సంపాదకీయం-మార్చి, 2026

“నెచ్చెలి”మాట వనితా విజయం -డా|| కె.గీత  నెచ్చెలులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! జయము జయము వనితలందరకు దిగ్విజయము జయము భ్రూణహత్యల నుండి పునర్జనించినాము అత్యాచారముల నుండి తలెత్తుకు లేచినాము జయము జయము వనితలందరకు దిగ్విజయము జయము ఆడపిల్లవని అపహాస్యాలెన్నో పనికిరావని హేళనలెన్నో అన్నిటినీ మెట్లు చేసి అపహాస్యపు మెడలు విరిచి రోదసీకి ఎగసినాము జయము జయము వనితలందరకు దిగ్విజయము జయము కుటుంబమే మూలమని నిట్రాటగా నిలబడినాము గుర్తింపు లేని సహాయాలు చేసి చేసి అనారోగ్యమైనాము మనకోసం కాక […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి యూట్యూబ్ ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!* మీ రచన (కథ / కవిత/ ట్రావెలాగ్/ సాహిత్య ప్రసంగం) ని రికార్డ్ చేసి గూగుల్ డైవ్ లో పెట్టి editor@neccheli.com కు పంపండి. దానితో బాటూ రచన ప్రతిని యూనికోడ్ లో వర్డ్/ గూగుల్ డాక్ లో పంపించడం మర్చిపోకండి. *** నిర్వాహకులు: డా.కె.గీత, సంస్థాపక సంపాదకులు,  నెచ్చెలి అంతర్జాల వనితా మాస […]

Continue Reading
Posted On :

ట్రీట్..! (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ట్రీట్..! (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -గొర్తి వాణి శ్రీనివాస్ రాత్రి పది గంటలు. “సత్యా….రా…!.”భర్త మోహిత్ తీయటి పిలుపు వినపడినా వంటింట్లో ఏదో సర్దుతూ ఉండిపోయింది సత్య… “సత్యా…!నిన్నే….! మళ్ళీ రేపు నేను ఊరెళ్ళిపోతానమ్మా. త్వరగా రా….! ”అన్నాడు. ఆమె రాగానే దగ్గరకు తీసుకున్నాడు. ఆమె “కొంచెం ఆగండీ” అంటూ విడిపించుకోబోయింది.   “సత్యా…నా ఉద్యోగంలో నెలకి పది రోజులు బయట గడపడం కష్టంగా వుంది. నీకు దూరంగా ఉండలేను. అందుకే … […]

Continue Reading

ఆ కలం ఆగితే? (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ఆ కలం ఆగితే? (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -అనసూయ ఉయ్యూరు అచ్యుత టేబుల్ పై వున్న తన సెల్ ఫోన్ లో నోటిఫికేషన్ సౌండ్ రావటంతో దాన్ని చేతుల్లోకి తీసుకుని మెసేజ్ చదివాడు. తన అకౌంట్లోకి పదివేలు జమ అయినట్లు వచ్చిన మెసేజ్ అది. నా ఎకౌంట్ కి 10000 వేలు వేసింది ఎవరబ్బా? అని ఆలోచనలో పడ్డాడు. ఎంత ఆలోచించినా ఎవరు వేసారో అర్థం కాలేదు. ఈలోపు వాట్సాప్ లో అకౌంట్ […]

Continue Reading
Posted On :

ప్రమద- జిలానీ బాను

ప్రమద జిలానీ బాను -నీరజ వింజామరం  అక్షరాల ద్వారా మాట్లాడిన మౌన విప్లవం జిలానీ బాను ఇక లేరు. ఈ వాక్యం చదివిన క్షణంలోనే మనకు ఒక లోటు తెలుస్తుంది — అది కేవలం ఒక రచయిత్రి మరణం కాదు; ఒక సున్నితమైన స్వరం మౌనమైందన్న భావన. కానీ ఆమె అక్షరాలు మాత్రం మౌనమవ్వలేదు. అవి ఇంకా మనలో మాట్లాడుతూనే ఉన్నాయి — మెల్లగా, లోతుగా, ప్రశ్నలతో. ఈ నెల ఆమె జ్ఞాపకార్థం ఈ స్మారక వ్యాసం. […]

Continue Reading
Posted On :

నీహార పథం (ఈ నెల నుండి ప్రారంభం)

“నీహార పథం” – కొండపల్లి నీహారిణి స్వీయ భావ తరంగిణులు -డా. కొండపల్లి నీహారిణి ఉపోద్ఘాతం నేను అమెరికాలో ఉన్నాను. వచ్చి చాలా రోజులైంది. పెద్ద మనుమరాలు, “నానమ్మా ఏదైనా కథ చెప్పవా” అనీ, చిన్న మనుమరాలేమో, “నానమ్మా నీ చిన్నప్పటి స్టోరీ చెప్పవా” అని ఇద్దరూ నా చెరోవైపు చేరారు. ఆ చిన్నారుల  చేతులు నా మెడ చుట్టేసుకున్నాయి. ఒకరు కథ కోసం …ఒకరు గాథ కోసం… “సింహము చిట్టెలుక” కథ చెప్పగానే మరి నీ […]

Continue Reading

అనుకున్నవన్నీ జరిగితే (కథ)

అనుకున్నవన్నీ జరిగితే -యశోదాకైలాస్ పులుగుర్త “నేనీ పెళ్లి చేసుకోలేను మమ్మీ!” “ఏమైందే విన్నూ?”  లక్షణమైన సంబంధం కదే?  ఆ అబ్బాయి ఎందుకు నచ్చలేదు? ఎంత బాగున్నాడు అతను.  అతని అమ్మా నాన్నా ఎంత సౌమ్యంగా ఉన్నారో చూసావా?” “మమ్మీ, నాకు నచ్చలేదంటే సవాలక్ష కారణాలు అవసరం లేదు.  ఒకే ఒక్క కారణం ఏమిటంటే అతను ఒక డబ్బా కాలేజ్ లో డొనేషన్ తో ఇంజనీరింగ్ చదివాడు.  అతని అదృష్టం మూలాన ఒక మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ […]

Continue Reading

వీలునామా (హిందీ: वसीयत – డా. ఆశా పాండే గారి కథ)

వీలునామా वसीयत హిందీ మూలం – – డా. ఆశా పాండే తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు [`చాల్’ అంటే ముంబయిలో ఒక ప్రత్యేకపద్ధతిలో కొన్ని అంతస్తులతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిర్మించిన నివాసగదుల భవనం. ఒక్కొక్క గది ఒక కుటుంబం నివసించే యూనిట్. దీనినే `ఖోలీ’ అంటారు. `మ్హాడా’ అంటే – మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డవలప్ మెంట్ అథారిటీ.] *** ఇక్కడే, ఇదే చోట ఒక చాల్ ఉండేది. […]

Continue Reading

కలతల నిద్ర

కలతల నిద్ర -ఇందు చంద్రన్ కరగని రాత్రులు కలవరపెట్టే ఆలోచనలు ఒక్కోసారి చీకటి అలసి వెలుగొచ్చేస్తుంది. ఎన్నో కలలు రెప్పల బయటే ఎదురు చూస్తుంటాయి. ఇప్పుడంతా కలతల నిద్రే! శిఖరాలని తాకాలన్న ఆశలు ఓ వైపు, ఈదలేని సముద్ర లోతుల్ని గుర్తు చేసబాధలు మరోవైపు, రెండింటి మధ్య అప్పుడపుడూ గడ్డకట్టుకుని పోతూ ఉంటాను. మళ్లీ వాస్తవాన్ని తల్చుకుని కరిగిపోతూ ఉంటాను. ఆ నిద్రని లాక్కోడానికి ప్రయత్నిస్తుంటాను. చుట్టూ ఉన్న ప్రత్యామ్నాయాలతో, ఎంతటి స్వార్థం ! రోజూ జరిగే […]

Continue Reading
Posted On :

ఊహించని సృష్టి (కవిత)

ఊహించని సృష్టి -చందలూరి నారాయణరావు ఈ నిశబ్దం బాధిస్తుంది. సరిగ్గా ఇప్పుడే ఎవరైనా మాట్లాడితే బాగుండు. నా బాధను చెప్పకుండానే తెలుసుకుని ఓదార్చితే బాగుండు. నా అంతట నేనే ఒంటరిగా గొంతు తలుపు తెరచుకుని లోపలికి రమ్మంటే చులకనవుతాను బయటకొచ్చి నిలబడితే పలుచనవుతాను. పూసల దండలా చప్పుడు చేస్తూ నా అక్షరాలను తిరుగుతున్నాయగా లోపలికి తొంగి చూస్తే నన్ను గుర్తుపట్టేవారేగా నేను పడే బాధ కొంచెం అర్థమయ్యేదిగా! ఒక్క భావం వెనుక ఒక్క రాత్రిలో ఎన్ని మెలికలు […]

