నా అంతరంగ తరంగాలు-18

నా అంతరంగ తరంగాలు-18 -మన్నెం శారద గుర్తుకొస్తున్నాయి ……. ————————- (ఇదివరకు ఇది నేను చెప్పిందే. కానీ ఇప్పుడు నాకు చాలా మంది కొత్త స్నేహితులు వచ్చారు. అదిగాక నేను వీటిని పుస్తకరూపంగా తీసుకొస్తే అందులో ఉంటుంది కదా అని మళ్ళీ చెబుతున్నాను. రావి శాస్త్రి గారితో వున్న ఒకే ఒక జ్ఞాపకం ఇది!) ———————– 1994 లో నేను కొందరి ఫెమిలీ ఫ్రెండ్స్ తో కలిసి కేరళ టూర్ వెళ్ళాను . తిరిగి వచ్చేసరికి నా […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-28 దాహం

పేషంట్ చెప్పే కథలు – 28 దాహం -ఆలూరి విజయలక్ష్మి దాహం! వెఱ్ఱి దాహం! నోరు పిడచగట్టు పోతూంది. కళ్ళూ, కాళ్ళూ తేలిపోతున్నాయి. పళ్ళు బిగబట్టి, కళ్ళను బలవంతాన విప్పుతూ రిక్షా తొక్కుతున్నాడు వెంకటరమణ. వీధి కుళాయి కనపడగానే ప్రాణం లేచొచ్చింది. రిక్షా ఆపి కుళాయి తిప్పాడు. ఒక్క బొట్టు కూడా పడలేదు. ఉసూరుమంటూ దగ్గరకొచ్చాడు. “వెంకటరమణా!” అల్లంత దూరం నుంచి బిగ్గరగా పిలుస్తున్నారెవరో. కళ్ళనొకసారి తుడుచుకుని పరకాయించి చూసేలోగా ఆ మనిషి దగ్గరకొచ్చి సైకిలాపాడు. “ఒరేయ్! […]

Continue Reading
Posted On :

అనుసృజన- ఇదిగో చూడండి!

అనుసృజన ఇదిగో చూడండి! హిందీ మూలం: నీలమ్‌ కులశ్రేష్ఠ అనుసృజన: ఆర్ శాంతసుందరి మట్టిరంగు సహ్యాద్రి కొండల మీద క్యాబ్‌ వెళ్తోంది. మధ్య మధ్య చదునైన రోడ్డు, మళ్ళీ పాములా మెలికలు తిరిగిన కొండ దారిలో పైకి ప్రయాణం. సాపూతారా కొండలు మూడువేల అడుగులే అని అమ్మ ఎంత నవ్విందో, ”ఆహా! గుజరాత్‌ హిల్‌ స్టేషన్‌ ఎంత బావుంది. ఒక మట్టి దిబ్బని ‘హిల్స్‌’ అంటున్నారు” అంది వ్యంగ్యంగా. అమ్మ మాటలకి నాకు కోపం వచ్చింది. ‘ఏమైంది […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 43

నా జీవన యానంలో- రెండవభాగం- 43 -కె.వరలక్ష్మి 2008 జనవరి 18 నుంచి 24 వరకూ నంది నాటకోత్సవాలు రాజమండ్రి ఆనెం కళాకేంద్రంలో జరిగాయి. ఇన్విటేషన్ వచ్చింది. నేను రాజమండ్రిలో ఉన్న మా చిన్న చెల్లెలు సూర్యకుమారి ఇంటికెళ్ళి అక్కడ నుంచి రోజూ ఇద్దరం కలిసి నాటకాలు చూడడానికి వెళ్ళేవాళ్ళం. చాలా మంది నటులు, రచయితలు తెలిసినవాళ్ళు కావడం వలన పలకరించేవాళ్ళు. లీజర్ టైంలో కలిసి టీ తాగేవాళ్ళం. ముఖ్యంగా జవ్వాది రామారావుగారి సోదరప్రేమ మరచిపోలేనిది. అనుకోకుండా […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం (నోట్ టు రీడర్స్)

వ్యాధితో పోరాటం (నోట్ టు రీడర్స్) –కనకదుర్గ ప్రియమైన పాఠకుల్లారా, ఈ ఏడాది జనవరి 8న నా జీవిత సహచరుడు శ్రీనివాస్ ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు. క్రానిక్ పాన్ క్రియాటైటిస్ జబ్బుతో బాధ పడుతున్న నన్ను, నేను నెలలు నెలలు ఆసుపత్రులల్లో వుంటే చంటిపాపను స్ఫూర్తిని, పదేళ్ళ చైతన్యను కంటికి రెప్పలా కాపాడుకున్న నా భర్త, నేనే పని చేస్తానన్నా తనకి వీలైనంత సాయం సంతోషంగా చేసే వాడు. నేను ఆసుపత్రిలో వుంటే పిల్లల్ని రోజూ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-43)

నడక దారిలో-43 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       ( తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నాచదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం.స్వాతిపత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది.మరుదులవివాహాలతో కుటుంబం పెద్దదైంది.నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది.ఉమ్మడి కుటుంబం విడిపోవటం అయ్యాయి. వీర్రాజు గారు […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -19 (యదార్థ గాథ)

జీవితం అంచున -19 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అమ్మ పాలవాడు పాలు వేయటం మానేయటానికి కారణాలు ఆలోచిస్తోంది. ఇప్పుడు అమ్మ దృష్టిలో నాతో సహా అందరూ అనుమానాస్పదులే…అందరూ శతృవులే. అమ్మకు చురకత్తుల్లాంటి కెమెరాల నిఘాలో తను శత్రు కూటమిలో చిక్కుకు పోయిన భావన. పాలవాడు రాకపోవటానికి కారణం ఇంట్లో పెట్టిన కెమెరాలని అమ్మకి అనుమానం రాజుకుంది. పాలవాడు రావటం మానేసాడని పాలు కాశి తెస్తున్నాడని నాకు ఫిర్యాదు చేసింది. “పాలవాడికి కరోనా […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-17

నా అంతరంగ తరంగాలు-17 -మన్నెం శారద విశిష్టమైన ఈ గురుపూర్ణిమ రోజు కాకతాళీయమైనప్పటికి ఈ  ఇద్దరి అద్భుతమైన వ్యక్తుల పుట్టినరోజులు కూడా  కలిసి రావడం  నిజంగా ముదావహం అనే చెప్పాలి. అప్పట్లో గుంటూరులో వున్నాం మేము. ఇంకా చదువులు  కొనసాగుతున్నాయ్. ఒకరోజు మా కుటుంబ స్నేహితులు వాసుదేవరావు గారు హడావుడిగా వచ్చి  “అమ్మాయ్, శారదా , తయారవ్వు, నిన్నో చోటకి తీసుకెళ్ళాలి “అన్నారు. మా అమ్మ ఆయనకేసి సీరియస్ గా చూసి  “ఈ టైమప్పుడు ఎక్కడకి.. అప్పుడే […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-27 తెల్లారింది

పేషంట్ చెప్పే కథలు – 27 తెల్లారింది -ఆలూరి విజయలక్ష్మి ఆకాశం కదిలి కదిలి రోదిస్తూంది. వరాలు గుండెలో దుఃఖ సముద్రం ఎగసి ఎగసి పడుతూంది. వరాలు కూతురు జానకి ఫిట్స్ తో ఎగిరెగిరి పడుతూంది ఫిట్ వచ్చినప్పు డల్లా జానకి ముఖం వికృతంగా మారుతూంది. భయంతో బిగుసుకుపోతున్న వరాలు తన అశ్రద్ధను, అజ్ఞానాన్ని, అసహాయతను తలచుకుని తననుతాను వెయ్యి శాపనార్థాలు పెట్టుకుంటూంది. పిల్ల ఒళ్ళు నిగారింపుగా ఉంటే కడుపుతో వున్నప్పుడలాగే ఉంటుందనుకుంది. తలనొప్పి, వాంతులంటే తిన్నది […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-42)

నడక దారిలో-42 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       ( తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నాచదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం.స్వాతిపత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది.మరుదులవివాహాలతో కుటుంబం పెద్దదైంది.నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది.ఉమ్మడి కుటుంబం విడిపోవటం అయ్యాయి. వీర్రాజు గారు […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -18 (యదార్థ గాథ)

జీవితం అంచున -18 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఇప్పుడు మహా శూన్యానికి మారు రూపంలా వుంది అమ్మ. అప్పటికి మూడు రోజులయ్యింది పాలవాడు కనిపించక. ఉదయాన్నే పొగమంచులో దిగంతాల పరిమళాన్ని ఆస్వాదిస్తూ వెన్నెల గానాన్ని ఆలాపిస్తూ అతని స్మరణలో బాల్కనీలో కూర్చునే అమ్మ అస్తమించే శశిని, ఉదయించే రవిని ఒకేసారి చూడటం జరుగుతోంది. కాని నులి వెచ్చని ఊహలతో తన మనసులో వెన్నెల కురిపించే వాడి జాడే లేదు. అయినా ప్రేమ […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-16

నా అంతరంగ తరంగాలు-16 -మన్నెం శారద తనివితీరలేదే …నా మనసునిండలేదే …. (మరోమంచి.. మంచి గంధం  లాంటి  జ్ఞాపకం ) ***            సినీనటి,  సీరియల్స్ నిర్మాత  రాధిక గారి నుండి ఒక కథ కోసం నాకు  పిలుపు వచ్చింది . అదివరకయితే అక్కయ్య , బావగారు ఉండేవారు ,సెలవులకి చెన్నై చెక్కేస్తుండే వాళ్ళం. కానీ బంగారం లాంటి మా అక్కయ్య మణిమాల, మా పెదనాన్నకు అత్యంత  ప్రియమైన కూతురుహార్ట్ ప్రాబ్లెమ్ […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-26 బలి

