్తుంది
ఎవరైనా తమ వాళ్ళు వస్తారని.
అలసిపోయి
అంతలోనే దూరిపోతుంది
ఏదో ఒక చీకటి గదిలోని
ధ్వంసమైన మూల లోకి
నిరాశగా.
ఇదే మరి
జీవితం శిథిలమై పోవటమంటే!

*****

Leave a Reply

Your email address will not be published.