Continue Reading
gavidi srinivas

ఒక అప్రకటిత శిల ఆమె (కవిత)

ఒక అప్రకటిత శిల ఆమె -గవిడి శ్రీనివాస్ ఆమె ను చూస్తే నువ్వులు పూస్తాయి కలలు వికసిస్తాయి వెన్నెల కురుస్తుంది. ఆమె తొలి నాటి కలల ప్రతిరూపంగా తొమ్మిది నెలల ఆశల ఆకాశాన్ని మోసింది. ఇన్ని కుంకుమ పువ్వుల్ని పాలలో సేవిస్తూ కాసింత కాటుకని కళ్ళలో మెరిపిస్తూ కాలాన్ని కను రెప్పల పై మోసుకు పోయింది. సమయం ఆసన్నమైనాక చిన్న శిశువు ఉదయం కోసం ఆకాశం వంక చూస్తూ కన్నీళ్ళ ను వదిలింది. నల్లని మేఘాలు ఉరిమాయి […]

Continue Reading

ప్రశ్నల తెరచాట్లు (కవిత)

ప్రశ్నల తెరచాట్లు -డా.నూకరాజు బెందుకుర్తి ప్రశ్నలే నీడలు కాదు అవి సూర్యకిరణాల సుడిగుండాలు, మాయాపటలాలు చించి ఆత్మను తెరిచే కత్తిపీటలు. సముద్రం లోతుల్లో మునిగినట్లు, ప్రతి “ఎందుకు?” అనేది మనస్సు ముంచుతుంది, మౌనంలో తేలియాడే నిజాలు ఉప్పు నీటి తెల్లని స్పటికాల్లా మెరుస్తాయి. అజ్ఞానపు గోడలు కూల్చేది సమాధానాలు కాదు, అడగడం అనే నిప్పురవ్వలు! సోక్రటీస్ పెట్టిన ప్రశ్నల మంటలు మరెప్పటికీ ఆరవేమో? ఆత్మ శుద్ధి యజ్ఞంలో ధూమం ఎగిరింది. “ఏది/ఎలా?” అనే ఉల్కాపాతం మనస్సు ఖాళీలో […]

Continue Reading

అనుబంధాలు-ఆవేశాలు – 5 (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 5 – ప్రమీల సూర్యదేవర న్యాయస్థానంలో సురేష్ బోనులో నిల్చుని, భ్రమర హత్య చేయదని, వ్యాధితో బాధపడ్తున్న తమ తల్లిని ఎంతో ఓర్పుగా, ప్రేమగా చూసుకునేదని, తన అక్కకు సాయం చేయవలసిందిగ న్యాయవాదులను అతి దీనంగా వేడుకున్నాడు. తమ్నుడు మట్లాడే సమయంలో కూడ భ్రమర మానసిక స్థితిలో మార్పులేదు. ఇంటి ప్రక్క వారిని సాక్షులుగ న్యాయస్థానానికి రప్పించారు. యజమానిచేత ప్రమాణం చేయించి న్యాయవాది ప్రశ్నించాడు. “ఆ సమయంలో మీరెక్కడ నుండి వస్తున్నారు?” “ఈగ సినిమా రెండవ […]

Continue Reading

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-10 ఓపెన్ హౌస్

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 10. ఓపెన్ హౌస్ అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత “ఓపెన్ హౌసులు చూసి రావడానికి ఈ శనివారం సాయం రమ్మని అడిగింది జెస్సికా” అన్నాను. “ఊ…”అన్నాడు సూర్య. “ఊ..కాదు, అసలు ఓపెన్ హౌసంటే […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-22 సర్దుబాటు

కాదేదీ కథకనర్హం-22 సర్దుబాటు -డి.కామేశ్వరి  రాత్రి ఎనిమిదన్నర అయింది. వంటింట్లో చకచక గిన్నెలు కడిగి, స్టవ్ గట్టు అలికి తుడుస్తుంది సుజాత, “జునూన్” అప్పుడే మొదలవుతుంది టి.వి. లో. సుజాతకి “జునూన్” సీరియల్ ఎంతో ఇష్టం. ఎన్ని పనులున్నా తీరిక చేసుకుని చూస్తుంది. సీరియల్ మొదలయ్యేలోగ పని పూర్తి చేసుకోవాలని గబగబ గట్టు తుడుస్తుండగా కాలింగ్ బెల్ మోగింది. పిల్లలిద్దరూ సీరియల్ ముందు అడ్వర్టయిజ్ మెంట్ శ్రద్ధగా చూస్తున్నారు. రవీంద్ర పొద్దుట పూర్తీ చెయ్యని పేపరు శ్రద్దగా […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-27

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 27 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణుసాయి 1999 లో వివాహంచేసుకుని, మిలీనియం సంవత్సరంలో ఆస్ట్రేలియా గడ్డపై అడుగిడిన జంట. ఆ సమయంలో అప్పటి స్థితి, గతులు, అక్కడ వారికి బంధువులు లేకపోయినా, ప్రదేశాలు ఎక్స్ప్లోర్చేసుకుంటూ, ఆస్ట్రేలియాలో జీవనవిధానానికి అలవాటు పడుతూ సాగుతున్న జంట ప్రయాణం. *** ఇరువురి మధ్య స్నేహ బంధం ఎపుడు ఎలా చిగురిస్తుందో తెలియడం కష్టం. బహుశా కాస్త సర్దుబాటు ఉంటే చాలేమో ఇరువురి మధ్య సత్సంబంధాలు […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మూడవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మూడవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి దగ్గరకు జరిగారు. తుపాకి మోత వచ్చిన వైపుకి చూస్తే సిపాయీలతో నిండిన ఐదు నాగతరులు ముందుకు దూసుకువస్తున్నాయి. అనేకమంది పడవవాళ్లు వేగంగా వేస్తున్న తెడ్ల వరవడికి నీళ్లు అల్లకల్లోలమై వెన్నెలలో కరగిన వెండిదారాలులాగా ఉన్నాయి. ప్రఫుల్ల వెంటనే “ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యటానికి వీలు లేదు, వెంటనే మీ పడవ మీద బయల్దేరండి” […]

Continue Reading
Posted On :

అనుసృజన – ఆడవాళ్లు

అనుసృజన ఆడవాళ్లు మూలం : రమాశంకర్ యాదవ్ విద్రోహీ అనుసృజన: ఆర్ శాంతసుందరి కొందరు స్వేచ్ఛగా ఎందులోనైనా దూకి ఆత్మహత్య చేసుకున్నారు అలా అని పోలీసు రికార్డుల్లో నమోదై ఉంది కొంతమంది ఆడవాళ్ళు స్వయంగా చితి మంటల్లో పడి ఆత్మాహుతి చేసుకున్నారు. అలా అని మతగ్రంథాల్లో ఉంది నేను కవిని, కర్తని తొందరేముంది ఏదో ఒక రోజు పోలీసులనీ పురోహితులనీ కట్టకట్టుకుని రమ్మని స్త్రీల న్యాయస్థానానికి పిలిపిస్తాను మిగతా న్యాయస్థానాలన్నిటినీ రద్దు చేసేస్తాను స్త్రీలకీ పిల్లలకీ వ్యతిరేకంగా […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-63)

నడక దారిలో-63 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading

వ్యాధితో పోరాటం- 39

వ్యాధితో పోరాటం-39 –కనకదుర్గ “ఓకే, ఓకే… ఇదిగో వెళ్తున్నా…” అని కర్టెన్ తీసి అటువైపు నిల్చున్నాడు. నర్స్ తన ముందునుంచే వెళ్ళినా ఏం చెప్పలేదు. ఆమెకి చెప్పినా, ’ఇపుడేగా ఇచ్చింది, కాసేపయ్యాక వచ్చి చూస్తాను,’ అని అంటుందని నాకు తెల్సు. కానీ భరించలేని ఈ నొప్పితో శ్రీని పైన కోపం వస్తుంది. మళ్ళీ నాకే అనిపిస్తుంది, ’పాపం తను మాత్రం ఏం చేస్తాడు?’ ఆ తర్వాత రెండు సార్లు అరగంటకి, మళ్ళీ గంటకి ఇచ్చారు. దాంతో కొంచెం […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-35

నా అంతరంగ తరంగాలు-35 -మన్నెం శారద నేను సిస్టర్ -సిస్టర్ నవల రాయడానికి ముందు కధ …………………. 1984లో హైదరాబాద్ లోని బొగ్గులకుంట లో [తిలక్ నగర్ ]లో చాలా పెద్ద ఎత్తున రచయిత్రుల సభలు మూడు రోజులపాటు జరిగాయి. మొదటి రోజు ప్రముఖ తమిళ రచయిత్రి శ్రీమతి శివశంకరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభ ఉపన్యాసం చేసారు . రెండవరోజు శ్రీమతి మాలతీచందూర్ గారి అధ్యక్షతన నేను ,శ్రీమతి అరవింద [ప్రముఖ రచయిత్రి A .Sమణిగారు]ప్రసంగించ వలసి […]