పేషంట్ చెప్పే కథలు – 26 బలి -ఆలూరి విజయలక్ష్మి పాలరాతి శిల్పంలా నిశ్చలంగా కూర్చుంది శచి. సూన్య నయనాలతో ఎదురుగా వున్నా గోడవంక చూస్తూందామె. “ఏమ్మా! ఒంట్లో ఎలా వుంది?” ఆమె భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా అడిగింది శృతి. “ఏం బావుండడం, ఎత్తుబారం బావుండడం..” శచితల్లి వైదేహి పెద్దకంఠంతో అందుకుంది. “ఒక్క నిమిషం, మీరిలా రండి” వైదేహి చెయ్యి పుచ్చుకుని ప్రక్క రూమ్ లోకి తీసుకు వెళ్ళింది శృతి. “ఆ అమ్మాయి జడుసుకునేలా మీరంత […]

Continue Reading
Posted On :

అనుసృజన- ఇక అప్పుడు భూమి కంపిస్తుంది

అనుసృజన ఇక అప్పుడు భూమి కంపిస్తుంది మూలం: రిషబ్ దేవ్ శర్మ అనుసృజన: ఆర్ శాంతసుందరి చిన్నప్పుడు విన్న మాట భూమి గోమాత కొమ్ము మీద ఆని ఉందనీ బరువు వల్ల ఒక కొమ్ము అలసిపోతే గోమాత రెండో కొమ్ముకి మార్చుకుంటుందనీ అప్పుడు భూమి కంపిస్తుందనీ . ఒకసారి ఎక్కడో చదివాను బ్రహ్మాండమైన తాబేలు మూపు మీద భూమి ఆని ఉంటుందనీ వీపు దురద పెట్టినప్పుడు ఎప్పుడైనా ఆ తాబేలు కదిలితే భూమి కంపిస్తుందనీ. తరవాతెప్పుడో ఒక పౌరాణిక నాటకంలో […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 42

నా జీవన యానంలో- రెండవభాగం- 42 -కె.వరలక్ష్మి ‘‘లబ్దప్రతిష్ఠులు తమని తామే అనుకరించుకోవడమూ, యువతరం రచయితలు తమ రచననీ, చదువునీ చూసుకొని సంతృప్తి పడడమూ మానుకోవడం అవసరం. రచయిత నిత్య విద్యార్థిగా ఉండకపోతే అతనిలో ఎదుగుదల ఆగిపోతుంది. అతడు (ఆమె) ఊబిలాంటి ఆత్మసంతృప్తిలో కూరుకుపోతాడు’’ అంటారు ‘కథాశిల్పం’ లో వల్లంపాటి. ఒక కుక్క తనను ఎందుకు కరిచిందని ఆలోచించాలి అంతేగాని తనలో ఏదో లోపం ఉండడం వల్లే అది కరిచిందని అనుకోకూడదు. మన మీద క్రూరత్వాన్ని ప్రదర్శించిన […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-41)

నడక దారిలో-41 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి కుటుంబం విడిపోవటం […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -17 (యదార్థ గాథ)

జీవితం అంచున -17 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అమ్మ పడక్కుర్చీలో కూర్చుని ఏదో పలవరిస్తోంది. అంతలోనే అమ్మ బోసినోటితో బుంగ మూతి పెట్టింది. కెమెరాలలో చూడగలనే కాని వినలేని నేను జూమ్ చేసి శ్రద్దగా చూడనారంభిం చాను. ఎందుకో అమ్మ పరవశంగా చేతులు ముందుకు చాచింది. జగన్మోహన ఆనందం కెంపులై ఆమె చప్పిడి బుగ్గల్లో ఎర్ర మందారమై తణుకులీను తోంది. అమ్మ ఏదో రహస్యం చెబుతున్నట్టుగా ముందుకు వంగి గుసగుసగా కలవరించింది. […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-15

నా అంతరంగ తరంగాలు-15 -మన్నెం శారద ఆర్ట్ మీద ఇంటరెస్ట్ కొద్దీ కొన్ని రోజులు నా చదువుకి సంబంధించని ఆర్టిస్ట్ జాబ్ ఒక ఫ్యామిలీ ప్లానింగ్ ట్రైనింగ్ సెంటర్ లో చేశానని మీకు అదివరలో చెప్పాను కదా! అందులో చేయడం కోసం డ్రాయింగ్ హయ్యర్ కూడా పాసయితే బాగుంటుందని , లోయర్ పాస్ కాకుండా డైరెక్ట్ గా హయ్యర్ ఎగ్జామ్ మద్రాస్ లో రాయవచ్చని తెలిసి   గుంటూరులో ఒక మాస్టర్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆఫీస్ […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-25 పెళ్ళికూతురు

పేషంట్ చెప్పే కథలు – 25 పెళ్ళికూతురు -ఆలూరి విజయలక్ష్మి           మంగళవాయిద్యాలు పడుచుగుండెల్లో మరుమల్లెల జల్లుల్ని కురిపిస్తున్నాయి. పెళ్ళికూతురు వరలక్ష్మి ముస్తాబవుతూంది. కొంచెం దూరంలో కూర్చుని వరలక్ష్మిని చూస్తున్న శృతికి ఆమెతో తన మొదటి పరిచయం గుర్తుకొచ్చింది.            “గుడ్ మార్నింగ్ డాక్టర్!” నవ్వే సెలయేరులా, తృళ్ళిపడే జలపాతంలా వున్నా ఆ అమ్మాయి వంక ఒక్క క్షణం ఆసక్తిగా చూస్తూ ఉండిపోయింది శృతి.    […]

Continue Reading
Posted On :

అనుసృజన- వంటావిడ – ఇంటావిడ

అనుసృజన వంటావిడ – ఇంటావిడ మూలం: కుమార్ అంబుజ్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఆమె బుల్ బుల్ పిట్టగా ఉన్నప్పుడు వంట చేసిందితర్వాత లేడీగా ఉన్నప్పుడుపూల రెమ్మలా ఉన్నప్పుడుగాలితో పాటు లేత గడ్డిపరకగా నాట్యమాడుతున్నప్పుడుఅంతటా నీరెండ పరుచుకున్నప్పుడుఆమె తన కలల్ని మాలగా అల్లుకుందిహృదయాకాశంలోని నక్షత్రాలని తెంపి జోడించిందిలోపలి మొగ్గల మకరందాన్ని మేళవించిందికానీ చివరికి ఆమెకి వినిపించిందికంచం విసిరేసిన చప్పుడు మీరు ఆమెతో అందంగా ఉన్నావని అంటేఆమె వంట చేసిందిపిశాచి అని తిట్టినా వంట చేసిందిపిల్లల్ని గర్భంలో ఉంచుకుని వంట […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 41

నా జీవన యానంలో- రెండవభాగం- 41 -కె.వరలక్ష్మి నా మూడో కథల పుస్తకం అతడు – నేను కోసం కథలు పట్టుకుని హైదరాబాద్ వెళ్ళే ను. గీత చంద్రగారితో చెప్పి ముఖచిత్రం వేయించింది. ఆ కథల పనిమీద వెళ్ళి వస్తూం టే ఒక హోర్డింగ్ కన్పించింది. శిల్పకళారామంలో గులాం ఆలీ గజల్ ప్రోగ్రాం ఆ రాత్రికే ఉందని. వెంటనే మా అబ్బాయికి ఫోన్ చేసాను టిక్కెట్లు సంపాదించమని. ఎంత ప్రయత్నించినా టిక్కెట్లు దొరకకపోయే సరికి ఏడుపొచ్చింది. గులాం […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-40)

నడక దారిలో-40 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి కుటుంబం విడిపోవటం […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -16 (యదార్థ గాథ)

జీవితం అంచున -16 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అన్ని కార్యకలాపాలు వదిలేసి అమెరికా టైముని ఇండియా టైములోకి తర్జుమా చేసుకుంటూ తెల్లవార్లూ మొబైల్లో కెమెరాలు చూస్తూ కూర్చున్నాను. అమ్మ పసిపిల్లలా ముడుచుకుని ఆద మరిచి పడుకుంది. నేను రాత్రంతా నిద్రపోతున్న అమ్మను ఆర్తిగా చూస్తూనే కూర్చున్నాను. పసితనంలో నా ఒంటి మీద వెంట్రుకలు రాలిపోవటానికి, ఒళ్ళు నున్నగా చేయటా నికి  బలంగా నలుగు పెట్టి రుద్దిన ఆ చేతులు నిద్దట్లో కూడా […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-24 రాక్షసుడు

పేషంట్ చెప్పే కథలు – 24 రాక్షసుడు -ఆలూరి విజయలక్ష్మి “అయ్యో! ఏమిటమ్మా యిది? ఈ దెబ్బలేమిటి?” ఆదుర్దాగా అడిగింది శృతి. “అటక ఎక్కబోయి జారి పడిపోయాను” బలవంతాన బాధను ఓర్చుకుంటూ జవాబిచ్చింది సావిత్రి. రక్తాన్ని దూదితో తుడుస్తూ, పరిశీలనగా గాయాల్ని చూస్తూ ఆలోచిస్తూంది శృతి. వారం క్రితం భర్తను వెంటబెట్టుకొచ్చిన సావిత్రి గుర్తుకొచ్చింది. రోజారంగు చెక్కిళ్ళు, చిరుసిగ్గుతో వాలిపోతున్న కళ్ళు, చూడగానే ఆకర్షిస్తున్న అలంకరణ, కాసేపు మాట్లాడుతూ కూర్చున్నారు. సావిత్రి భర్త సోమేశ్వరరావు పదేళ్ళ నుంచీ […]