Continue Reading
Posted On :

నా కళ్ళతో అమెరికా -7 (లేక్ తాహో)

నా కళ్ళతో అమెరికా -7 లేక్ తాహో డా|| కె. గీతామాధవి “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. ***** డా||కె.గీతడా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో […]

Continue Reading
Posted On :

కథావాహిని-33 ‘దీపధారి’ స్వర్ణ కిలారి కథ

కథావాహిని-33 దీపధారి తెలుగు అనువాదం : స్వర్ణ కిలారి గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ […]

Continue Reading

వినిపించేకథలు-57 – షామీర్ జానకీ దేవి కథ “జ్ఞాపకం”

వినిపించేకథలు-57 జ్ఞాపకం రచన : షామీర్ జానకీ దేవి గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో […]

Continue Reading
K.Geeta

గీతామాధవీయం-54 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-54 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-54) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) ఆగష్టు 20, 2022 టాక్ షో-54 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-54 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

ఒమన్ దేశపు అనుభూతులు

ఒమన్ దేశపు అనుభూతులు -డా.కందేపి రాణి ప్రసాద్ చమురు దేశం ఎడారి దేశం, గల్ఫ్ దేశం అని రకరకాల పేర్లు కలిగిన ఒమన్ దేశాన్ని చూడాలనుకున్నాం. దుబాయి దేశాన్ని చూసి పనిలో పనిగా ఒమన్, సౌదీ అరేబియా దేశాన్ని కూడా చూడాలని అనిపించింది. మా సిరిసిల్ల ప్రాంతం నుంచి ఒమన్ దేశ రాజధాని మస్కట్ వెళ్ళిన వారు ఇంటికొకరు ఉంటారు. ఈ ఒమన్ దేశం అరేబియా సముద్ర తీరాన ఉన్న దేశం. ఇక్కడ ఒమన్ రియాల్స్ కరెన్సీగా […]

Continue Reading

యాత్రాగీతం-77 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-12

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-12 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** ఇంగ్లాండ్ -లండన్ (రోజు-2) లండన్ నగర విహారం – హైడ్ పార్క్ & ట్రఫాల్గర్ స్క్వేర్ మర్నాడు పొద్దున్నే […]

Continue Reading
Posted On :

బంతులవాన (బాల నెచ్చెలి-తాయిలం)

బంతులవాన -అనసూయ కన్నెగంటి దినకర్ బడిలో టీచర్. అయినప్పటికీ అతనికి ఆటలంటే మహా ఇష్టం. దాంతో పాఠాలు చెప్తూనే ఏ బడిలో పని చేస్తే ఆ బడిలో ఆటలంటే ఇష్టం ఉన్న పిల్లలను మంచి ఆటగాళ్ళుగా తయారు చేసేవాడు. వాళ్ళు ఆటల్లో ప్రావీణ్యం సంపాదించాకా వాళ్ళను జిల్లా స్ధాయి పోటీల్లో పాల్గొనేలా చేయాలని ప్రయత్నాలు చేసుకునే సమయంలో అక్కడి నుండి బదిలీ అయ్యేవాడు. ఎప్పుడూ అంతే. ఇప్పుడు రామనాధపురంలో ఉన్న బడికి బదిలీ అయి వచ్చాడు. రాగానే […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

జల చక్రం

జల చక్రం -కందేపి రాణి ప్రసాద్ సముద్రుడి ఏకైక గారాల కూతురు నీరు ఆమెకు జల కుమారి అని పేరు పెట్టి ప్రేమగా పెంచుకుంటున్నాడు. అమ్మాయి ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉంటుంది. ఒక్కచోట నిలవదు ఉన్నచోట ఉండకుండా ప్రవాహంలా కదిలిపొతూనే ఉంటుంది. ఆమెకు ఒక్కచోట నిలబెట్టటం చాలా కష్టమైన పని. జలకుమారి యవ్వనానికి వచ్చాక పెళ్లి చేయాలని తలచాడు తండ్రి. ఉరకలు వేస్తూ ఉత్సాహంగా నింగి నందుకోవాలని ఎగిరి గంతులు వేస్తుంది. సముద్రుడు అమ్మాయికి గొప్ప సంబంధం […]

Continue Reading

కనక నారాయణీయం-78

కనక నారాయణీయం -78 –పుట్టపర్తి నాగపద్మిని కనకమ్మగారు పడసాలలోనే ఉన్నారు. వల్లంపాటిని చూస్తూనే నవ్వుతూ అడిగారు,’వచ్చిన పని ఏమైందప్పా?’ అని! ముఖం వేలాడేసుకుని ఉన్న వల్లంపాటిని చూస్తూనే అర్థమైపోయిందామెకు. పనికాలేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు వల్లంపాటి. ‘ఇంతకూ, నువ్వు తెచ్చిన ఆ వ్రాత ప్రతి ఎక్కడ?’ అడిగారు శ్రీమతి పుట్టపర్తి. వెంకట సుబ్బయ్య బ్యాగ్ లో నుంచీ పుస్తకం తీస్తూ ఉంటే ఇంతలో తులజ లోపలికి వచ్చింది. వెంకట సుబ్బయ్యను చూడగానే,’బాగున్నారా అన్నా?’ అంది. ‘బాగున్నానమ్మా! ఇంతకూ […]

Continue Reading

చిత్రం-72

చిత్రం-72 -గణేశ్వరరావు ప్రముఖ చిత్రకారుడు చంద్రను తెలియనివాళ్ళు వానలో తడవని వాళ్ళు ఉండరు. చంద్ర కథకుడు కూడా. అతని కథలు చదవడం, అతని బొమ్మలు చూడటం వేరు.. వేరు; చంద్రను ప్రముఖుల దృక్కోణంనుంచి చూడటం వేరు. స్థూలంగా వాళ్ళందరు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఒకటే – చంద్ర గొప్ప చిత్రకారుడు, కానీ ఆ విషయాన్నే ఒక్కొక్కరు ఒక్కక్క రీతిలో వాటిని వెలిబుచ్చుతారు. ఒకే ఇతివృత్తాన్ని తీసుకొని పదిమంది రాసినప్పుడు కథా శిల్పం ఒకేలా ఉండదు కదా! అందరూ చంద్ర […]

Continue Reading
Posted On :

Tempest of time (poems)

Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga 37. Sounds Sums crossed fences, Swindlers’ eyes have no moisture; they’re carrying the waves of broken hands. When efforts to take them haven’t failed and Earth became a sieve of showers, burnt rice emits a human smell to some, smells of cremation to others. Some brains […]

Continue Reading

Carnatic Compositions – The Essence and Embodiment-58

Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover the […]

Continue Reading
Posted On :

Need of the hour -68

Need of the hour -68          -J.P.Bharathi A Shift in Toy Culture Until the late 1990s, toy options were relatively modest. We had traditional wooden toys, Kondapalli bommalu (handcrafted figurines from Andhra Pradesh), toy kitchen sets made of metal or clay, and minimal plastic usage. Over the past three decades, however, we’ve […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-46 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 46 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Sameera comes to meet her mother’s friend, Udayini, who runs a women’s aid organization “Sahaya” in America. Sameera gets a good impression of Udayini. Four months pregnant, Sameera tells her that she wants to […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఫిబ్రవరి, 2026

“నెచ్చెలి”మాట నమ్మకం -డా|| కె.గీత  ఈ ప్రపంచము నందు ఎవరిని నమ్మవలెను? ఎవరిని నమ్మరాదు? అయ్యబాబోయ్ ఏవిటా క్లిష్టాతిక్లిష్టమైన ప్రశ్న? అయినా ఇదేవైనా పరీక్షాపత్రమా? జీవితం- అయినా నమ్మడానికి నమ్మకపోవడానికి ఎవరి నమ్మకాలు వారికుంటాయ్ నమ్మేవారు ఏది ఎటుల వున్నను గుడ్డిగా నమ్మువారు మోసగింపబడినా నమ్మువారు కరిపివేపాకు వలె తీసివేయబడుచున్నా నమ్మువారు ….. ఇట్లు పలు రకములు నమ్మనివారు ఎవరినీ నమ్మరు దేనినీ నమ్మరు మరి ఈ ప్రపంచము నందు ఎవరినైనా నమ్మవలెనా? నమ్మరాదా? క్లిష్టాతిక్లిష్టమైన చిక్కు […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి యూట్యూబ్ ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!* మీ రచన (కథ / కవిత/ ట్రావెలాగ్/ సాహిత్య ప్రసంగం) ని రికార్డ్ చేసి గూగుల్ డైవ్ లో పెట్టి editor@neccheli.com కు పంపండి. దానితో బాటూ రచన ప్రతిని యూనికోడ్ లో వర్డ్/ గూగుల్ డాక్ లో పంపించడం మర్చిపోకండి. *** నిర్వాహకులు: డా.కె.గీత, సంస్థాపక సంపాదకులు,  నెచ్చెలి అంతర్జాల వనితా మాస […]

Continue Reading
Posted On :
Penugonda Sarasija

మేనత్త (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

మేనత్త (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -సరసిజ పెనుగొండ తేజు పెళ్లి అని తలచుకోగానే మనసులో ఎంతో సంతోషం. ఈరోజు కోసం ఎంతగా ఎదురు చూశానో? ఇన్నాళ్ళకి ఆ సమయం రానే వచ్చింది. హడావిడిగా బీరువాలోని బట్టలన్నీ తీసి మంచం మీద కుప్పగా పోసాను. పెళ్ళికి తీసుకువెళ్లాల్సిన సామాన్ల లిస్టు చూస్తూ ఒక్కొక్కటిగా సర్దడం మొదలు పెట్టాలి అని అనుకుంటూ ఉండగానే  “అమ్మాయి “అంటూ పక్కింటి ఆంటీ గొంతు వినిపించింది. “ఆ “అంటూ బయటికి వచ్చాను. […]

Continue Reading
Posted On :

పచ్చని కుటుంబం (బాల నెచ్చెలి-తాయిలం)

పచ్చని కుటుంబం -అనసూయ కన్నెగంటి అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో నీరు చాల తక్కువ. దాంతో ఆ ఊరి ప్రజలు అక్కడికి దూరంగా ఉన్న నది వరకూ వెళ్ళి నీళ్లను కడవలతో పట్టి తెచ్చుకుంటూ ఉంటారు. కష్టపడి అంత దూరం నుంచి తెచ్చుకోవటం వల్ల ఆ ఊరి ప్రజలు నీటిని చాల పొదుపుగా వాడుకుంటూ ఉంటారు. కిట్టూ ఆ ఊరి బడిలో చదువుకుంటున్నాడు. రోజూ బడికి భోజనంతో పాటు సీసాతో నీళ్ళు పట్టుకుని వెళుతూ ఉంటాడు. […]

Continue Reading
Posted On :

ప్రమద- ఇందిరా ధనరాజ్ గిర్

ప్రమద ఇందిరా ధనరాజ్ గిర్ -నీరజ వింజామరం  ఆమె ఒక సంపన్నమైన రాజకుటుంబంలో పుట్టింది. ఒక విప్లవ కవిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. బహుభాషా కోవిదురాలు. కవిత్వం చెప్పడంలో అందె వేసిన చేయి. ఒకే  ఇంట్లో ఇద్దరు కవులు ఉండకూడదని తనకు ప్రాణమైన కవిత్వాన్ని వదిలేసింది. ఇలా పరస్పర భిన్నాలను తన వ్యక్తిత్వంలో ఇమడ్చుకున్న అద్భుత మహిళ శ్రీమతి ఇందిరా దేవి ధనరాజ్ గిర్. శ్రీమతి ఇందిరా దేవి ధనరాజ్ గిర్ భారతీయ సాహిత్య రంగంలో, ముఖ్యంగా […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-22 డా||కె.గీత కాలమ్స్ “అనగనగా అమెరికా”

ఈ తరం నడక – 22 డా||కె.గీత కాలమ్స్ “అనగనగా అమెరికా” -రూపరుక్మిణి అందరికీ రాబోయే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! సప్త సముద్రాల ఆవలికి చేసే ప్రయాణంలో ఎన్నో ఆశలతో భవిష్యత్తుని అందంగా నిర్మించుకోవాలన్న సంకల్పంతో ప్రయాణించే వారే ఎక్కువ. అమెరికా జనాభాలో తెలుగువారి లోగిళ్ళు ఎక్కువే. తెలుగు ప్రాంతం నుంచి అమెరికా వలస వెళ్లిన అనేక కుటుంబాలు వున్నాయి. అర్థ శతాబ్దం నుండి ఈ ప్రయాణం, ఈ వలస ఎక్కువగానే ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. […]

Continue Reading
Posted On :
Suguna Sonti

మీమాంస (కథ)

మీమాంస -అక్షర ఇండియన్ నేవీ నుంచి ఉద్యోగ విరమణ చెంది మా నాన్నగారికి ఏడాది అవుతున్నది. మా నాన్నగారికి మంచి స్నేహితుడు, సహకర్మచారి అయిన రామనాథం గారు సంవత్సర వ్యత్యాసంలో ఉద్యోగ విరమణ పొందారు. చిన్నప్పటి నుంచీ ఒకే దగ్గర ఒకే కాలనీలో ఉండటం వల్ల మా మొత్తం కుటుంబానికి మిగతా కుటుంబాలికి మధ్య మంఛీ స్నేహం కుదిరి ,ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలగోవటం పరిపాటి. నేను పెళ్లి అయి వైజాగ్ నుంచి ముంబై కోలాబాలో […]

Continue Reading
Posted On :

వాత్సల్యం (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

వాత్సల్యం (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -సీతాసుస్మిత ’సీతాపురం కాలనీ’ అని అందంగా చెక్కి ఉన్న ఆర్చి చూస్తూ కారు దిగింది వాత్సల్య. ఎదురుగా వాచ్మెన్ రూముకి వెళ్లి, తను ఫలానా ఇల్లు కొనుకున్న సంగతి చెప్పింది. “నమస్తే మేడం! ఇక్కడ మీరు పేరు, ఫోన్ నంబర్ రాసి సంతకం చేయండి. ఎవరైనా కొత్తవారు వస్తే మీకు ఫోన్ చేసి చెప్తాను.” అన్నాడు వాచ్మెన్ రిజిస్టర్ ఆమె ముందుకు నెడుతూ. వాచ్మెన్ చెప్పింది చేసి, […]

Continue Reading
Posted On :

ఆడపిల్లలున్న ఇల్లు (హిందీ: ‘लड़कियों वाला घर’ (సుభాష్ నీరవ్ గారి కథ)

ఆడపిల్లలున్న ఇల్లు लड़कियों वाला घर హిందీ మూలం – – సుభాష్ నీరవ్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు అద్దెకి ఉంటున్న ఇల్లు విడిచిపెట్టి గవర్నమెంటు క్వార్టరుకి వచ్చిన సంతోషం ఇంత తొందరగా రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుందని మిసెస్ శర్మ ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళకి క్వార్టరు ఎలాట్ చేసిన ప్రభుత్వ కాలనీలో టైప్-టూ క్వార్టర్లలో రెండు అంతస్తులు బ్లాక్ చేసి ఉంచారు. ఈ క్వార్టర్లు క్లర్కు స్థాయికి చెందిన వారి కోసం […]

Continue Reading

తులసి (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

తులసి (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -సురేష్ బాబు తులసి పదేళ్ల పిల్ల.  చిత్రకారులు చిత్రించే దేవతామూర్తులకు మల్లె పెద్ద కళ్ళు మంచి ముఖ నిర్మాణం. తోటి పిల్లలతో సరదాగా గడిపే అమాయకత్వం. పొద్దున్నే లేచి వేడి నీళ్లు పెట్టి కాఫీ కాచి అమ్మానాన్నలకు ఇచ్చి తలంటుకుని అల్పాహారం తర్వాత బుద్ధిగా స్కూల్ బ్యాగ్ మోసుకుంటూ స్కూల్ కెళ్ళి పాఠాలు శ్రద్ధగా విని సాయంత్రం అందరితో ఆడుకుని స్నానం చేసి గుడికి వెళ్లి అందరి […]

Continue Reading
Posted On :

కాలం ఎదుట సమాజం (కవిత)

కాలం ఎదుట సమాజం -ఎల్ ఎన్ కొల్లి కాలం పరచిన సామూహిక జీవన మార్గంలో మనిషి ఒంటరిగా నడవడు— అతని అడుగుల వెనుక తరతరాల శ్వాస నిశ్శబ్దంగా నడుస్తూ ప్రతి పాదముద్ర ఒక చరిత్ర ప్రతి మలుపు ఒక సామాజిక పరీక్ష పువ్వుల మధ్యనే ముల్లు అభివృద్ధి పక్కనే అన్యాయం సౌకర్యాల నీడలోనే వేదన వాటిని గుర్తించడమే సమాజపు తొలి పరిపక్వత భయాలు గాలిలా వ్యాపిస్తాయి వీడ్కోలు మౌనంగా అలవాటవుతాయి ఒకప్పుడు కార్చిన కన్నీళ్లు కాలపు మట్టిలో […]

Continue Reading
Posted On :

మారాల్సింది మనమే (కవిత)