Continue Reading
Posted On :

అనుసృజన- జలియన్ వాలా బాగ్ లో వసంతం

అనుసృజన జలియాన్ వాలా బాగ్ మే వసంత్ (జలియన్ వాలా బాగ్ లో వసంతం) – ఆర్.శాంతసుందరి యహా( కోకిలా నహీ(, కాగ్ హై( శోర్ మచాతే కాలే కాలే కీట్, భ్రమర్ కా భ్రమ్ ఉపజాతే.ఇక్కడ కోయిలలు కూయవు కాకులు గోల చేస్తాయినలనల్లటి పురుగులు తుమ్మెదల్లా భ్రమింపజేస్తాయి కలియా( భీ అధఖిలీ , మిలీ హై( కంటక్ కుల్ సే వే పౌధే , వే పుష్ప్ శుష్క్ హై( అథవా ఝులసే.మొగ్గలు కూడా అరవిచ్చి […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 40

నా జీవన యానంలో- రెండవభాగం- 40 -కె.వరలక్ష్మి పుట్టిన రోజు ఫంక్షన్లో స్టేజిపైన గోల్డుకలర్ పెద్దాపురం పట్టుపంచె లాల్చీలో ఆవంత్స సోమసుందర్ గారు మెరిసిపోతూ ఉన్నారు. వెళ్ళిన రచయిత్రులమంతా ‘నేను – నా సాహిత్యకృషి’ అంటూ మాట్లాడేం. పెద్ద వయసు కావడం వల్ల కాబోలు చివరివక్తల వంతు వచ్చేసరికి సోమసుందర్ గారిలో అసహనం పెరిగిపోయి రెండు మాటలు మాట్లాడ గానే దిగిపొమ్మనేవారు. ఏది ఏమైనా మేమున్న ఆ రెండు రోజులూ డా. సీతారామస్వామి గారు, డా. అనూరాధ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-39)

నడక దారిలో-39 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలం స్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -15 (యదార్థ గాథ)

జీవితం అంచున -15 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ప్రతీ కథకు ఓ ప్రారంభం వుంటుంది… ఆ ఆరంభం గతంలోనో.. గత జన్మలోనో… ఈ కథకు ఇది ప్రారంభం కాదు. కేవలం ఓ అస్థిమిత రోజుకి మాత్రమే ఇది సాక్ష్యం. అస్థిమత్వం ఏమీ శాశ్వతం కాదు… చుట్టం చూపుగా అపుడప్పుడూ వచ్చి పలకరించ వచ్చు. ఆ పలకరింపునే మా నర్సింగ్లో మానసిక అస్వస్థత అంటారు. అది డెమెన్షియా కావచ్చు లేదా రిట్రోగ్రేడ్ అమ్నీసియా […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-14

నా అంతరంగ తరంగాలు-14 -మన్నెం శారద నేడు మాతృభాషా దినోత్సవం.. అందరికీ శుభాకాంక్షలు! మా తెలుగుతల్లికి మల్లెపూదండ… దేశ భాషలందు తెలుగు లెస్స… మధురాతి మధురమైనది మన తెలుగు భాష… ఇలా ఈ రోజు గత వైభవమో లేక మన భాష మీద ప్రేమను చాటుకుంటే సరిపోతుందా? మన భాష మీద మనకే గౌరవం లేదు. మనం మనలాగ కాక మరోలా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతాం. మనలా ఉండడం అగౌరవం అని భావిస్తాం. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-23 మెరవని తారకలు

పేషంట్ చెప్పే కథలు – 23 మెరవని తారకలు -ఆలూరి విజయలక్ష్మి ప్రకృతి చెక్కిలి మీద చీకటి చారిక పడింది. రుక్మిణి గుండెల్లో దుఃఖకడలి పొంగింది. ఒడిలో పాపాయి విలక్షణమైన ఏడుపు, విచిత్రమైన భంగిమ, కాంతిలేని కళ్ళు, వయసుతోపాటు ఎదగని శరీరం, మెదడు… తన బ్రతుకులో పెద్ద అపశృతి వికృతంగా వినిపించి కంపించింది రుక్మిణి హృదయం. తన రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డను చూస్తున్న కొద్దీ తెలిసి తెలిసి తాను చేసిన పొరపాటు కళ్ళముందు కదిలింది. అందర్నీ […]

Continue Reading
Posted On :

ఎండిపోయిన చెట్టు (ఆంగ్ల మూలం: సయెదా మిరియమ్ ఇక్బాల్ , తెలుగు అనువాదం: ఆర్.శాంతసుందరి)

అనుసృజన ఎండిపోయిన చెట్టు ఆంగ్ల మూలం: సయెదా మిరియమ్ ఇక్బాల్ అనువాదం: ఆర్.శాంతసుందరి ఎండిపోయిన చెట్టు కోల్పోయింది విత్తనాలన్నిటినీ అవి ఎగిరిపోయాయి దూరంగా సుదూరంగా తెలిసిన ప్రదేశాలకీ తెలియని ప్రాంతాలకీ మొత్తంమీద వెనక్కి రావాలన్న కోరిక లేకుండా. చెట్టు మాత్రం నిలబడే ఉంది మిగిలి ఉన్నానన్న ధైర్యంతో వేళ్ళు తెగి, ప్రేమ కరువై ఒంటరిగా. కొమ్మలు ఆర్తితో ఒంగిపోయాయి వెతకటానికి కోల్పోయిన వేళ్ళనీ , విత్తనాలనీ, తనని అంతకాలం నిలబెట్టిన నేలని కౌగలించుకున్న మనసు విరిగిపోయిన చెట్టు, […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 39

నా జీవన యానంలో- రెండవభాగం- 39 -కె.వరలక్ష్మి భూమిక ఎడిటర్ కె. సత్యవతి రచయిత్రుల కోసం ఒక ప్రయాణం రూపొందించి వివరాలు పంపేరు. నేనూ వస్తానని రిప్లై ఇచ్చేను. ఆ ప్రయాణం కోసం సెప్టెంబర్ 15 – 2006 మధ్యాహ్నం జగ్గంపేట నుంచి బయలుదేరి, రాజమండ్రిలో బస్సుమారి సాయం కాలం 6 కి నరసాపురం చేరుకున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళంతా మర్నాడు ఉదయానికి వస్తారు. నన్ను సత్యవతిగారి తమ్ముడు ప్రసాద్ గారు బస్టాండులో రిసీవ్ చేసుకుని […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-38)

నడక దారిలో-38 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతిపత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి కుటుంబం విడిపోవటం అయ్యాయి. […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -14 (యదార్థ గాథ)

జీవితం అంచున -14 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అసలు గమ్యానికి ముందు మరో మజిలి. అయినా అసలు గమ్యం అనుకుంటామే కాని, ఈ జీవి చేరాల్సిన తుది మజిలీకి ముందు తాత్కాలిక మజిలీలే ఇవన్నీ. భూగోళం రెండో వైపెళ్ళినా మానసగోళంలో మార్పేమీ రాలేదు. కుటుంబం మారినా అమ్మ పాత్రలో వైవిధ్యమేమీ లేదు. ‘నా’ అన్న వైయక్తికమెపుడూ భవబంధాల ముందు దిగదుడుపే కదా. చిగురించి పుష్పించే కొమ్మలువృక్షానికెపుడూ వసంతమే. ప్రదేశం మారిందే తప్ప […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-13

నా అంతరంగ తరంగాలు-13 -మన్నెం శారద ఈ సారి దాదాపు నెలరోజులు గేప్ తో రాస్తున్నాను ఈ ఎపిసోడ్.. ఏవేవో కారణాలతో ఆస్థిమితమయి రాయలేక పోయాను. ఇక నుండి రెగ్యులర్ గా రాయడానికి ప్రయత్ని స్తాను. మా నయాగరా ప్రయాణం…. ఎన్నోసార్లు ఈ సంగతుల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుని అనుకున్నా, ఇందులో ఏముందిలే అని ఊరుకున్నాను. ఇండియా నుండి వెళ్ళిన చాలా మంది ఈ జలపాతాన్ని చూసి తీరాలని కలలు కంటారు. వారివారి పిల్లలు కూడా ఈ […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-22 సాలెగూడు

పేషంట్ చెప్పే కథలు – 22 సాలెగూడు -ఆలూరి విజయలక్ష్మి “ఇలా తప్ప మరోలా బ్రతకలేనా?” మరోసారి ప్రశ్నించుకుంది కళావతి. కోమల త్వాన్ని కోల్పోని ఆమె ముఖం వాడిపోయి వుంది. కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. “ఇంత పాడుబ్రతుకు బ్రతక్కపోతేనేం!” అని పొడిచినట్లుండే లోకుల చూపులు తనమీద పడిన ప్రతిసారీ తనను తానే ప్రశ్న వేసుకుంటుంది కళావతి. యెంత ఆలోచించినా, ఎంత తరచి చూసినా ఎప్పుడూ జవాబొక్కటే మిగులుతుంది. “ఇలా తప్ప మరోలా బ్రతికే మార్గంలేదు నాకు. ఇంత […]

Continue Reading
Posted On :

శిథిలాలు (హిందీ మూలం: మంజూషా మన్, తెలుగు అనువాదం: ఆర్.శాంతసుందరి)