మారాల్సింది మనమే – సాయి కిషోర్ గిద్దలూరు మారాల్సింది మనమే కాలాన్నే మారమని ఎలా అంటావ్… అనుకోకుండా జరిగే పరిణామాలకు కాలాన్నే నిలదీస్తావా? అలాగైతే ముందుగా నిన్ను నువ్వు నిలదీసుకోవాలి… నువ్వేం చేస్తున్నావ్ మాటలతో సరిపెడుతూ ముచ్చట్ల నడుమ కాలంతో గడిపేస్తున్నావ్… ఎవరిది తప్పు సమయందా లేక నీదా? ***** సాయి కిషోర్ గిద్దలూరునా పేరు గిద్దలూరు సాయి కిషోర్. మా ఊరు రాయదుర్గం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్. నా తల్లిదండ్రులు మురళి,లక్ష్మి. నాకు చెల్లెలు ఉంది. ఎక్కువగా […]

Continue Reading

మార్పు (కవిత)

మార్పు -ఎరుకలపూడి గోపీనాథరావు అగచాట్ల పోటులను, అదవదల కాటులను, వంచనల పాటులనూ అమితంగా అనుభవించిన ఆతనిని బాధల గిలి ఇక ముట్టలేదు! ప్రభుత్వ ప్రణాళికల ప్రదర్శనల చేత, పాలకుల ప్రతిజ్ఞల ప్రవాహల చేత, బాబాల భవిష్య వాణి ఫర్మానాల చేత, జాతక చక్ర తంత్ర జాల తీర్మానాల చేత అనేక మార్లు మోసగించబడి విసిగి వేగి వేసారిన అతనిని పరాభవాల గేళి ఇక చుట్టుముట్ట లేదు! ఆశల పత్రాలను రాల్చే శిశిర కాలానంతరం అభిలాషలను వికసింపజేసే వసంత […]

Continue Reading

అనుబంధాలు-ఆవేశాలు – 4 (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 4 – ప్రమీల సూర్యదేవర “మంత్రిగారి నుండి అనుమతి పత్రం తీసుకుని లోపలకు రావటానికి మీ అనుమతి పొందగలిగాను. ఇక్కడ మీ సహాయం, సహకారం లభిస్తాయని ఆశిస్తున్నాను.” ఈవిడ తీరు చూస్తే ముందుముందు నేను రావటానికి అనుమతినివ్వదేమోననే అనుమానం ఒకప్రక్క కలవర పెడ్తుండగా అన్నాను. “ఇదంతా మాకుక్రొత్త , పై అధికారులకు తెలియజేసి వారేం సలహా ఇస్తారో చూడాలి. మీరు–మేము–ఇద్దరం ఎలా మొదలు పెట్టాలో, ఎలా కొనసాగించాలో వారి నుండి అనుమతి రావల్సిందే. ఈ […]

Continue Reading

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-9 సింగిల్ మామ్

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 9. సింగిల్ మామ్ అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత అపార్ట్ మెంట్ మారి సంవత్సరం కావస్తూన్నా అలీసియాతో అప్పుడప్పుడూ ఫోనులో మాట్లాడుతూనే ఉన్నాను. తను అవతలి నుంచి స్పానిష్ లోనూ, ఇట్నించి నేను […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-21 తిరిగిరాని గతం 4

కాదేదీ కథకనర్హం-21 తిరిగిరాని గతం – 4 -డి.కామేశ్వరి  ఇప్పటివరకూ ఏ పురుషుడు ఆమెని ఎట్రాక్ట్ చెయ్యలేదు. యూనివర్శీటీలో కొలీగ్స్ అంతా పెళ్ళయిన వాళ్ళు…..ముసలి భావాలి, సంసారజంజాటాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు తప్ప స్మార్ట్గా, చలాగ్గా వుండే మగవాడే ఆమెకి పరిచయం కాలేదు. అలా అనేకంటే ఆమె పరిచయం చేసుకోలేదు. ఒకరిద్దరు ప్రొఫెసర్లు మహిమ పెళ్ళి కానిదని కాస్త చొరవ తీసుకోడానికి ప్రయత్నించి, ఆకర్షించాలని ప్రయత్నం చేసినా మహిమ అలాంటి అందరినీ దూరంగానే వుంచేది. జీవితం అంటే యూనివర్శీటీ, […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-26

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 26 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణుసాయి 1999 లో వివాహం చేసుకుని, మిలీనియం సంవత్సరంలో ఆస్ట్రేలియా గడ్డపై అడుగిడిన జంట. ఆ సమయంలో అప్పటి స్థితి, గతులు, అక్కడ వారికి బంధువులు లేకపోయినా, ప్రదేశాలు ఎక్స్ ప్లోర్ చేసుకుంటూ, ఆస్ట్రేలియాలో జీవన విధానానికి అలవాటు పడుతూ సాగుతున్న జంట ప్రయాణం. *** మనిషికి వచ్చే కోపతాపాలు క్షణికం. ఆ క్షణికావేశంలో కలిగే ఆలోచనలు, మాటలు, చేతలకు ఒక్కోసారి అర్థంపర్థం ఉండవు. […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మూడవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మూడవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి వైశాఖ శుక్ల సప్తమి దగ్గర పడింది. ఋణం తీర్చటం గురించి హరివల్లభ బాబు ప్రయత్నమేమీ మొదలుపెట్టలేదు.  ఇప్పుడు సంపన్నుడే, ఋణం చెల్లించటానికి డబ్బు కూడబెట్టగలడు, కానీ, ఆ ప్రసక్తి ఎక్కడా లేదు. సమయం మీదకు వస్తున్నదని వ్రజేశ్వర్ తండ్రికి గుర్తు చెయ్యబోతే, తండ్రి కొడుకు మీద కేకలు వేసాడు. ఋణం చెల్లించటానికి ఇంకొక నాలుగు రోజులు మాత్రమే వుంది […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-62)

నడక దారిలో-62 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,. అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ […]

Continue Reading

వ్యాధితో పోరాటం- 38

వ్యాధితో పోరాటం-38 –కనకదుర్గ ఇలా తమకు వీలైనంత వారు సాయం చేసే వారిని చూస్తే రక్తసంబంధీకులే కుటుంబ సభ్యులు కానక్కర్లేదు, మన కష్టం అర్ధం చేసుకుని ముందుకు వచ్చి సాయం చేయడానికి వచ్చే వారంతా మన కుటుంబం వారే అనిపిస్తుంది. కుటుంబ సభ్యులు మనకి అవసరం వున్నపుడు కాక అంతా సద్దుకున్నాక దేశం చూడడానికి రావాలనిపిస్తే వారు కుటుంబ సభ్యులకన్నా మనతో ఏ సంబంధం లేని అపరిచితులనిపిస్తుంది. నాకు ఇంత మంచి స్నేహితులు దొరికినందుకు సంతోషమనిపిస్తుంది. వీళ్ళే […]

Continue Reading
Posted On :

నా కళ్ళతో అమెరికా -6 (మౌంటెన్ వ్యూ )

నా కళ్ళతో అమెరికా -6 మౌంటెన్ వ్యూ డా|| కె. గీతామాధవి “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. ***** డా||కె.గీతడా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో […]

Continue Reading
Posted On :

కథావాహిని-32 ‘కొత్త బంగారు లోకం’ అనిశెట్టి శ్రీధర్ కథ

కథావాహిని-32 కొత్త బంగారు లోకం తెలుగు అనువాదం : అనిశెట్టి శ్రీధర్ గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం […]

Continue Reading

వినిపించేకథలు-56 – వడ్డెర చండీదాస్ కథ “సావిత్రి”

వినిపించేకథలు-56 సావిత్రి రచన : వడ్డెర చండీదాస్ కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో […]

Continue Reading
K.Geeta

గీతామాధవీయం-53 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-53 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-53) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) ఆగష్టు 14, 2022 టాక్ షో-53 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-53 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

విక్టోరియా రాణి స్మారక చిహ్నం

విక్టోరియా రాణి స్మారక చిహ్నం -డా.కందేపి రాణి ప్రసాద్ యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండు దేశాల రాణి క్వీన్ విక్టోరియా అత్యధిక కాలం పరిపాలన సాగింది. 1837 వ సం.. నుండి 1901 లో ఆమె మరణించేంత వరకూ రాణిగా కొనసాగింది. 1857 వ సం..లో సిపాయిల తిరుగుబాటు తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి క్రౌన్ కు భారతదేశం మార్చబడింది. ఈ సమయంలో గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయిగా పిలవడం […]

Continue Reading

యాత్రాగీతం-76 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-11

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-11 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** ఇంగ్లాండ్ -లండన్ (రోజు-1) టవర్ బ్రిడ్జి తీరం & ఇంగ్లాండు సాహితీమిత్రులు టవర్ బ్రిడ్జి తీరం: సాయంత్రం అయిదుగంటల […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

కలుషిత ఏరు

కలుషిత ఏరు -కందేపి రాణి ప్రసాద్ సమశీతోష్ణ ఆడవులలో జింకలు నివసిస్తున్నాయి. జింకలు చాలా అందంగా ఉంటాయి. వేగంగా పరిగెడతాయి. చురుకుగా ఉంటాయి. జింకలన్నీ ఒకే చోట నివసిస్తున్నాయి. అన్నీ సమూహంగా కలిసిమెలిసి ఉంటాయి. జింకల్లో మచ్చలున్న జింకల్నీ ‘కృష్ణ జింకలు’ అంటారు. కొమ్ములున్న జింకలు మగ జింకలు. వీటి కొమ్ములు మూడు, నాలుగు మెలికలు తిరిగి రెండు అడుగుల పైగానే పెరుగుతాయి. మగ జింకలు బలిష్టంగా ఉంటాయి. ఆడ జింకలకు కొమ్ములు ఉండవు. జింకలు సమూహాలుగా […]

Continue Reading

రాగసౌరభాలు- 23 (సురటి రాగం)

రాగసౌరభాలు-23 (సురటి రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులారా! నమస్తే. గత రెండు సంవత్సరాలుగా ఏకాధాటిగా సాగుతున్న రాగ సౌరభాలు వ్యాస పరంపరని ఆదరిస్తున్న అందరికి అనేక ధన్యవాదములు.  మంగళకరమైన సురటి రాగ వైభవంతో ఈ వ్యాసావళికి మంగళం పలుకుతున్నాను. రాగాలు అనంతాలు. లక్షల సంఖ్యలో ఉన్న రాగాలలో కొన్నింటిని నా శక్తి మేరకు పరిచయాన్ని అందించాను. ఈ నెలతో ఈ పరిచయాలకు స్వస్తి. సురటి రాగం పురాతనమైనదే. కొన్ని సంప్రదాయ కీర్తనలు, మంగళ హారతులు […]

Continue Reading

కనక నారాయణీయం-77

కనక నారాయణీయం -77 –పుట్టపర్తి నాగపద్మిని బైట వల్లంపాటి వెంకట సుబ్బయ్య నిలుచుని ఉన్నాడు. ‘నువ్వా నాయనా!రా రా! ఇంట్లో అంతా బాగున్నారా?’ ఆప్యాయంగా అడిగిందామె. ‘బాగున్నారమ్మా! అయ్యగారు ఉన్నారామ్మా ఇంట్లో?’ ‘లేరయ్యా, రామకృష్ణ సమాజంలో ఉన్నారేమో!’ ‘సరేనమ్మా! నేనక్కడికే  పోతాను.’ ‘ఊరికేనా, ఏమైనా పనుందా?’ యధాలాపంగా అడిగిందామె. తాను తెచ్చిన అరటి పళ్ళ సంచీని అమ్మకు అందిస్తుంటే ‘ఎందుకయ్యా ఇవన్నీ?’ అన్నదా తల్లి. ‘పెద్దవాళ్ళ దగ్గరికి వట్టి చేతులతో పోకూడదంట, మా అమ్మ అంటూ ఉంటుంది. […]

Continue Reading

బొమ్మల్కతలు-37

బొమ్మల్కతలు-37 -గిరిధర్ పొట్టేపాళెం జీవితం ఒంటరి ప్రయాణమే. ఒంటరిగా రావటం, ఒంటరిగానే వెళ్ళి పోవటం. రాకపోకల మధ్య నీ ఊపిరి నీదే, నీ అడుగులు నీవే, నీ నడక నీదే, నీ పయనం నీ గమ్యం రెండూ నీవే. నువ్వేసే అడుగులూ, నువు నడిచే దార్లూ ఒంటరివే. తెలియని గమ్యం వైపు నువ్వేసే నీ అడుగులే నీ దిశ నిర్దేశ మార్గాలు. నీ పయనంలో నువు నడిచే బాటలు, ఆ బాటల్లో నీకెదురయ్యే ప్రదేశాలూ, నువు కలిసే […]

Continue Reading

చిత్రం-71

చిత్రం-71 -గణేశ్వరరావు క్రిస్టియన్ మత సంప్రదాయంలో ‘ ఐకన్ ‘ చిత్రకళకు ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యం ఉండేది. మతాధికారులు బైబిల్ కు సంబంధించిన కథల చిత్రాలను, దైవ రూపాలను చిత్రించమని చిత్రకారులని కోరేవారు. చిత్రకారులకు లొంగని వస్తువంటూ వేరే లేదు. వారు రూప చిత్రాలను అద్భుతంగా చిత్రించే వారు. ఆ ‘ ఐకన్ ‘ లలో కేవలం ముఖాలను మాత్రం చిత్రించే వారు. వాటిని చర్చీలు, జనం ఆదరించే వారు. అవి ప్రజల్లో భక్తి భావాన్ని కలగజేసేవి. […]

Continue Reading
Posted On :

Tempest of time (poems)

Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga 36. Lamp of Soul Sthavara, Jangama have turned into definite symbols simultaneously, transmitting hidden fire of venom. Today’s disasters are throwing challenges to this topsy-turvy world! Nature loves us. Doesn’t it? Our nature is changing, committing unnecessary errors, throwing even innocents in curse wells. Rise and kindle […]

Continue Reading

Carnatic Compositions – The Essence and Embodiment-57

Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover the […]

Continue Reading
Posted On :

Need of the hour -67

Need of the hour -67          -J.P.Bharathi The Colourful Irony of Modern Toys: Who Are We Really Buying Them For? Walk into any toy store or scroll through an online baby catalogue, and you’ll be dazzled by a kaleidoscope of colour, sound, and promise. From plush animals that sing lullabies to interactive […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-45 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 45 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Sameera comes to meet her mother’s friend, Udayini, who runs a women’s aid organization “Sahaya” in America. Sameera gets a good impression of Udayini. Four months pregnant, Sameera tells her that she wants to […]

Continue Reading
Posted On :

Avatar Fire and Ash is an Allegorical Treat of Great Inhuman Exploitation of Nature!

Avatar Fire and Ash is an Allegorical Treat of Great Inhuman Exploitation of Nature! – V.Vijaya Kumar I watched Avatar Fire & Ash movie at Celebration Cinema Crossroads & IMAX, near Vicksburg, Michigan, while the whole world is busily engaged in celebration mood on Christmas Day!  Usually very few, less than 20,  I found in […]

Continue Reading
Posted On :

Unquenchable fire ( Telugu Original Chedabattani Agni by Dr. Kondapalli Niharini)

Unquenchable fire ( Telugu Original Chedabattani Agni by Dr. Kondapalli Niharini) (Original: చెదబట్టని అగ్ని (From Raachippa – A collection of stories by Dr. Kondapalli Niharini.) Translated by – Padmavathi Neelamraju “Pramila… Pramila… what are you doing?” Anasuyamma said loudly, A heartfelt attachment alone knows the difference between shouting and calling, all that is expressed whenever […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జనవరి, 2026

“నెచ్చెలి”మాట “కొత్త” ఉత్సాహం – 2026 -డా|| కె.గీత  కొత్త ఏడాది వచ్చేసిందోచ్- హ్యాపీ న్యూ ఇయర్ 2026 ఆ సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి ఇందులో “కొత్త” ఏవుందటా? అసలు ఉత్సాహం ఏవుందట! అదే మరి అలా నిరుత్సాహ పడితే ఎలా? జీవితం చివరాఖర్న ఏవుందటా? అంతా ప్రతిదినంబునందే యున్నది అని యనుకొనవచ్చు కదా అలా ఈసురోమని పడి ఉండకుండా ఏదోలా కాస్త ఉత్సాహం కొని తెచ్చుకోవచ్చు కదా! అదేనండీ ఎక్కణ్ణించొస్తుంది కొత్త ఉత్సాహం అదేదో సెలవియ్యండి […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి యూట్యూబ్ ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!* మీ రచన (కథ / కవిత/ ట్రావెలాగ్/ సాహిత్య ప్రసంగం) ని రికార్డ్ చేసి గూగుల్ డైవ్ లో పెట్టి editor@neccheli.com కు పంపండి. దానితో బాటూ రచన ప్రతిని యూనికోడ్ లో వర్డ్/ గూగుల్ డాక్ లో పంపించడం మర్చిపోకండి. *** నిర్వాహకులు: డా.కె.గీత, సంస్థాపక సంపాదకులు,  నెచ్చెలి అంతర్జాల వనితా మాస […]

Continue Reading
Posted On :