అనుసృజన శిథిలాలు హిందీ మూలం: మంజూషా మన్ అనువాదం: ఆర్.శాంతసుందరి ఎండా, వేడీ, వానా అన్నీ భరిస్తూ మౌనంగా ఉంటాయి పచ్చని నల్లని పాచి పట్టిన గోడలు కూలే గుమ్మటాలు విరిగి పడే గోపురాలు. చుట్టూ పొదలు గోడల నెర్రెల్లో మొలిచే రావి, తుమ్మ మొక్కలు. విరిగిపోయిన కిటికీ పగిలిపోయిన గవాక్షంలో నుంచి బైటకి తొంగిచూసే నిశ్శబ్దం సవ్వడులకోసం, తలుపు తట్టే చప్పుడు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూస్తుంది ఎవరైనా తమ వాళ్ళు వస్తారని. […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 38

నా జీవన యానంలో- రెండవభాగం- 38 -కె.వరలక్ష్మి           వంటలు, భోజనాల తర్వాత మళ్ళీ మెట్రో ఎక్కి కరోల్ బాగ్ మార్కెట్ కి వెళ్ళాం. వాళ్ళిద్దరూ బట్టలూ, బేగ్స్, షూస్ లాంటివి కొన్నారు. ఆ రాత్రి క్వాలిస్ లో బయలుదేరేం, రాజేంద్ర కూడా మాతోనే ఉన్నాడు ఢిల్లీ నుంచి మా తిరుగు ప్రయాణం వరకూ. ఉదయం 5కి హరిద్వార్ చేరుకున్నాం. భరించలేని చలి, అక్కడి ఉదృతమైన నీళ్ళ వరవడిలో అందరూ నదీస్నానం […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-37)

నడక దారిలో-37 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతిపత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి కుటుంబం విడిపోవటం అయ్యాయి. […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -13 (యదార్థ గాథ)

జీవితం అంచున -13 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి పెద్దమ్మాయి దిగులు మొహంతో ఇంటికి వచ్చింది. నేను నా వరకే ఆలోచిస్తున్నాను కానీ, నేను లేకుండా ఏడాది పాప, ఇద్దరు స్కూలుకి వెళ్ళే పిల్లలతో రెండు స్వంత క్లినిక్స్ నడుపుతున్న అమ్మాయికెంత ఇబ్బంది. పైగా నేను ఒక నిర్ణీత సమయానికి తిరిగి వస్తానన్న ఆశ లేదు. వెళ్ళటం ఎంత కష్టమో ఈ పరిస్థితుల్లో తిరిగి ఈ నేల మీద అడుగు మోపటం కూడా […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-12

నా అంతరంగ తరంగాలు-12 -మన్నెం శారద నేను… నా రచనలు… నన్ను ప్రోత్సహించిన సంపాదకులు.. చిన్నతనం నుండీ అక్కడా ఇక్కడా ఏదో ఒకటి రాస్తూనే వున్నా ప్రముఖ పత్రికల్లో నా రచనలు చూసుకోవాలని చాలా ఆశగా వుండేది. అయితే నాకు మార్గదర్శకులు ఎవరూ లేరు. ఎలా పంపాలో కూడా తెలియదు. చిన్నప్పటి నుండీ పప్పు రుబ్బినట్లు ప్రమదావనానికి ఉత్తరాలు రాస్తే ఎప్పటికో నేను కాలేజీలో చదివేనాటికి జవాబిచ్చారు మాలతీ చందూర్ గారు. అలాంటి తరుణంలో మా బావగారు […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- ‘రూపసి బెంగాల్ కవి’ జీబనానంద దాస్

క ‘వన’ కోకిలలు – 21 :  ‘రూపసి బెంగాల్ కవి’ జీబనానంద దాస్ (17 Feb 1899 – 22 Oct 1954)    – నాగరాజు రామస్వామి శతాధిక గ్రంథాలు రాసినారాని ఖ్యాతిని, కొందరికి ఒకే ఒక పుస్తకం తెచ్చిపెడు తుంది. పుస్తకం పేరుచెప్పగానే రచయిత పేరు మస్తిష్కంలో తళుక్కు మంటుంది. అజంత స్వప్నలిపి, అనుముల కృష్ణమూర్తి సరస్వతీ సాక్షాత్కారం, నగ్నముని కొయ్య గుర్రం, రాహుల్ సాంకృత్యాయన్ వోల్గా నుంచి గంగకు, ఉన్న లక్ష్మినారాయణ మాలపల్లి, […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-21 చివరి మజిలీ

పేషంట్ చెప్పే కథలు – 21 చివరి మజిలీ -ఆలూరి విజయలక్ష్మి ముడతలుపడ్డ నల్లటి ముఖం, రెండు కనుబొమ్మల మధ్య విభూది, ఊపిరి తీసు కుంటున్న గుర్తుగా కదులుతున్న ఛాతి, అగరొత్తులు వాసన. కబుర్లు చెప్పుకుంటూ సరస్వతమ్మ మంచం చుట్టూ కూర్చున్న ఆమె కూతుళ్ళు, కోడలు, మనవరాళ్ళు, మనుమలు… విశాలంగా వుండే గది ఎంతో ఇరుకుగా ఉన్నట్లుంది. ఎదురుగా నడవాలో కుర్చీలో పడుకున్నాడు సరస్వతమ్మ మామగారు రఘు రామయ్య. గాజు కళ్ళతో కోడలి వంక చూస్తున్న ఆ […]

Continue Reading
Posted On :

తుమ్మ చెట్టు (హిందీ మూలం: మంజూషా మన్, తెలుగు అనువాదం: ఆర్. శాంత సుందరి)

అనుసృజన తుమ్మ చెట్టు హిందీ మూలం: మంజూషా మన్ తెలుగు అనువాదం: ఆర్. శాంత సుందరి నా కిటికీ అవతల మొలిచిందొక తుమ్మ చెట్టు దాని ప్రతి కొమ్మా ముళ్ళతో నిండి ఉన్నా నాకెందుకో కనిపిస్తుంది ఆప్యాయంగా . ఇది నాతోబాటే పెరిగి పెద్దదవటం చూశాను. ఆకురాలు కాలం వచ్చినప్పుడల్లా దీని ముళ్ళకి యౌవనం పొడసూపినప్పుడల్లా ఆ ముళ్ళని చూసి అందరి మనసులూ నిండిపోయేవి ఏదో తెలీని భయంతో, అందరూ దూరమైపోతూ ఉంటే ఈ తుమ్మచెట్టుకి దానిమీద […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 37

నా జీవన యానంలో- రెండవభాగం- 37 -కె.వరలక్ష్మి తామరాకు మీది నీటి బిందువులా తొణికిసలాడుతోంది జీవితం ఎప్పుడు జారి మడుగులో కలుస్తుందో తెలీదు ఉదయం పరిమళాలొలికిన జాజీపువ్వు తొడిమలోని మంచు స్ఫటికం ఇప్పుడేది ? మా గీత నన్ను చూడడానికి వస్తూ నోకియా ఫోన్ తెచ్చింది. 999రూ||తో ప్రీపెయిడ్ కార్డ్ వేయించి ఇచ్చింది. ఆ రోజు 9.1.2006. అప్పటి నుంచీ నేను సెల్ ఫోన్ వాడడం మొదలు పెట్టేను. మోహన్ పెన్షన్ 40 వేల వరకూ తన […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 23

వ్యాధితో పోరాటం-23 –కనకదుర్గ నాకేమనిపించిందంటే శైలు చేసిన గొడవ మా ఇంట్లో అందరికీ చెప్పేసి నేను ఏడుస్తూ ఉన్నానేమో అనుకుంటూ వచ్చి ఉంటాడేమో! మర్నాడు నేను లేచి కాల కృత్యాలు తీర్చుకుంటుంటే అమ్మ కాఫీ చేసి, ఉప్మా టిఫిన్ కూడా చేసి పెట్టింది అల్లుడికి. నేను వచ్చి శ్రీనిని స్నానం చేస్తావా అని అడిగాను. శనివారం ఆఫీస్ ఉండదు, స్నానం చేసి, బోంచేసి సాయంత్రం ఇంటికి వెళ్దామంటాడనుకున్నాను. “లేదు, నేను ఇంటికి వెళ్ళి చేస్తాను,” అన్నాడు. ” […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-36)

నడక దారిలో-36 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ :తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతిపత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహా లతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయిం ది. […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -12 (యదార్థ గాథ)

జీవితం అంచున -12 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి నేను చేసే కోర్సు అమ్మకు ఉపయోగపడుతుందని ఆశ పడ్డానే తప్ప అమ్మ అవసరానికి నేను పక్కన లేకపోవటం నన్ను క్షణం నిలవ నీయలేదు. పిల్లి పిల్లలను చంకన వేసుకుని తిరిగినట్టు నేనెప్పుడూ అమ్మ వయసును కూడా ఖాతరు చేయకుండా అమ్మను వెంటేసుకుని దేశదేశాలు తిరుగుతుండే దానిని. ఈ సారే ఎందుకో అమ్మ ఇండియా నుండి నాతో బయిలుదేరకుండా నా వెనుక ఓ నెలలో […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-11

నా అంతరంగ తరంగాలు-11 -మన్నెం శారద మనసున మల్లెల మాలలూ గెనే…. తొలి రోజుల్లో చెన్నై అక్కయ్య దగ్గరకు వెళ్ళడమంటే నాకు ఎప్పుడూ సంతోషమే!మణక్క కు నేనంటే చాలా ఇష్టం! అదీగాక చెన్నై నాకు తెగ నచ్చేసింది. మొదటిసారి చూసిన ప్పుడు చాలా థ్రిల్ ఫీలయ్యాను. అంత పెద్దనగరం చూడటం అదే మొదటిసారి. చిన్నప్పుడు హైదరాబాద్ ఒకసారి చూసినప్పటకీ ఎందుకో చెన్నై నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. సెంట్రల్ స్టేషన్ లోకి రైలు అడుగు పెట్టగానే చెప్పలేని […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- కమలా దాస్

క ‘వన’ కోకిలలు – 20 :  కమలా దాస్    – నాగరాజు రామస్వామి మదర్ ఆఫ్ మాడరన్ ఇంగ్లీష్ పొయెట్రి (31 March 1934 – 31 May 2009) “నేను మలబార్ లో పుట్టిన భారతీయ మహిళను. మూడు భాషల్లో మాట్లాడుతాను, రెండు భాషల్లో రాస్తాను, ఒక భాషలో కలలు కంటాను”- కమలా దాస్. కమలా దాస్  ‘మాధవి కుట్టి’ కలంపేరుతో, మళయాలం, ఇంగ్లీషు భాషలలో  బహుళ కవిత్వం రాసిన కవయిత్రి. మాధవ కుట్టి పెళ్ళి తర్వాత కమలా దాస్ అయింది. ముస్లిమ్ మతంలోకి మారాక […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-20 భయం

పేషంట్ చెప్పే కథలు – 20 భయం -ఆలూరి విజయలక్ష్మి “ఇంత సాహసమెందుకు చేశారమ్మా? మీరు లేకపోతే ఈ పసివాల్లంతా ఏమైపో తారు?” తల్లి గండం గడిచి బయటపడిందో, లేదో తెలియక బిక్క మొహాలేసుకుని నుంచున్న పిల్లల్ని చూపిస్తూ అడిగింది శృతి. “తనలాంటి వాళ్ళకు చావడం సాహసం కాదు. బ్రతకడమే సాహసం” అనుకుంది కామాక్షి. మసకబారిన కళ్ళముందు రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనలు కదలసాగాయి. శృతి రాసిచ్చిన టానిక్ల లిస్టు వంక ప్రాణం లేనట్లు చూసింది […]

Continue Reading
Posted On :

అనుసృజన- వ్రుంద్ ( Vrind (1643–1723) )

అనుసృజన  వ్రుంద్ ( Vrind (1643–1723) ) – ఆర్.శాంతసుందరి           వ్రుంద్   (  Vrind (1643–1723) ) మార్వాడ్ కి చెందిన సుప్రసిద్ధ హిందీ కవి. బ్రిజ్ భాషలో దోహాలు రాసాడు. 70౦ నీతికవితలు రాసాడు. అతని దోహాలను కొన్ని చూడండి 1. జైసే బంధన్ ప్రేమ్ కౌ , తైసో బంధ్ న ఔర్ కాఠహి భేదై కమల్ కో , ఛేద్ న నికలై భౌంర్ ప్రేమ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 36

నా జీవన యానంలో- రెండవభాగం- 36 -కె.వరలక్ష్మి సెన్సిటివ్ నెస్  ఉంటే –  అది మనిషిని స్థిమితంగా ఉండనీయదు. ఇంటికి వచ్చాక ఏమిటో మనసులో ఒకటే ఆర్ద్రత. ఇన్నాళ్ళుగా మోహన్ కదలకుండా పడుకునే మంచం కడిగి ఆరబెట్టడం వల్ల, ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. అతనుంటే ఇంట్లో ఎప్పడూ టీ.వి మోగాల్సిందే. ఏమీ తోచనంత తీరికతో సైలెంటై పోయిన ఇంట్లో దుఃఖం, బాధ, ఏదో తెలీని దిగులు. ప్రేమంటే తెలీని ఆ చిన్న వయసులో అతను నన్ను […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 22

వ్యాధితో పోరాటం-22 –కనకదుర్గ అమ్మ ఫోన్ చేసి శ్రావణ శుక్రవారం పూజ చేస్తున్నాను వచ్చి పొమ్మన్నది. పూజ కోసం కాకపోయినా ఇలాగైనా అమ్మని, నాన్నని చూసి రావొచ్చని, వెళ్దామనుకున్నాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చి మా అత్తగారిని తాంబూలం తీసుకొని వెళ్ళమని పిలిచారు. అలాగే మరో ఇద్దరు, ముగ్గురు రమ్మన్నారు. నేను రెడీ అయ్యాను కానీ ఆమె తాంబూలం తీసుకుని వచ్చేదాక నేను వెళ్ళలేను, ఎందుకంటే శైలుని చూసుకోవాలి. శైలు లోపల కూర్చొని ఉన్నపుడు మా అత్తగారు […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-35)

నడక దారిలో-35 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ :తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహా లతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపో యింది. […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -11 (యదార్థ గాథ)

జీవితం అంచున -11 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి శిశిరం వసంతం కోసం కాచుకున్నట్లు ఆరేసి రోజుల ఎదురు చూపుల తరువాత బుధవారం వచ్చేది. ఆరు రోజుల రొటీను నుండి ఇష్టమైన ఆహ్లాదకరమైన మార్పు. ఆ ఇష్టమే రోటీనయితే మళ్ళీ అంత ఉత్సాహం వుండదేమో… బుధవారం ఇంటి పని, వంట పనికి సెలవు. ఆస్ట్రేలియాలో గ్రాసరీ షాపింగ్ చేయటం లేదా పిల్లలను దింపటం వరకేనా నా ఔటింగులు అని ఇంత వరకూ పడిన […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-10

నా అంతరంగ తరంగాలు-10 -మన్నెం శారద నాకు తెలిసిన జానకమ్మగారూ! 1992 లో నా టెలిసీరియల్ పనిమీద చెన్నై వెళ్తున్న నన్ను వీలు కుదిరితే తమ పత్రిక కోసం జానకమ్మ గారిని ఇంటర్వ్యూ చేయమని కోరారు మయూరి వారపత్రిక వారు. ఆ  పత్రిక కోసం నేను వివిధ రచయితలని చేసిన ఇంటర్వ్యూ లకు మంచి పేరు రావడంతో ఈ బాధ్యత నాకు అప్పగించారు. నేను చెన్నైలో నా పని చూసుకుని జానకి గారి ఫోన్ నంబర్ సేకరించి […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-19 రేపటి వెలుగు

పేషంట్ చెప్పే కథలు – 19 రేపటి వెలుగు -ఆలూరి విజయలక్ష్మి “గుడ్ మార్నింగ్!” వేకువలో జారిన తొలి కిరణంలా లోపలికి వచ్చింది మిస్ రోజీ. “గుడ్ మార్నింగ్” చిరునవ్వుతో ఆహ్వానించింది శృతి. విద్యాసంస్థలు వ్యాపార సంఘా లుగా మారి హాస్టల్ జీవితం తమ జీవితంలో ఒక పీడకలగా పిల్లలు భావించే స్థాయిలో వున్న బోర్డింగ్ స్కూల్స్ వర్థిల్లుతున్న తరుణంలో పదిమంది పిల్లల్ని తన యింట్లో ఉంచుకుని వాళ్ళకు సమగ్రమైన ఆహారంతోబాటు కాస్తంత ప్రేమనూ, ఆప్యాయతనూ పంచె […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- మహాకవి జయంత మహాపాత్ర

క ‘వన’ కోకిలలు – 19 :  మహాకవి జయంత మహాపాత్ర    – నాగరాజు రామస్వామి ఒడిసా గడ్డ మీద నడయాడుతున్న మహాకవి జయంత మహాపాత్ర. సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత. సాహిత్య అకాడమీ ఫెల్లోషిప్, పద్మశ్రీ లాంటిపలు ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందిన సాహిత్యకారుడు. ఇంగ్లీష్ కవిత్వాన్ని భారతదేశంలో పాదు కొల్పిన ముగ్గురు వైతాళికులు A.K. రామానుజన్, R. పార్థసారధి, జయంత మహాపాత్ర. ఈ సమకాలీన కవిత్రయంలో మొదటి ఇద్దరు ముంబాయ్ వాళ్ళు కాగా, మహాపాత్ర ఒరిస్సాకు చెందిన […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 35

నా జీవన యానంలో- రెండవభాగం- 35 -కె.వరలక్ష్మి           2005 వ సంవత్సరం ప్రారంభం నాటికి నాకు విపరీతమైన నీరసం పట్టుకుంది. రెండు పేజీలు రాసే సరికి కళ్ళు తిరగడం మొదలైంది. ఎలాగో లేని ఓపికతెచ్చుకుని ఇంటిపని, మోహన్ పనులు ముగించి ఎక్కడపడితే అక్కడ ఉత్తనేల మీద పడి నిద్ర పోయేదాన్ని.           ఒక రోజు ఏమైందో తెలీదు అతనికి తినిపించి, మూతి కడుగు తుంటే […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 21

వ్యాధితో పోరాటం-21 –కనకదుర్గ ఫైనల్ ఇయర్ ఫేయిలవుతానేమో అని భయమేసేది కానీ చదువు మీద దృష్టి పెట్టలేకపోయాను. అమ్మ వాళ్ళ పెద్దన్నయ్య, దాశరధి , ప్రముఖ కవి, ప్రజాకవి, సినీ కవి, కొన్నాళ్ళు ఆస్థాన కవిగా ఉన్నారు…. అంతకంటే ముఖ్యమైంది ఆయన నిజాం రాజుకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించి, ఎన్నోసార్లు జైలు కెళ్ళి జైలు గోడల పైన “నిజాము రాజు తరతరాల బూజు,” “రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు”. […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-34)

నడక దారిలో-34 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలం స్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాల తో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -10 (యదార్థ గాథ)

జీవితం అంచున -10 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఉరకలేసే ఉత్సాహంతో రెండో వారం కాలేజీకి తయారయ్యాను. నేను బయిల్దేరే సమయానికి అప్పుడే రాత్రి షిఫ్ట్ ముగించుకుని వచ్చిన అల్లుడు కారు బయటకు తీసాడు. “పోయిన వారం అమ్మాయి దింపినప్పుడు నేను దారి జాగ్రత్తగా గమనించాను. గూగుల్ మ్యాప్ సాయంతో నేను వెళ్ళగలను..” అన్నాను అల్లుడితో లోలోపల ఒంటరిగా వెళ్ళటానికి కొంత భయంగా వున్నప్పటికీ. “లేదు మమ్మీజీ.. యూనివర్సిటీ రోడ్డు చాలా ప్రమాదకరమైన […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-9

నా అంతరంగ తరంగాలు-9 -మన్నెం శారద మహానటికి పుట్టినరోజు జే జేలు! —————————– సావిత్రి ! సావిత్రికి మరో పేరు ఉపమానం ఉంటాయా …వుండవుగాక వుండవు ! ఒక రోజు వైజాగ్ లో పనిచేస్తున్నప్పుడు మేం ఇద్దరమే కనుక తోచక అప్పటికప్పుడు ఏదో ఒక సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం !           అలా మేం అనుకున్న సినిమా టికెట్స్ దొరక్క జగదాంబలో ఆడుతున్న ఒక మళయాళ సినిమా కి వెళ్ళాం. కారణం అందులో […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-18 కొత్తగాలి

పేషంట్ చెప్పే కథలు – 18 కొత్తగాలి -ఆలూరి విజయలక్ష్మి “మీరు తల్లి కాబోతున్నారు” గర్భనిర్దారణ చేసింది శృతి. మెల్లగా ఎక్సామినేషన్ టేబల్ దిగివచ్చి శృతికి ఎదురుగా కూర్చుంది అమరేశ్వరి. శృతి ఊహించినట్లు ఆమె ముఖం సంతోషంతో విప్పారలేదు. అంత మంచి వార్తను విన్న ఉద్వేగంతో ‘థాంక్ యూ’ అనలేదు. శృతికి తెలిసినంత వరకు అమరేశ్వరి కొంచెం లేట్ గానే వివాహం చేసుకుంది. ఇన్నాళ్ళకు వివాహమయి తల్లి కాబోతుంటే సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యే ఆడవాళ్ళనే చూసింది కానీ, […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- పద్మశ్రీ విక్రమ్ సేథ్ (భారతీయ ఆంగ్ల కవి)

క ‘వన’ కోకిలలు – 18 :  పద్మశ్రీ విక్రమ్ సేథ్ (భారతీయ ఆంగ్ల కవి)    – నాగరాజు రామస్వామి నింగి, నేల, సముద్రాల సామరస్య సర్వైక్య శ్రావ్య గీతం నా సంగీతం – విక్రమ్ సేథ్. పద్మశ్రీ విక్రమ్ సేథ్ ప్రసిద్ధ భారతీయ కవి. నవలా కారుడు. యాత్రాకథనాల (travelogues) రచయిత. గొప్ప అనువాదకుడు. ఆంగ్లంలో సాహిత్య వ్యవసాయం చేసి విశ్వఖ్యాతి గడించిన కృశీవలుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. సాహిత్య అకాడమీ, ప్రవాసీ భారతీయ సమ్మాన్, WH […]

Continue Reading
Posted On :

అనుసృజన-ఒంటరి స్త్రీ నవ్వు(హిందీ మూలం: సుధా అరోడా) తెలుగు స్వేచ్చానువాదం: ఆర్ శాంత సుందరి

అనుసృజన ఒంటరి స్త్రీ నవ్వు హిందీ మూలం: సుధా అరోడా అనువాదం: ఆర్.శాంతసుందరి ఒంటరి స్త్రీదాచుకుంటుంది తన నుంచి తననేపెదవుల మధ్య బందీ అయిన నవ్వుని బైటికి లాగినవ్వుతుంది బలవంతంగాఆ నవ్వు కాస్తా మధ్యలోనే తెగిపోతుంది… ఒంటరి స్త్రీ నవ్వటంజనాలకి నచ్చదుఎంత సిగ్గూశరం లేనిదీమెమగవాడి తోడూ నీడా లేకపోయినాఏమాత్రం బాధ లేదు ఈమెకి… నోరంతా తెరిచి నవ్వేఒంటరి స్త్రీఎవరికీ నచ్చదుబోలెడంత సానుభూతి ప్రకటించేందుకు వచ్చినవాళ్ళుదాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతారుఆ సొమ్ము మరోచోట పనికొస్తుందని! ఆ ఒంటరి స్త్రీఎంత అందంగా ఉంటుందో…ఆమె ముఖాన […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 34

నా జీవన యానంలో- రెండవభాగం- 34 -కె.వరలక్ష్మి “మనం ఘర్షణ పడాల్సింది ఆదర్శాలతో, విలువలతో, వ్యక్తుల్తో కాదు” అంటాడు బుచ్చిబాబు గారు. మోహన్ పనుల్లో అలసిపోతున్నా రిలాక్సేషన్ కోసం ఏదో ఒకటి రాస్తూనే ఉండే దాన్ని. చేసిచేసి, రాసి రాసీ అలసిపోయి అతని మంచం పక్కనే నేలమీద పడి నిద్ర పోయేదాన్ని. గాఢమైన నిద్రలో ఉండడం చూసి తన చెక్కపేడుతో మంచం పట్టిమీద గట్టిగా అదేపనిగా చప్పుడు చేస్తాడు లేదా రిమోట్ చేతిలో ఉంటుంది కాబట్టి టివి […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 20

వ్యాధితో పోరాటం-20 –కనకదుర్గ నేను కాపురానికి వచ్చినపుడు శ్రీని, నేను రెండేళ్ళ వరకు పిల్లలు వద్దని అనుకు న్నాము. నేను జర్నలిజం చేసి జాబ్ చేయాలని నా కోరిక. కానీ నేను వచ్చిన నెల తర్వాత నుండే నేను నెల తప్పానా లేదా అని ఆరాలు మొదలయ్యాయి ఇంట్లో. నెల నెల బయట కూర్చుంటానని అనుకున్నారు. మా అత్తగారు శైలజతో కష్టం అవుతుందని బయట కూర్చోవడం మానేసారని, శైలజ కూడా కూర్చోదు కాబట్టి నేను ఆ ఆచారం […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-33)

నడక దారిలో-33 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలం స్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహా లతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -9 (యదార్థ గాథ)

జీవితం అంచున -9 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి రాణి వెడలె రవితేజములలరగ… ఆనందోత్సాహములు మోమున వెల్లి విరియగ… ఓహ్… మీకు తెలియదు కదూ అమ్మ పెట్టిన నా అసలు పేరు ఝాన్సీ రాణి. అయ్యగారిని కట్టుకున్నాక ఇంటి పేరు మార్చుకోవటమే కాకుండా నా పేరులో సగాన్ని తొలిగించేసి వారికి స్థానం కల్పించి ఝాన్సీ శ్రీనివాస్ గా మారాను. ఐడీ కార్డు స్కాన్ చేస్తేగాని కాలేజీ ముఖద్వారం తెరుచుకోదు. ఇండియాలో పాడుబడిన ప్రభుత్వాఫీసులో […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-8

నా అంతరంగ తరంగాలు-8 -మన్నెం శారద నేనూ …నా చిన్నతనపు రచనావ్యాసంగం .. ————————————- ‘అసలు రచన అంటే ఏమిటి ..ఎలా రాయాలి, ఎందుకు రాయాలి’ అనే ప్రాధమిక విషయాలేమీ తెలియని రోజుల్లోనే నా రచనా వ్యాసంగం మొదలయ్యింది . మొదటిసారి అంటే నా ఏడవ సంవత్సరంలో మా పెదనాన్నగారు, దొడ్డమ్మ ఆయన చీపురుపల్లిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు కాకినాడలో చదువుకుంటున్న వాళ్ళ పిల్లల్ని చూసేందుకు దగ్గర బంధువుల్ని ఇంట్లో పెట్టి వెళ్ళారు. వాళ్ళు పెదనాన్న పంపిస్తున్న మిఠాయిలు, […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-17 పారిజాతాలు

పేషంట్ చెప్పే కథలు – 17 పారిజాతాలు -ఆలూరి విజయలక్ష్మి గాలి అల వేగంగా వచ్చి తాకింది. మంచు బిందువులు జలజలా రాలాయి. పారిజాతాలు పానుపు మీద మరిన్ని పారిజాతాలు రాలిపడ్డాయి. తెల్లటి రేకలు, ఎర్రటి కాడలు. ఎరుపు తెలుపు కలనేత తివాచీని చెట్టుకింద పరిచినట్లుగా వుంది. టెర్రస్ మీద నుంచుని పక్కింట్లోని పారిజాతాలు వంక తదేకంగా చూస్తూంది శృతి. ఇంద్రధనుస్సు లాంటి తన బాల్యం కళ్ళముందు కదిలింది. చీకటి తెరలు విచ్చిపో కుండానే పోటీగా ఒకరికంటే […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- చైనాదేశ సనాతన కవిత్రయంలో మూడవ మహాకవి తు ఫు :(Tu Fu / Du Fu – 712–770)

క ‘వన’ కోకిలలు – 17 :  చైనాదేశ సనాతన కవిత్రయంలో మూడవ మహాకవి తు ఫు : (Tu Fu / Du Fu – 712–770)    – నాగరాజు రామస్వామి తు ఫు చైనా దేశపు 8వ శతాబ్ది మహాకవి. మానవతావాది. వాంగ్ లీ, లీ పో, తు ఫు లు తాంగ్ రాజుల నాటి సమకాలీనులు, మహాకవులు. వాళ్ళు వరుసగా బౌద్ధ, టావో, కన్ఫ్సూస్యన్ ధర్మాలను తమ కవిత్వంలో హత్తుకున్న కవిశ్రేష్ఠులు. తు […]

Continue Reading
Posted On :

అనుసృజన-ఒంటరి స్త్రీ శోకం(హిందీ మూలం: సుధా అరోడా) తెలుగు స్వేచ్చానువాదం: ఆర్ శాంత సుందరి

అనుసృజన ఒంటరి స్త్రీ శోకం హిందీ మూలం: సుధా అరోడా అనువాదం: ఆర్.శాంతసుందరి ఒకరోజు ఇలా కూడా తెల్లవారుతుందిఒక ఒంటరి స్త్రీభోరుమని ఏడవాలనుకుంటుందిఏడుపు గొంతులో అడ్డుపడుతుంది దుమ్ములాఆమె వేకువజామునేకిశోరీ అమోన్ కర్ భైరవి రాగం క్యాసెట్ పెడుతుందిఆ ఆలాపనని తనలో లీనం చేసుకుంటూవెనక్కి నెట్టేస్తుంది దుఃఖాన్నిగ్యాస్ వెలిగిస్తుందిమంచి టిఫిన్ ఏదైనా చేసుకుందామని తనకోసంఆ పదార్థం కళ్ళలోంచి మనసులోకి జారిఉపశమనం కలిగిస్తుందేమోననే ఆశతోతినేది గొంతులోంచి జారుతుందికానీ నాలుకకి తెలియనే తెలియదుఎప్పుడు పొట్టలోకి వెళ్ళిందోఇక ఏడుపు దుమ్ములా పేగులని చుట్టేస్తుందికళ్ళలోంచి […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 19

వ్యాధితో పోరాటం-19 –కనకదుర్గ డాక్టర్ పెట్టిన చివాట్లతో నాకు బుద్దివచ్చి మళ్ళీ క్లీనింగ్ లు కానీ, వంటలు కానీ చేయలేదు కానీ చైతన్య స్కూల్ హోం వర్క్ నా దగ్గరే కూర్చుని చేసుకుంటుంటే చూసేదాన్ని, క్లాస్ ప్రాజెక్ట్స్ చేయడంలో కూర్చునే సాయం చేసేదాన్ని. ఇలా జాగ్రత్తగా నెల అయిపోయింది. చెకప్ కి వెళితే డాక్టర్ అన్నీ చెక్ చేసి బ్రెదిన్ పంప్ (Brethen pump) తీసేసారు. పాప ఆరోగ్యంగా ఉంది, నేను బాగానే ఉన్నాను. బెడ్ రెస్ట్ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 33

నా జీవన యానంలో- రెండవభాగం- 33 -కె.వరలక్ష్మి           మా ఊళ్ళో ఎరకలి ఎరకమ్మ అనే ఆవిడుండేది. మా అమ్మకి పురుళ్ళన్నీ ఆవిడే పోసిందట. ఆ వృత్తి ఆగిపోయినా పండగలకి పాత చీరలిచ్చీ, బియ్యం – పిండివంటలు పెట్టీ,  ఆమెని అందరూ మర్యాదగా చూసేవారు. మనిషి వంగిపోయే వరకూ చాలా కాలం బతికింది. పండగొస్తే నా దగ్గరికి కూడా వచ్చేది. వచ్చినప్పుడల్లా పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఓ కథ చెప్పేది. ఎంత […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -8 (యదార్థ గాథ)

జీవితం అంచున -8 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి భయభక్తులతో బాల్యం, కఠిన నిబంధనల్లో కౌమార్యం, ప్రేమకు అర్ధం తెలియని అయోమయంలో యవ్వనం గడిచిపోయాయి. యవ్వనపు మావి చిగుర్లు చిగురించీ చిగురించకనే దాంపత్యంలో బంధింపబడ్డాను. ప్రేమ ఊసులు, ప్రియ సరాగాలు తెలియ కుండానే తల్లినై పోయాను. నవరసాల్లో జీవితంలో మానసికోల్లాసానికి ఎరువులైన రసాల కరువులోనే రెండొంతుల జీవితం గడిచిపోయింది. ఇప్పుడు అమ్మమ్మను కూడా అయ్యాక ఆరు పదుల నేను టేఫ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-7

నా అంతరంగ తరంగాలు-7 -మన్నెం శారద ఈ సారి నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన మా పెదనాన్న గారి గురించి చెబుతాను. పెదనాన్న పేరు కొమ్మిరెడ్డి కేశవరావు. తెల్లగా, సన్నగా, నాజూకుగా వుండే ఈయన్ని పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరూ నమ్మరు. ఇది వరకు కొన్ని ఎపిసోడ్స్ లో ఆయన గురించి ప్రస్తావించాను. పెదనాన్న పోలీస్ ఆఫీసర్ గా వున్నా ఆఁ కరకుదనం ఆయనలో ఎక్కడా కనిపించేది కాదు. పిల్లలలో పిల్లవాడిలా కలిసి ఆడి పాడేవారు. […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-32)

నడక దారిలో-32 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాల తో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయిం […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-16 నీళ్ళు

పేషంట్ చెప్పే కథలు – 16 నీళ్ళు -ఆలూరి విజయలక్ష్మి నీళ్ళు! నీళ్ళు! నీళ్ళ కోసం పేట పేటంతా గగ్గోలెత్తిపోతుంది. అప్పుడే రెండు రోజులుగా మంచినీళ్ళ ట్యాంకర్ కోసం చూసిచూసి ప్రాణం కడగట్టిపోతూంది. ఏ హార్న్ వినిపించినా టాంకర్ వస్తూందని ఆశగా చూసి, కాదని నిర్ధారణ కాగానే నిరాశతో తమ దురదృష్టాన్ని తిట్టుకుంటున్నారు. గౌరీ మాటిమాటికి నాలుకతో పేదాన్ని తడుపుకుంటుంది. ఎండి పగిలిన పెదాలు తడి తగలగానే మండుతున్నాయి. రెండు రోజులుగా స్నానం లేక ఒళ్ళంతా చీదరగా […]

Continue Reading
Posted On :

అనుసృజన-సూఫీ సూక్తులు (రూమీ, హఫీజ్):

అనుసృజన సూఫీ సూక్తులు (రూమీ, హఫీజ్): అనువాదం: ఆర్.శాంతసుందరి ప్రతి ఒక్క వాక్యం ఎంతో అర్ధవంతం. వేదాంత భరితం. సూఫీల నిరంతర అన్వేషణ సంఘర్షణానంతరం వారి మనసులో నిలిచిన భావ సంపద. ఇది మతాతీత మైన అనుభవసారం. 1. నాకు కావాలనుకున్న దాని వెంట నేను పరిగెత్తేటప్పుడు రోజులు ఒత్తిడితో, ఆత్రుత పడుతూ గడిచినట్టనిపిస్తుంది. కానీ నేను సహనం వహించి కదలకుండా కూర్చుంటే, నాకు కావాల్సింది ఏ బాధా లేకుండా నా దగ్గరకు ప్రవహిస్తూ వస్తుంది. దీన్ని నుంచి నేను అర్థం […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- చైనా దేశ సనాతన మరో మహాకవి లీ పో ( 701 – 762 )

క ‘వన’ కోకిలలు – 16 :  చైనా దేశ సనాతన మరో మహాకవి లీ పో ( 701 – 762 )    – నాగరాజు రామస్వామి సాహిత్య స్వర్ణ యుగంగా ఖ్యాతికెక్కిన తాంగ్ రాజుల కవిత్రయం (వాంగ్ వీ, లీ పో, తు ఫు) లో రెండవ వాడు లీ పో. చైనా సంప్రదాయ సాహిత్యాన్ని కొత్త ఎత్తులకు కొని పోయిన మహాకవి. అతని కవిత్వం కాల్పనిక ప్రభ (Romantic brilliance). అతని వచన రచన నెమిలి నడకల నయగారం ( peacock poetry). ఆనాటి “మూడు అద్భుతాలు” […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -7 (యదార్థ గాథ)

జీవితం అంచున -7 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి మనిషికి ఆనందంలో కలిగే ఉత్సాహానికి, దిగులు వలన కలిగే నిస్సత్తువకి ఎంత వ్యత్యాసం..? ఒక్కసారిగా అన్నింటి పైన ఆసక్తి తగ్గి నన్ను నైరాశ్యం ఆవహించేసింది. అర్ధ శతాధిక వసంతాల జీవితచక్రం కళ్ళ ముందు గిర్రున తిరిగింది. రక్తపాశాలు, పేగు బంధాలు, స్నేహ సాంగత్యాలు, అనేకానేక పరిచయాలు, కీర్తి శేషమైన ప్రియ బంధాలు… ఒక్కొక్కటిగా రీలు మారుతూ కనుమరుగవుతున్నాయి. జీవితం ఇంతేనా అనే వైరాగ్య […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 32

నా జీవన యానంలో- రెండవభాగం- 32 -కె.వరలక్ష్మి           2003లో హైదరాబాదులో ఉన్నప్పుడు రంగనాయకమ్మ గార్ని కలవడానికి వెళ్ళడంఒక మరిచిపోలేని జ్ఞాపకం. నా బాల్యం నుంచీ నేను ఆవిడ రచనలకు అభిమానిని, వారి ఎడ్రస్ కి ఎలా వెళ్ళాలో తెలీక జగదీశ్వర్రెడ్డిని అడిగితే తను తీసుకెళ్ళేడు. మాతో అతని భార్య రోజా కూడా వచ్చింది. అప్పటికి వారి ఇంట్లో రంగనాయకమ్మ గారి చెల్లెళ్ళు కమల నాయకమ్మ, అమల నాయకమ్మ కూడా ఉన్నారు. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 18

వ్యాధితో పోరాటం-18 –కనకదుర్గ “ఇపుడు ఇన్ని సమస్యలు, ఇన్ని ట్రీట్మెంట్లు వచ్చాయి. మా సమయంలో అయితే కాన్పు కాగానే పిల్లగానీ, పిల్లవాడ్ని గానీ ఇంట్లో వున్న పెద్ద వారికి అంటే అత్తగారికి అప్ప చెప్పి పొలంకి వెళ్ళి పని చేసే వాళ్ళం తెలుసా?” అంది. నేను ఇలాంటి కథలు వినే వున్నాను.  చైతన్య కడుపులో వున్నపుడు అత్తగారింట్లోనే వుండేవారం. శ్రీనివాస్ అమ్మమ్మ వుండేవారు. ఆమె చాలా జాగ్రత్తగా మా మామగారు, శ్రీనివాస్ ఆఫీస్ లకు వెళ్ళిపోయాక నన్ను […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-31)

నడక దారిలో-31 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతిపత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ పరీక్షల తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-6

నా అంతరంగ తరంగాలు-6 -మన్నెం శారద మాచర్ల…! దాని అసలు పేరు మహాదేవచర్ల అని నాకు చిన్నప్పుడు ట్యూషన్ చెప్పిన చక్రపాణి మాస్టర్ గారు చెప్పారు. నాకప్పుడు ఆరేళ్లయిన మాస్టారి మొహం స్పష్టంగా గుర్తుంది. మాచర్లని ఎవరన్నా హేళనగా మాట్లాడితే మాస్టర్ గారు భాస్వరంలా మండిపడేవారు. అందుకే శ్రీనాథుడంటే ఆయనకు వళ్ళు మంట! ఆయన పల్నాడు మీద రాసిన చాటువులు కొన్ని చెప్పి మండిపడి “అందుకే అలాంటి శిక్ష అనుభవించాడు అనేవారు. వాటిలో ఒకటి రెండు గుర్తున్నాయి. […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-15 తపన

పేషంట్ చెప్పే కథలు – 15 తపన -ఆలూరి విజయలక్ష్మి “చిన్నపిల్లవి. నీకు గుండె నొప్పేమిటమ్మా?! ఫిగర్ కాపాడుకోడానికని మరీ నాజూగ్గా తినక శుభ్రంగా తిను” మందులచీటీ యిస్తూ రాగిణితో చెప్పింది డాక్టర్ శృతి. “మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మేడం. మీ పనయ్యేదాకా కూర్చుంటాను” దిగాలుపడిన ముఖంతో శృతి పనయ్యేదాకా కాచుకూర్చుంది రాగిణి. “మీరు మా వారితో ఒక విషయం చెప్పి ఒప్పించాలి మేడం!” రాగిణి మాటలు విని గలగలా నవ్వింది శృతి. “లవ్ […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-5

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-5 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- చైనా దేశ సనాతన మహాకవి వాంగ్-వీ (701-761 C.E.)

క ‘వన’ కోకిలలు – 15 :  చైనా దేశ సనాతన మహాకవి వాంగ్-వీ (701-761 C.E.)    – నాగరాజు రామస్వామి మానవ మస్తిష్కాన్ని నిదుర లేపేది కవనం, మనిషిని పరిపూర్ణున్నీ చేసేది సంగీతం. – కన్ఫూస్యస్. చైనా సాహిత్య సంప్రదాయం 3000 సంవత్సరాల సనాతనం. 4 వ శతాబ్దానికి చెందిన చైనాదేశ సాహిత్య జాతిపిత (Father of Chines poetry) క్యూయాన్ (Qu Yuan), 15 వ శతాబ్దపు తాత్విక కవి కన్ఫూస్యస్ (Confucius) ప్రసిద్ధలేకాని, సనాతన చైనా మహా కవులుగా గణన పొందిన వారిలో అగ్రగణ్యులు 8వ శతాబ్దికి చెందిన కవులు వాంగ్-వీ (Wang Wei), లీ-పో (Li […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -6 (యదార్థ గాథ)

జీవితం అంచున -6 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అనారోగ్యంలో మనిషిని వైరాగ్య భావన అమాంతం ఆవహించేస్తుంది. అప్పటి వరకూ వున్న ఉత్సాహాన్ని చప్పగా చల్లార్చేస్తుంది. మనిషిలో అనారోగ్యం కన్నా అనారోగ్యంగా వున్నామన్న ఆలోచన పెనుభూతంలా కబళించేసి మానసికంగా కృంగదీసేస్తుంది. క్వాన్టిఫెరాన్ TB పరీక్ష ఫలితాలు కాళ్ళ కింద భూమిని కదిలించేసాయి. లో లెవెల్ పాజిటివ్. ఎమర్జెన్సీ అటెన్షన్ అంటూ GP నుండి పిలుపు వచ్చింది. ఒక్కసారిగా నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 31

నా జీవన యానంలో- రెండవభాగం- 31 -కె.వరలక్ష్మి           తన చిన్నప్పుడంతా నాకు స్కూల్లోనూ ఇంట్లోనూ సాయం చేస్తూ ఉండిన దుర్గ అనే అమ్మాయి నేను రాసుకుంటూంటే దీక్షగా చూస్తూ ఉండేది. తనకి చదువు నేర్పాలనే నా ప్రయత్నం ఫలించలేదు. ఎక్కువ జీతం వస్తుందని వాళ్ళమ్మ తనని కాకినాడలో రొయ్యల ఫేక్టరీలో చేర్పించింది. ఎప్పుడైనా వాళ్ళూరికి వెళ్తున్నప్పుడో, వచ్చేటప్పుడో జగ్గంపేటలో దిగి నా దగ్గరకి వచ్చేది.          […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 17

వ్యాధితో పోరాటం-17 –కనకదుర్గ ఫోన్ తీసుకొని, “బూస్టర్ షాట్ తీసుకున్నాను డాక్టర్,” అని చెప్పాను. ఏం జరుగు తుందోనని నాకు భయం పట్టుకుంది. “ఓ.కే, నౌ డోంట్ మూవ్, జస్ట్ టేక్ ఇట్ ఈజీ అండ్ ప్లీజ్ రెస్ట్. నువ్వు ఇపుడు ఒకసారి చెకప్ కి రావాలి, రాగలవా?” ” డాక్టర్ ఈజ్ ఎనీధింగ్ రాంగ్? నాకు భయం వేస్తుంది….” నాకు ఏడుపొస్తుంది. చైతు వచ్చి నా చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు. ” ఒకసారి చెక్ చేస్తే […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-30)

నడక దారిలో-30 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కుటుంబంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం , రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-5

నా అంతరంగ తరంగాలు-5 -మన్నెం శారద అమ్మమ్మ ఊరు కాకినాడ గురించి చెప్పానుకదా… ఇప్పుడు నానమ్మ ఊరు ఒంగోలు గురించి చెప్పాలి. మా తాతగారు అమ్మ పెళ్ళికి ముందే చనిపోవడంతో మా పెదనాన్నగారే గుంటూరు లో పనిచేస్తూ ఈ సంబంధం చూశారని చెప్పాను కదా! నాన్నమ్మకు ఈ సంబంధం ఎంత మాత్రం ఇష్టం లేదట! “అంత పెద్ద కుటుంబం నుండి వచ్చిన పిల్ల మనతో ఎక్కడ కలుస్తుంది, వద్దు “అని చాలా గొడవ చేసిందట. అయితే నాన్న […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-14 రాజీ

పేషంట్ చెప్పే కథలు – 14 రాజీ -ఆలూరి విజయలక్ష్మి “ ఈ యిల్లంటే నాకు అసహ్యం. ఇందులో బతుకుతున్న మనుషులంటే నాకు పరమ రోత. ఈ యింటికి, ఈ మనుషులకు దూరంగా పారిపోతాను. నా కంఠంలో ఊపిరుండగా మళ్ళీ ఈ గడపతొక్కను” చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ ని టేబిల్ మీదకు విసిరేసి, కళ్ళు తుడుచుకుని, వానిటీ బాగ్ తీసుకుని విస విసా గుమ్మందాటింది సుచరిత. పైన సెగలు పొగలు కక్కుతున్న సూరీడు కంటే ఎక్కువగా […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-4

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-4 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 21 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం) (చివరి భాగం)

కాళరాత్రి-21 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఏప్రిల్‌ 10వ తేదీన ఇంకా క్యాంపులో 20వేల మంది ఖైదీలున్నారు. వారిలో పిల్లలు కొన్నివందల మంది సాయంత్రానికంతా అందరినీ ఒకేసారి తరలించాలని నిర్ణయించారు. తదుపరి క్యాంపు తగలబెడతారు. అందరినీ పెద్ద అపెల్‌ ఫ్లాట్‌లోకి తోలారు. గేటు తెరుచుకునేలోగా 5 మంది చొప్పున వరుసలు గట్టి ఎదురుచూడాలి. అకస్మాత్తుగా సైరన్లు మోగాయి. జాగరూకతగా. అందరం బ్లాక్స్‌ లోపలికెళ్ళాం. సాయంత్రం మమ్మల్ని తరలించడం సాధ్యం కాదు. […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -5 (యదార్థ గాథ)

జీవితం అంచున -5 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Care for one… that’s love. Care for all… that’s nursing. కనీసం చిన్న పించ్ కూడా తెలియకుండా నర్సు “ఐ యాం సారీ డార్లింగ్” అంటూనే నా రక్త నాళంలో నుండి బోలెడు రక్తం తోడేసింది. మనం ఒకే ఫ్రెటర్నిటి అనుకుంటూ ఆవిడ వైపు ఆత్మీయంగా చూసాను. ఆలూ చూలూ లేకుండా బిడ్డ కోసం కలలని నవ్వుకుంటున్నారా… నా కంటి […]

Continue Reading
Posted On :