ధర్మేచ, కామేచ… న.. చరామి (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ధర్మేచ, కామేచ… న.. చరామి (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -శ్రీపతి లలిత “యువర్ ఆనర్! దేశం ఎంత అభివృద్ధి సాధించినా, ఆడపిల్లల జీవితాలతో మగవాళ్ళు ఆడుకోవడం ఆగడంలేదు. ఒకప్పుడు వరకట్నం, గృహహింస అయితే , ఇప్పుడు కొత్త రకం హింస! హోమో సెక్సువల్ మగవాడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని, దాని అర్థమే మార్చేసి పెళ్లిని పెటాకులు చేస్తున్నారు. వివాహసమయంలో, అబ్బాయి, అమ్మాయి చేత “ధర్మేచ, అర్థేచ, కామేచ… నాతి చరామి అని […]

Continue Reading
Posted On :

గుండె గాయం మానేదెలా (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

గుండె గాయం మానేదెలా (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -తెలికిచెర్ల విజయలక్ష్మి “మంగా, ఇంటికి వచ్చేసేవా! నిన్ను కలవడానికి రావాలని అనుకుంటున్నాను. రావచ్చా” అంది వసుమతి. “అదేంటే రావచ్చా అని అడుగుతున్నావు? నేను నీకు పరాయిదాన్ని అయిపోయానా!” అంది కిసుకగా మంగ. “మీ అన్న కొడుకు వచ్చి తీసుకు వెళ్ళాడని చెప్పావు కదా! వచ్చేవో లేదో అని అడిగానంతే. వచ్చేనెలలో మా మరిది కూతురు పెళ్ళి వుందే. జాకెట్లు కుట్టడానికి నీకు ఇచ్చినట్టు వుంటుంది. […]

Continue Reading

ప్రమద- రాజమాత గాయత్రీ దేవి

ప్రమద అందం, హుందాతనం కలబోత – రాజమాత గాయత్రీ దేవి -నీరజ వింజామరం  జీవితంలో ఒక్కసారి ఆయనను చూస్తే చాలనుకునే కోట్లాది అభిమానులు గల నటుడు అమితాబ్ బచ్చన్ . అలాంటి వ్యక్తి తన విద్యార్థి దశలో, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో జైపూర్ పోలో గ్రౌండ్‌కు దొంగచాటుగా వెళ్లేవారట. అది పోలో మ్యాచ్ చూడటం కోసం కాదు, ,  కేవలం ఆమెను చూడడం కోసమే. ఆమె మరెవరో కాదు మహారాణి గాయత్రీ దేవి . జైపూర్ […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-21- వసంత నెల్లుట్ల

ఈ తరం నడక – 21 వసంత మనో పతాకం -రూపరుక్మిణి కాలంతో అన్వేషణ చేస్తూ నడచి వచ్చిన దారిని పురాస్మృతులుగా చేసుకుంటూ అలుముకున్న చీకట్ల మధ్య పున్నమి, వేకువల అస్తిత్వపు వెలుగుల్ని విరజిమ్ముతూ… ముఖంపై  ఏర్పడ్డ ముడతల్లో గాయాల చెమ్మని తోడుకుంటూ చేసే కవిత్వ ప్రయాణమే ఈ చివరాఖరిజవాబు. వసంత గారు జీవిత ప్రయాణంలో ఓ ఆడపిల్లగా ఎదిగిన దగ్గర నుండి కవిత్వం తన ఇంటిలో  కలాన్ని ఆయుధంగా చేసుకున్న((వి.వి)(వసంత గారి మామయ్య))విప్లవ గీతమై ప్రవహిస్తుంటే […]

Continue Reading
Posted On :

అనగనగా అమెరికా ( డాక్టర్ కె.గీత కాలమ్స్ పుస్తక పరిచయం)

అనగనగా అమెరికా ( డాక్టర్ కె.గీత కాలమ్స్ పుస్తక పరిచయం) -వసీరా అనగనగా అమెరికా….ఇది గీతా కాలమ్ ….కాలమ్ కథల పుస్తకం. ఇది కాలమ్ అయినప్పటికీ దీన్ని కథల పుస్తకంగానే  పరిగణిస్తాను నేను. ఇందులో అమెరికాలోని తెలుగోళ్ల గోడు చెప్పారు, గొప్పలూ చెప్పారు. వాళ్ల కష్టసుఖాలను సానుభూతితో చెప్తూనే సున్నితమైన వ్యంగ్యం , హాస్యంతో చమత్కార బాణాలు వేశారు. కొన్ని చోట్ల తన అభిప్రాయాలేమీ చెప్పకుండానే, ఎలాంటి వాఖ్యానాలూ చెయ్యకుండానే మనుషుల్నీ పరిస్థితుల్నీ ఉన్నదున్నట్టు చూపించారు. కొండని […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment-56

https://youtu.be/Q4gI_kDE3n8 Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover […]

Continue Reading
Posted On :

దీపానికి కిరణం ఆభరణం! (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

దీపానికి కిరణం ఆభరణం! (నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – కొత్తపల్లి ఉదయబాబు తూరుపు తెలతెలవారుతోంది. ఆ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న చెట్లమీద ఎప్పటినించో నివాసముంటున్న రకరకాల పక్షుల కువకువలు వందిమాగధుల సుప్రభాతంలా కిలకిలారావాలతో ప్రచ్చన్నమైన ఉదయభానుడికి స్వాగతం పలుకుతున్నాయి. సూర్యుని లేలేత కిరణాలు కిటికీ పరదాను దాటుకుని ఆ గదిలో పడుతున్నాయి. అదేగదిలో మంచం బెడ్ మీద నిస్సత్తువగా పడుకుని ఉన్న అమృత కనుకొలుకుల నుండి మాత్రం కన్నీరుజారి, ఆమె తలదిండు […]

Continue Reading

ఒక స్త్రీ అపూర్వకృత్యాలు (హిందీ: ‘ एक स्त्री के कारनामे ‘ (డా. సూర్యబాల గారి కథ)

ఒక స్త్రీ అపూర్వకృత్యాలు एक स्त्री के कारनामे హిందీ మూలం – – డా. సూర్యబాల తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు [ఈ కథలో, ఎటువంటి లోటు లేకుండా, అన్ని సౌకర్యాలతో, సదుపాయాలతో ఉన్న ఒక సంపన్నకుటుంబంలోని ఇల్లాలు తన భర్త నుండి తనపట్ల ప్రేమాభిమానాలు, ఆప్యాయత, ఆత్మీయత కరువైన కారణంగా, చివరికి ఆయన తనతో మాట్లాడటం కూడా దాదాపు లేకపోవడంవల్ల బయటికి అంతా సహజంగా, సంతోషంగా కనిపిస్తున్నప్పటికీ, ఆయన పెడుతున్న […]

Continue Reading

AI వల

AI వల -డా||పి.విజయలక్ష్మిపండిట్ నా కన్నుల వెనుక రంగురంగు వలయాలుగా నృత్యం చేయిస్తున్న వెలుగు తరంగాలు .., సంగీతనాదం వినిపిస్తోంది …కొంతమంది వెలుగు శరీరాలతో గిరకీలు తిరిగుతూ నృత్యం చేస్తున్నారు. ఆ గుంపులో నేను అతను సీతాకోక చిలుకలుగా మేము నృత్యం చేస్తున్నాము . మా ముఖాలు మావే కాని శరీరాలు రంగురంగుల దుస్తులు ధరించిన సీతోకోక చిలుకల్లా ఉన్నాయి. ఇంకో  మారు చిలకా గోరింకల్లా తిరుగుతూ ఉన్నాము. ఆ వెలుగు  తరంగాల నుండి పుట్టుకొస్తున్నాయి మానవ ఆకారాలు… వృక్షాలు జంతువులు.! ఎక్కడున్నాను నేను..? అన్న […]

Continue Reading

బ్యాంకాక్ నగరం (కవిత)

బ్యాంకాక్ నగరం -డా.కె.గీత బ్యాంకాక్ నగరం సంధ్యాకాంతులకివతల మత్తుగా ఒళ్ళు విరుచుకుంటూ ఉంది అంతా అతనూ ఆమె కాని శరీరాన్ని చూస్తున్నారు నాకు పైకి మిసమిసా మెరుస్తూన్నా లోపల పుళ్ళు పడ్డ దేహం మీద మచ్చలు మాత్రమే కనిపిస్తున్నాయి ఆమె నునుపైన దేహాన్ని కళ్ళతో తాగడం వేళ్ళతో తాకడమేనా లక్ష్యం? కళ్ళలో వలపు వెనక కడుపులో సుడి తిరిగే ఆకలిని తాకిచూడు ఆమెవరో తెలుస్తుంది అతనెవరో తెలుస్తుంది మైమరపు రంగుల కాన్వాసు మీద ఎవరేం గీస్తే అలా […]

Continue Reading
Posted On :
gavidi srinivas

కన్నీళ్ళ పంటనూర్పు (కవిత)

కన్నీళ్ళ పంటనూర్పు -గవిడి శ్రీనివాస్ ఈ పొలం పై నిలిచే వరి దిబ్బలు కాసేపైనా ఆనందాన్ని ఎగరనీయటం లేదు వర్షంలో మునిగిన పంట మాదిరి అప్పుల్లో తడిసిన బతుకు మాదిరి ఆదుకోని ధరలతో పతనమైన చిరునవ్వు మాదిరి రైతు కళ్ళల్లో మిరప మంటలు రేపుతూ ఉల్లికోసి కన్నీళ్ళను తోడుతున్నవి. పంట నూర్పు పసిడి కల అనుకుంటే పొరపాటైపోలా మద్దతు ధర ముంచిపోయాక తేరుకోవటం తెల్ల ముఖం వేయటం అలవాటైపోయింది. పైరు ఎండిపోతే తడబడ్డాం పురుగు కొరుకుతుంటే దిగులు […]

Continue Reading

నువ్వు అణుబాంబువి (కవిత)

నువ్వు అణుబాంబువి -తోకల రాజేశం అయ్యో నా తోడబుట్టిన చెల్లెలా! వాని దృష్టిలో మనుషులంటే రెండే జాతులు తల్లీ!! ఒకటి నీచ జాతి రెండోది ఉన్నతమైనజాతి మనుషుల రక్త నాళాల గుండా మతాలు పారుతున్నంత సేపు ఆలోచనా లోచనాలమీద కులాలు సవారీ చేస్తున్నంత సేపు మానవత్వానికి చిరునామా దొరుకుతుందా చెప్పు? నిన్ను నీచమైన జాతిదానిగా శపించి బందీఖానాలో వేసిన వాడు నీకసలు స్వాతంత్రయమే లేదని మంత్రాల నోటితో పలికించిన వాడు వాని మెదడు మీద దేవుడై కూర్చున్నాడు […]

Continue Reading
Posted On :

తరలిపోయిన సంజ (కవిత)

తరలిపోయిన సంజ -ఉదయగిరి దస్తగిరి కాగుతున్న బెల్లంగోరింటాకు వాసనలా నేరేడి సెట్టుకింద నవ్వుతుంటే రాలుతున్న పండ్లన్నీ వేళ్ళకి నోటికి కొత్త రంగుమాటల్ని పూసేవి పొంతపొయ్యిలో కాల్చిన రొట్టెని బతుకుపాఠంలో ముంచి తినిపిస్తుంటే కాలిన మచ్చలన్నీ బెల్లమేసిన పెసరపప్పులా పచ్చగా మెరుస్తూ ఆకలిబానల్లోకి జారిపోయేవి సీకటయ్యాలకి రాత్రిని కోళ్లగంప కింద మూయాలని దంతె పట్టుకొని అరుగులెక్కి దుంకుతుంటే చెక్కభజనలో ఆడగురువులా కనిపించేది ఘల్లుమనే యెండికడియాల సందమామల్ని సూసి పూలచెట్టు జామచెట్టు కాళ్ళమ్మడి రంగు కోడిపిల్లల్లా తిరుగాడేవి ఉసిరికాయని ఉప్పుతోకలిపి […]

Continue Reading

అనుబంధాలు-ఆవేశాలు – 3 (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 3 – ప్రమీల సూర్యదేవర “ఇక్కడి భద్రత విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తామో మీకు ఈపాటికి అర్దమైపోయి ఉండాలి. జలజ లాంటి భద్రతా సిబ్బంది మొత్తం పన్నెండు మంది ఉంటారు. కాని ప్రతిరోజు విధుల్లో నలుగురు మాత్రమే ఉంటారు. ఈ పన్నెండు మంది రోజుకి ఎనిమిది గంటల చొప్పున పని చేస్తారు. వారంతా అతి జాగరూకతతో ప్రతిక్షణం అప్రమత్తతో ఉండ వలసిందే. ఏ మాత్రం ఏమరుపాటు ఉండ కూడదు. ప్రతి భద్రతావుద్యోగి క్రింద ఆరుగురు […]

Continue Reading

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-8 ఇల్ హెల్తు – ఇన్సూరెన్సు

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 8. ఇల్ హెల్తు – ఇన్సూరెన్సు అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత ఇంతకీ మనకు ఏ ఇన్సూరెన్సు ప్లాను సెలెక్టు చేసావ్? అడిగాడు సూర్య. “అయ్యో! ఆ విషయమే మర్చిపోయాను.” అని చప్పున […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-20 తిరిగిరాని గతం 3

కాదేదీ కథకనర్హం-20 తిరిగిరాని గతం – 3 -డి.కామేశ్వరి  నిజం చెప్పాలంటే ముప్పై ఏళ్ళు వచ్చేవరకు అసలు మహిమ పెళ్ళి గురించే ఆలోచించలేదు. ఒంటరితనం విసుగనిపించలేదు. ఐదారేళ్ళు చదువయ్యాక కొత్త ఉద్యోగం, కొలీగ్స్ తో సరదాగా గడపడం, స్టూడెంట్స్ తో చనువుగా వుంటూ, కొందరు స్టూడెంట్స్ ఇంటికి వచ్చి చదువు చెప్పించుకుంటూ…..ఫ్రెండ్స్ తో పిక్నిక్లు పార్టీలు అంటూ లైఫ్ ఎంజాయ్ చేసింది. పుస్తకాలు చదవడం, టి.విచూస్తుంటే రాత్రి గడిచి పోయేది. శలవుల్లో ఇంటికెడితే అన్నయ్యలు, పిల్లలతో రోజులు […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-25

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 25 – విజయ గొల్లపూడి జరిగినకథ:విష్ణుసాయి, విశాల వివాహమైన నూతనజంట. సిడ్నీకి పెర్మనెంట్ రెసిడెంట్స్ గా వచ్చి, జీవన ప్రయాణం మొదలెడతారు. విష్ణు ఆర్థికంగా ఇపుడిపుడే స్థిరపడుతూ, ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. విశాల వర్క్ ఎక్స్పీరియన్స్ పూర్తి చేసి, కంప్యూటర్ కోర్స్ లో జాయిన్ అవుతుంది. *** జీవితంలో లక్ష్యాన్ని సాధించి ముందుకు సాగాలంటే ఎన్నో అవరోధాలు, అడ్డంకులు ఎదురవుతాయి. అవి శారీరకంగా, మానసికంగా, లేదా మనుష్యులవల్ల, పరిస్థితులవల్ల అయినా కావచ్చు. మొక్కవోని […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి సోమవారానికి వైకుంఠపురం అడవులలోని విశాలమైన వృక్షాల నీడల మధ్య వున్న ఒక తోపులో దర్బారు ఏర్పాటు చెయ్యబడింది. చిరుగడ్డి, ముళ్ల పొదలు తొలగించి నేల చదును చెయ్యబడి వుంది. ఒక ప్రక్కగా, ఒక విశాల వృక్షం క్రింద చెక్కతో కట్టబడిన వేదికకు పైకప్పుగా ఒక ఛత్రి, ఆ వేదికపైన ఒక రాజాసనము ఏర్పరిచి వున్నవి. సూర్యోదయ కాంతిలో, దేవి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-61)

నడక దారిలో-61 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,. అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-34

నా అంతరంగ తరంగాలు-34 -మన్నెం శారద నా జీవితంలో కొన్ని అపూర్వ సంఘటనలు! 1984లో అనుకుంటాను. నేను రాసిన “చిగురాకు రెపరెపలు ” నవల ( నా బాల్యం మీద రాసింది కాదు. వనితాజ్యోతి స్త్రీ ల మాసపత్రికలో అదే పేరు తో రాసిన మరో నవల ) బుక్ ఆవిష్కరణ సభ కోటిలోని శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయంలో జరిగింది. పోతుకూచి సాంబ శివరావు గారి ఆధ్వర్యంలో దాశరధి రంగాచార్యులవారు అధ్యక్షత వహించారు. శ్రీమతి […]

Continue Reading
Posted On :

నా కళ్ళతో అమెరికా -5 (లాస్ ఏంజిల్స్ – రెండొవ భాగం)

నా కళ్ళతో అమెరికా -5 లాస్ ఏంజిల్స్ – రెండొవ భాగం డా|| కె. గీతామాధవి “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. ***** డా||కె.గీతడా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, […]

Continue Reading
Posted On :

కథావాహిని-31 “అనుభవం” తమిళ కథ, తెలుగు అనువాదం:గౌరీ కృపానందన్

కథావాహిని-31 అనుభవం తెలుగు అనువాదం : గౌరీ కృపానందన్ గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ […]

Continue Reading

వినిపించేకథలు-55 – వసుంధర గారి కథ “మా రాజులొచ్చారు”

వినిపించేకథలు-55 మా రాజులొచ్చారు రచన : వసుంధర గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. […]

Continue Reading
K.Geeta

గీతామాధవీయం-52 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-52 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-52) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) ఆగష్టు 06, 2022 టాక్ షో-52 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-52 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :