image_print
komala

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-1

జ్ఞాపకాలు-1 -వెనిగళ్ళ కోమల నాన్న తన మూడవ ఏట మూల్పూరు పెంపు వచ్చారట. పెంచుకున్న వారు అఫీషియల్ గా దత్తత నిర్వహించి నాన్న అసలు యింటి పేరు మార్చలేదు. పెంచి బాధ్యతలు, ఆస్తులు అప్పగించారు తప్ప. అందువలన మూల్పూరులో మేము  ఒక్కళ్ళమే వెనిగళ్ళవాళ్ళం. అంట్లు, సూదకాలు మా దరికి రాలేదు మూల్పూరులో. మాది ఏకఛత్రాదిపత్యం మూల్పూరులో. పెద్దింటి వారుగా ఊరంతా గౌరవించేవారు. అలా అమ్మా, నాన్నా నడుచుకున్నారు మరి! అమ్మకు ఎనిమిదవ ఏట నాన్నతో (18ఏళ్ళు) పెండ్లి […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-5

అనుసృజన నిర్మల (భాగం-5) –ఆర్. శాంతసుందరి  (హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -) ఆనాటినుంచీ నిర్మల ప్రవర్తనలో మార్పు వచ్చింది.తన కర్తవ్యం ఏమిటో అర్థమైనదానిలా నైరాశ్యంలో కూరుకుపోకుండా అన్ని పనులూ చురుగ్గా చేసుకోసాగింది. ఇంతకుముందు మనసులో ఉన్న కోపమూ, చిరాకూ, దుఃఖమూ ఆమెని జడురాలిగా చేసేశాయి.కానీ ఇప్పుడు, ‘నా ఖర్మ ఇంతే, […]

Continue Reading
Posted On :

కథా మధురం-మన్నెం శారద

కథా మధురం   “తాత గారి ఫోటో” -మన్నెం శారద -ఆర్.దమయంతి   ‘పురుష అహంకారానికి నిలువెత్తు అద్దం – ‘తాత గారి ఫోటో!’ పంజరం లో బంధించిన పక్షి  ఎందుకు పాడుతుందో .. తెలుసుకున్నంత సులభం గా.. సంసారం లో –   భర్త చేత వంచింపబడిన స్త్రీ  చస్తూ కూడా ఎందుకు బ్రతుకుతుందో – తెలుసుకోవడం చాలా కష్టం. ప్రతి ఆడదాని జీవితం లో ఒక శత్రువుంటాడు. వాడు మొగుడే అయినప్పుడు ఆమె జీవితం క్షణం […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-1 (“పాప” కథ)

నా జీవన యానంలో- రెండవభాగం- 12 “పాప” కథా నేపథ్యం -కె.వరలక్ష్మి  నా చిన్నప్పుడు మా ఇంట్లో వీర్రాజు అనే అబ్బాయి పనిచేస్తూ ఉండేవాడు. అతని తల్లి అతన్ని తన తల్లిదండ్రుల దగ్గర వదిలి మళ్ళీ పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందట. మా ఇంటి ఎదుట మాలపల్లెలోని జల్లి వీరన్న మనవడు అతను. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. మా అమ్మానాన్నల్ని అమ్మ – నాన్న అని, నన్ను చెల్లెమ్మ అని పిలిచేవాడు. నేను బళ్ళో నేర్చుకున్న చదువు ఇంటికొచ్చి […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -11

నా జీవన యానంలో- రెండవభాగం- 11 -కె.వరలక్ష్మి  అప్పటికి స్కూలు ప్రారంభించి పదేళ్లైనా రేడియో కొనుక్కోవాలనే నాకల మాత్రం నెరవేరలేదు. ఇంట్లో ఉన్న అరచెయ్యంత డొక్కు ట్రాన్సిస్టర్ ఐదు నిమషాలు పలికితే అరగంట గరగర శబ్దాల్లో మునిగిపోయేది. ఏమైనా సరే ఒక మంచి రేడియో కొనుక్కోవాల్సిందే అనుకున్నాను. అలాంటి కొత్త వస్తువులేం కొనుక్కోవాలన్నా అప్పట్లో అటు కాకినాడగాని, ఇటు రాజమండ్రిగాని వెళ్లాల్సిందే. ఒక్క పుస్తకాలు తప్ప మరేవీ సొంతంగా కొనే అలవాటు లేదప్పటికి. మోహన్ తో చెప్పేను, […]

Continue Reading
Posted On :

కథా మధురం-జి.యస్.లక్ష్మి

కథా మధురం   “ఇప్పుడైనా చెప్పనీయమ్మా” -జి.యస్.లక్ష్మి -ఆర్.దమయంతి ‘అమ్మ ఔన్నత్యానికి ఆకాశమంత ఆలయం కట్టిన కథ!’ – శ్రీమతి జి.ఎస్ లక్ష్మి గారు రాసిన – ‘ఇప్పుడైనా చెప్పనీయమ్మా..’ ముందుగా ఒక మాట: ‘తన సృష్టి లో నే ఇంత అందమైన సృష్టి వుందని తెలీని  బ్రహ్మ సయితం  అమ్మ ని చూసి అబ్బురపడిపోతాడట!’ – బహుశా, ఇంతకు మించిన అద్భుతమైన  వాక్యం మరొకటి వుండదేమో, – అమ్మ ని అభివర్ణించేందుకు, అమ్మ పేమానురాగాలకి హృదయాంజలి ఘటించేందుకు! […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-4

అనుసృజన నిర్మల (భాగం-4) –ఆర్. శాంతసుందరి  (హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -) నిర్మలకి లాయర్ తోతేరామ్ తో పెళ్ళయిపోయి ఆమె అత్తారింటికి వచ్చింది.తోతేరామ్ నల్లగా ,లావుగా దిట్టంగా ఉంటాడు.ఇంకా నలభై యేళ్ళు రాకపోయినా అతను చేస్తున్న ఉద్యోగం చాలా కష్టమైంది కాబట్టి జుట్టు నెరిసిపోయింది.వ్యాయామం చేసే తీరిక ఉండదు.చివరికి వాహ్యాళికి […]

Continue Reading
Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ మంచిచెడులు కలిసుండును మర్మమదే తెలుసుకో హంసలాగ మంచినొకటె ఎంచడమే తెలుసుకో అల్పునిదే ఆర్భాటం సజ్జనునిది చల్లని పలుకు కంచువలె కనకం మోగదు సత్యమదే తెలుసుకో గోవుపాలు కాస్తచాలు కడివెడేల ఖరముపాలు భక్తితొ తినెడి కూడు పట్టెడు చాలునదే తెలుసుకో పరుల చోట పరుగు తగదు తగ్గి ఉండిన తప్పు కాదు కొండకూడ అద్దమందు కొంచమదే తెలుసుకో తనువు గాని కూడబెట్టిన ధనము గాని సొత్తు కాదు నీ ప్రాణమె  నీ సొత్తు కాదు […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- రెండవభాగం- 10

నా జీవన యానంలో- రెండవభాగం- 10 -కె.వరలక్ష్మి  స్కూలు ప్రారంభించిన రెండో సంవత్సరం నుంచి పిల్లల్ని విహారయాత్రలకి తీసుకెళ్తూండేదాన్ని. ఒకటో రెండో మినీబస్సుల్లో వెళ్తూండేవాళ్లం. అలా మొదటిసారి శంఖవరం దగ్గరున్న శాంతి ఆశ్రమానికి వెళ్లేం. తూర్పు కనుమల్లోని తోటపల్లి కొండల్లో వందల ఎకరాలమేర విస్తరించి ఉన్న అందమైన, ప్రశాంతమైన ఆశ్రమం అది. మా ఆడపడుచురాణిని ఆపక్క ఊరైన వెంకటనగరం అబ్బాయికి చెయ్యడం వల్ల వాళ్ల పెళ్లికి వెళ్లినప్పుడు ఆ ఆశ్రమాన్నీ, పక్కనే ఉన్న ధారకొండనీ చూసేను. ఆ […]

Continue Reading
Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ మట్టి కాదు దేశమంటె బుధ్ధి జీవులే కదా గట్టిమేలు సాధించును ఐకమత్యమే కదా కులం మతం రంగు రూపు చూసేందుకె తేడాలూ భరతమాత బిడ్డలంత తోబుట్టువులే కదా భాషలలో వేషాలలొ భేదమెంత ఉన్ననూ దేశ సంస్కృతి చాటును భారతీయమే కదా కలం హలం వ్యాపారం వ్యాపకాలె వేరువేరు పయనమంత సాగేదీ ప్రగతి పథమునే కదా ముక్కలైననేమి రాజ్యమున్నతినాశించినపుడు మనిషిమనిషి లోనున్నది సహోదరత్వమే కదా స్థలం గళం పరిపాలన ఏదన్నది కాదు ప్రశ్న జనమంతా […]

Continue Reading
Posted On :

కథామధురం-మంథా భానుమతి

కథామధురం మంథా భానుమతి -ఆర్.దమయంతి ‘ ప్రతి స్త్రీ విషాదం వెనక ఒక మగాడు వుంటాడు ‘ అని నిర్ధారించే కథ… – శ్రీమతి మంథా భానుమతి ‘స్వార్ధం’ కథ. ***** ‘స్త్రీ అమూల్యమైనదే. కాకపోతే చాలా  అమూల్యమైన పరికరం.’ అందుకే, మగాడు తన  తెలివితోనో, మోసం తోనో..ఆమెని వినియోగించుకుని లబ్ది పొందాలని తహతహలాడతాడు. ఆ  ప్రయత్నం లో, ఆ ఆరాటంలో..చివరికి నైతికం గా ఎంతగా దిగజారుతాడూ అంటే – ఎంత ద్రోహం తలబెట్టడానికైనా వెనకాడడు.  అతనెవరో […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-3

అనుసృజన నిర్మల (భాగం-3) –ఆర్. శాంతసుందరి  (హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -) కల్యాణికి ఇప్పుడొక పెద్ద సమస్య వచ్చిపడింది.భర్త పోయాక ఆమె ఒంటరిగా  ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో తెలీక సతమతమయింది.కొడుకులు చెప్పుల్లేకుండా స్కూలుకెళ్ళినా, ఇంట్లో అంట్లు తోముకుని,ఇల్లు ఊడ్చి తుడుచుకోవలసి వచ్చినా, ఒక పూటే తిని అర్ధాకలితో పడుకోవలసి […]

Continue Reading
Posted On :

చిత్రలిపి-నల్లని నవ్వుల చల్లని దేవుడు

చిత్రలిపి నల్లని నవ్వుల చల్లని దేవుడు -ఆర్టిస్ట్ అన్వర్  కష్టకాలంలో నేతాజీ ట్యూషన్ సెంటర్ ఎదురుగా రాముడు ఉన్నా ఏం లాభంలేక పోయింది. పొద్దున ప్రయివేట్ సెంటర్ లో అడుగుపెట్టే ముందే గుడిలోకి కాళ్ళు కడుక్కుని చల్లని నల్లని తడి బండల మీద తడికాళ్ళు ముద్రలేకుండా నడిచి దేవుడికి ఒక నమస్కార ముద్ర పెట్టుకుని. పూజారి ఇచ్చిన చిన్న గారె ముక్క తినుకుంటూ చూస్తే గుడి ఆవరణలో తెల్లగా పసుపు పచ్చగా ఇంతకన్నా అందమైన పూవు లేదనిపించే […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- రెండవభాగం- 9

నా జీవన యానంలో- రెండవభాగం- 9 -కె.వరలక్ష్మి  మేం ఆ ఇంట్లోకెళ్లిన కొత్తల్లో ఒకరోజు కుప్పయాచార్యులుగారి కొడుకు, సింగ్ అట ఆయనపేరు; వాళ్ల బంధువు ఒకతన్ని వెంటబెట్టుకొచ్చాడు. సింగ్ గారు మానాన్నకి క్లాస్ మేటట. మా నాన్న కాలం చేసారని తెలుసుకుని విచారించాడు. ‘‘రమణ జీవితంలో పైకి రావడానికి చాలా కష్టపడ్డాడమ్మా, మేమంతా హాయిగా ఆడుకొనేవేళల్లో తను సైకిల్ రిపేర్ షాపుల్లో పనిచేసేవాడు. ఊళ్లో కాలినడకన, పొరుగూళ్లకి ఎంతదూరమైనా సైకిల్ మీదా తిరిగేవాడు’’ అంటూ మానాన్న బాల్యం […]

Continue Reading
Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ నీకోసమె జన్మ అంత గడపలేద ఆడదీ నీతోడిదె లోకమంటు నడవలేద ఆడదీ   నవ్వుపువ్వులు కురిపించగ నందనమే నీ ఇల్లు బాధలున్న బయటపడక వెలగలేద ఆడదీ   ఇద్దరొక్కటైనక్షణం ధన్యతగా భావించి తనువు మనసు అణువణువూ నీకివ్వలేద ఆడదీ   ముల్లు గుచ్చుకుంటె నువ్వు విలవిలలాడుదులే కడుపు చీల్చు యాతనంతా ఓర్చలేద ఆడదీ   సుఖము దుఃఖము ఏదైనా ఒడిదుడుకులు ఎన్నున్నా ఆశ నింపు జ్యోతిగా వెలగలేద ఆడదీ   అమ్మగా అక్కగా […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-2

అనుసృజన నిర్మల (భాగం-2) –ఆర్. శాంతసుందరి  (హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -) పెళ్ళింట్లో శోకాలూ, ఏడుపులూ గురించి వివరంగా చెప్పి చదివేవాళ్ళ మనసులని బాధపెట్టటం నాకిష్టం లేదు.మనసులు గాయపడ్డవాళ్ళు ఏడుస్తారు,విలపిస్తారు,గుండెలు బాదుకుంటూ మూర్ఛ పోతారు.ఇది కొత్త విషయమేమీ కాదు.కల్యాణి మానసిక స్థితి ఎంత ఘోరంగా ఉండి ఉంటుందో మీరే ఊహించుకోగలరు.ప్రాణంతో […]

Continue Reading
Posted On :

కథా మధురం-స్వాతీ శ్రీపాద

కథా మధురం   స్వాతి శ్రీపాద -ఆర్.దమయంతి  రచయిత్రి గురించి : స్వాతి శ్రీపాదగారు  40 యేళ్ళు గా ఇటు కథా సాహిత్యం లో, అటు నవలా సాహిత్యం లో ఎనలేని కృషి సలుపుతూ, ఎప్పటికప్పుడు నూతన ఒరవడిని సృష్టిస్తూ సాహితీ పథం లో ముందుకు సాగుతున్నారు. తెలుగు సాహిత్య ప్రపంచం లో పేరెన్నిక గల రచయిత్రులలో స్వాతి శ్రీపాద  గారి పేరు స్ఫుటం గా వినిపిస్తుంది. కథల పోటీలలో అనేక ప్రతిష్టాత్మకమైన బహుమతులను గెలుచుకున్నారు.  అవార్డ్స్ ని […]

Continue Reading
Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ నులివెచ్చని మనప్రేమను ధ్యానంలో చూసుకోనీ చలి పెంచిన తలపులనొక కావ్యంగా రాసుకోనీ విరిచూపులు విసిరినపుడు ఎదలోపల సరిగమలు కంటి మెరుపు పూయించిన కుసుమాలను కోసుకోనీ నీ చూపులు నా తనువున తుమ్మెదలై చరించెను సిగ్గులన్ని పూవులుగా నీ పూజను చేసుకొనీ తలపు కౌగిలించినపుడు తనువణువూ తరించెను వలపునంత  దండ చేసి నీమేడలో వేసుకోనీ చెలి వలచిన ప్రేమికుడవు హరివిల్లై విరిసావు పదిలముగా నీ చిత్రమే మదినిండగ గీసుకోనీ ఇద్దరొకటై లోకమిపుడు మాయమయె చిత్రంగా […]

Continue Reading
Posted On :

‘శక్తివంతమైన ఆలోచనా తరంగం..’ S/O. అమ్మ’ కథాంతరంగం!

కథా మధురం   ‘శక్తివంతమైన ఆలోచనా తరంగం..’ S/O. అమ్మ’   కథాంతరంగం! -ఆర్.దమయంతి అమ్మ అంటే దైవమని, ప్రేమకి ప్రతిరూపమనీ, త్యాగమయి, రాగమయి అనీ అదనీ ఇదనీ అమ్మని ఇంతగా ప్రగల్భాల అభివర్ణనలు సాగినా,  ఈ బిడ్డ ఫలానా అని అధికారికంగా ధృవీకరించాల్సి వచ్చినప్పుడు మాత్రం తండ్రి పేరుని మాత్రమే సూచించాల్సివస్తోంది. అదంతే. అదే రూల్. మార్చడానికి వీలు లేదు. అతిక్రమించాలని  ప్రయత్నించడానికి సైతం వీలు లేని ఆదేశం. రాజ్యాంగబధ్ధమైన ఈ నియమాన్ని, తాను అంగీకరించలేక, అయిష్టంగా […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-1

అనుసృజన నిర్మల (భాగం-1) –ఆర్. శాంతసుందరి  (హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -) వకీలు ఉదయభాను లాల్ కి ఇద్దరు కూతుళ్ళు .పెద్దమాయి నిర్మల రెండోది కృష్ణ. నిర్మలకి పదిహేనో ఏడు కృష్ణకి పది నిండాయి. నిన్న మొన్నటి వరకూ ఇద్దరూ బొమ్మలతో ఆడుకునేవాళ్ళు. ఇద్దరిదీ ఒకే రకమైన స్వభావం.వయసు తేడా […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- ఎమిలీ డికిన్ సన్

క’వన’ కోకిలలు – 8 :   కొమ్మ చాటు కోకిల ఎమిలీ డికిన్ సన్     – నాగరాజు రామస్వామి ఏభై ఆరేళ్ల జీవిత కాలంలో 1800 లకు పైగా ఆణిముత్యాల లాంటి  కవితలు రాసి, కేవలం ఏడింటిని మాత్రమే ప్రచురించుకున్న 19 వ శతాబ్ది అమెరికన్ కవయిత్రి ఎమిలీ  డికిన్ సన్. తన యావజ్జీవితాన్ని నాలుగు గోడలకే పరిమితం చేసుకొని, కొమ్మల్లోంచి బయటకు రాని కోకిల ఎమిలీ. ఆమె మరణానంతరం ఆమె సోదరి లవీనియా కలుగజేసుకొని, చిత్తుకాగితాలలో […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 8

నా జీవన యానంలో- రెండవభాగం- 8 -కె.వరలక్ష్మి  గ్రంథాలయంలో పుస్తకాలన్నీ పాతవైపోయాయి. కొత్త పుస్తకాలేవీ రావడం లేవు. అమ్మాయిలంతా కొత్తనవలల కోసం అడుగుతున్నారట. అందుకని శివాజీగారు పుస్తకాలు చదివే అందర్నీ కొంతకొంత వేసుకోమని, ఆడబ్బుతో కొత్త పుస్తకాలు కొనుక్కొచ్చేరు. వాటిని విడిగా ఓ బీరువాలో సర్ది, ప్రత్యేకంగా ఓ రిజిస్టరు పెట్టేరు. నా చిన్నప్పటితో పోల్చుకుంటే పాఠకులు బాగా పెరిగేరు. ముఖ్యంగా ఆడవాళ్లు, కొత్త పుస్తకాలకి రోజుకి అర్ధరూపాయి రెంట్ అని గుర్తు. అప్పుడప్పుడే యండమూరి, మల్లాదిల […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- సారా టెస్ డేల్

క’వన’ కోకిలలు -సారా టెస్ డేల్       -నాగరాజు రామస్వామి  ప్రేమ కవితల అమెరికన్ అధునిక గేయ కవిత్రి : సారా టెస్ డేల్  ” Under the Leaf of many a Fable lies the Truth for those who look for it “- Jami. ఈ తాత్విక  వాక్యం సారా టెస్ డేల్ ఏకాంకిక రచన ‘On the Tower’కు నాందీ వాచకం. జామి 15 వ శతాబ్ది ప్రసిద్ధ  […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 7

నా జీవన యానంలో- రెండవభాగం- 7 -కె.వరలక్ష్మి  కొత్త వారింట్లో కొచ్చి ఏడేళ్ళు అయిపొయింది. నేను ఒక్క రోజు కూడా ఆలస్యం చెయ్యకుండా అద్దె కట్టేస్తూ ఉండేదాన్ని. పెరట్లో ఉన్న కొబ్బరి చెట్ల నుంచి పడిన కాయలన్నీ పోగుచేసి ఇల్లు గల వాళ్లకి పంపించేస్తూ ఉండేదాన్ని. ఇంటి విషయంలో నిశ్చింతగా ఉన్నామనుకుంటూండగా ఇల్లు గల వాళ్ల ఆఖరబ్బాయి వెంకన్నబాబుగారొచ్చి వాళ్ల ఆస్తి పంపకాలు అయ్యాయని, ఐదుగురు అన్నదమ్ముల్లో తను చిన్నవాడు కాబట్టి దిగువ ఉన్న ఈ ఇల్లు […]

Continue Reading
Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ  మనసునేలు మాధవుడిని తలవాలని ఉండదా ప్రాణమిచ్చు ప్రేమికుడిని కలవాలని ఉండదా    మెరుపుతీగవంటు నన్ను మురిపెముగా పిలిచితే  మురిసిపోతు చెంతచేరి నిలవాలని ఉండదా    తమలపాకులంటు కళ్ళకద్దుకుంటే పాదములు  ధన్యములై చేతులెత్తి కొలవాలని ఉండదా    (నా)నవ్వుముఖము (నీ)దుఃఖములకు ఔషధమని తలచితే  (నా)సర్వమోడియైన యైన నువ్వె గెలవాలని ఉండదా    ముద్దబంతివి పూలరెమ్మవి జాబిలి నీవంటుంటే మరలమరల ఈనేలనె(నీకొరకే) మొలవాలని ఉండదా   ***** జ్యోతిర్మయి మళ్ళ బహుముఖ ప్రజ్ఞాశాలి. తొలి తెలుగు […]

Continue Reading
Posted On :

జీవన వాస్తవాలకి సజీవ రూపకల్పన – ‘ కలలోని నిజం’

కథా మధురం జీవన వాస్తవాలకి సజీవ రూపకల్పన – ‘ కలలోని నిజం’  -ఆర్.దమయంతి ఇది కథే అయినా, కథ లా వుండదు. నిజం  లా వుంటుంది. ఇంకా చెప్పాలీ అంటే, మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టుంటుంది.   కథలో పాత్రలు మనకు బాగా తెలిసినవారే కావడం ఈ కథలోని ప్రత్యేకం.    ఇంతకీ కథేమిటంటే : ఒక తండ్రి కి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు. ఒక కూతురు. ఇద్దరూ జీవితం లో స్థిరపడతారు. అయితే, అల్లుడి కి […]

Continue Reading
Posted On :

అనుసృజన-ఏడుగురు అన్నదమ్ముల మధ్య చంపా

ఏడుగురు అన్నదమ్ముల మధ్య చంపా హిందీ మూలం – కాత్యాయని అనుసృజన – ఆర్ . శాంత సుందరి ఏడుగురు అన్నదమ్ముల మధ్య  పెరిగి పెద్దదయింది చంపా వెదురు కొమ్మలా నాజూగ్గా తండ్రి గుండెలమీద కుంపటిలా కలల్లో కదులుతూన్న నల్లటి నీడలా రోట్లో ధాన్యంతోపాటు రోకటి పోటులని భరించి పొట్టుతోపాటు చెత్తకుప్పలో పారేస్తే అక్కడ పూలతీవై మొలిచింది. అడవి రేగుపళ్ళ ముళ్ళపొదల్లో మాధవీలతలా పెరిగిన చంపా ఇంట్లో ప్రత్యక్షమైంది మళ్ళీ. ఏడుగురు అన్నదమ్ములతో కలిసి పుట్టిన చంపా […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 6

నా జీవన యానంలో- (రెండవభాగం)- 6 -కె.వరలక్ష్మి  ఇల్లూ స్కూలూ ఒకటే కావడం వల్ల మా పిల్లలు సెలవు రోజొస్తే స్కూలాటే ఆడుకునే వాళ్లు. ఒక్కళ్ళు టీచరు ఇద్దరు విద్యార్థులు. బైట పిల్లలొచ్చిన అదే ఆట. వాళ్లకెప్పుడూ టీచర్ స్థానం ఇచ్చేవాళ్లు కాదు. ఊళ్లో ఒకటో రెండో బట్టల కోట్లు ఉండేవి. రెడీమేడ్ షాపులనేవి లేవు. ఊళ్లోకి మూటల వాళ్ళు తెచ్చిన మంచి రంగులూ, డిజైన్స్ ఉన్న కట్ పీసెస్ కొని పిల్లలకి బట్టలు కుట్టించేదాన్ని. మసీదు […]

Continue Reading
Posted On :

అనుసృజన-ఆడదానికే ఎందుకు?

ఆడదానికే ఎందుకు?   హిందీ మూలం – అంజనా వర్మ                                                           అనుసృజన – ఆర్.శాంతసుందరి  ఆ వీధులే కదా ఇవి ఇంతకు ముందే కొందరు మగపిల్లలు నడిచివెళ్ళిన వీధులు? గోల గోలగా అల్లరి చేస్తూ తుళ్ళుతూ తూలుతూ కబుర్లు చెప్పుకుంటూ? ఆ వీధుల్లోనే ఆడపిల్లలూ వెళ్తున్నారు అసలు మాటా మంతీ లేకుండా ఎవరి కళ్ళైనా తమ మీద పడేలోపున అక్కణ్ణించి చల్లగా జారుకోవాలని. ఈ ఇళ్ళు కూడా అవే కదా ఒకప్పుడు చిన్నారి ఆడపిల్లలు ఉన్న ఇళ్ళు? శిల్ప,గుంజన్,మీతా […]

Continue Reading
Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ    నిన్నువిడిచి నిముషమైన నిలవడమే కష్టం నీవులేని కాలాన్నిక కదపడమే కష్టం   కన్నుకన్ను కలిసినపుడు దేహమంత పులకరమే మనసులింత ముడిపడితే మసలడమే కష్టం   మధువులొలుకు మాటలన్ని  వినుటకైతె ఆనందమే పరితపించు పెదవులనిక ఓదార్చడమే కష్టం   చెంతచేరి నిలుచువరకు లోకమంత నందనమే ఎంతబాధ దూరమగుట చెప్పడమే కష్టం   నీవునేను ఒకరికొకరు తెలియనపుడు ఇద్దరమే ఇప్పుడైతె విడివిడిగా చూపడమే కష్టం    ***** జ్యోతిర్మయి మళ్ళ బహుముఖ ప్రజ్ఞాశాలి. తొలి […]

Continue Reading
Posted On :

కమ్మని కన్నీరిచ్చిపోయిన కథ – తోడబుట్టువు

  కమ్మని కన్నీరిచ్చిపోయిన కథ –  తోడబుట్టువు  -ఆర్.దమయంతి జీవితం లో ఎవరిని పోగొట్టుకున్నా,  ఆ స్థానాన్ని భర్తీ చేసుకునే అవకాశం వుంటుంది. కానీ, అమ్మ లేని శూన్యం మాత్రం – ఎప్పటికీ ఖాళీ గానే వుండిపోతుంది. కారణం? – అమ్మనీ, అమ్మ లేని లోటుని తీర్చగల ప్రత్యామ్నాయ శక్తి   మరొకటి ఈ సృష్టిలోనే లేదు. అమ్మ అమ్మే. అమ్మ ప్రేమ అమృతభాండమే.  ఆడపిల్లలకి అమ్మతో గల ప్రేమానుబంధాలు ప్రత్యేకం గా వుంటాయి. అమ్మ చేతుల్లోంచి ప్రవహించే […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- ఆండాళ్ / గోదాదేవి

క”వన” కోకిలలు  :  ఆండాళ్ / గోదాదేవ                  ( 9 వ శతాబ్దం )                           -నాగరాజు రామస్వామి         ” నన్ను నా ప్రభువు చెంతకు చేర్చండి. ఆయన చరణ సన్నిధిలో కంపిత వీణా   తంత్రినై మిగిలి పోతాను.”       ” నా అంగాంగ రహస్యాక్షరాలను నా స్వామి అనువదించు గాక.”       ” కృష్ణ సాన్నిధ్యంలో ఒక పాటగా ఆయనలో లీనమవడమే […]

Continue Reading
Posted On :

చిత్రలిపి-చిల్డ్రన్స్ డే

చిత్రలిపి -ఆర్టిస్ట్ అన్వర్  పండగలంటే పంద్రాఆగస్ట్, అక్టోబర్ రెండు, జనవరి ఇరవయ్యారు ఇదిగో నవంబర్ పద్నాలుగేగా. అదిగో తెల్లవారు ఝాము నుంచే మొదలయ్యేది హాడావిడి. పొయ్యి మీద నీళ్ళు అలా పెట్టి ఇలా తరిమేవారు చాకలాయన దగ్గరికి అప్పటికీ ఇరుగూ పొరుగూ అరుగూ అని అన్ని రకాల బడి పిల్లలు బద్ద శత్రువుల్లా కనపడేవారు ఆ కాసింత కాలం. ఎవరికి వారు తమ తమ యూనిఫాం లు ఇస్త్రీ రుద్దించుకోవాలి మరి. “కొండలా కూచుంది ఎంతకీ తరగనంది […]

Continue Reading
Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ    నువ్వు నేనె ప్రేమంటే కథగ నిలిచి పోవాలి నిన్ను నన్ను చూసి ప్రేమ తనువు మరిచి పోవాలి మన్ను మిన్ను కానరాని లోకంలో మన ప్రణయం బాధలన్ని తమకు తామె భువిని విడిచి పోవాలి కళ్ళు నాల్గు కలిసి కురిసె గుండెనిండ వలపువాన కుళ్ళుకున్న మేఘబాల విరిగి కురిసి పోవాలి ముద్దు ముద్దు మాటలు మన ఇద్దరికే సొంతమనీ జాములన్ని నిలిచి తుదకు రేయి అలిసి పోవాలి కట్టుబాటులేవి లేని మనసులదిది […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 5

నా జీవన యానంలో- (రెండవభాగం)- 5 -కె.వరలక్ష్మి  అది 1977 వ సంవత్సరం, ఆ సంవత్సరం జనవరి చివరి తేదీల్లో మా చిన్న చెల్లికీ , ఫిబ్రవరి మొదటి వారంలో మా పెద్ద తమ్ముడికీ పెళ్లిళ్లు జరిగాయి. ‘నేను ఆడ పిల్లలకి కట్నం ఇవ్వను, మగ పిల్లలకి తీసుకొను’ అన్న మా నాన్నమాట మా చిన్న చెల్లి విషయంలో చెల్లలేదు. 5 వేలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ డబ్బుల కోసం, పెళ్లి ఖర్చులకీ అప్పు చేసేరు. నేను […]

Continue Reading
Posted On :

కథా మధురం-కల

కథా మధురం  ఒక వాస్తవానికి మెలకువ గా నిలిచిన కథ – ‘కల’  (రచయిత: విద్యార్థి) -ఆర్.దమయంతి  ఈ ప్రపంచంలో అత్యంత కటిక బీదవాడు ఎవరూ అంటే, అందరూ వుండీ ఎవరూ లేని వాడు. తన ఒంటరితనమే తనకు తోడు గా  చేసుకుని బ్రతికే వాడు.    మనిషి సంపాదనలో పడ్డాక ఎన్నో ఆస్తులను  కూడపెట్టుకుంటాడు. కానీ, ముసలి వయసులో ఆసరా గా నిలిచే   అసలైన సంపదను మాత్రం పొందలేకపోతున్నాడు. ఏమిటా సంపదా, ఐశ్వర్యం అంటే – […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- ఎల్లా వీలర్ విల్ కాక్స్

క”వన” కోకిలలు : ఎల్లా వీలర్ విల్ కాక్స్  -నాగరాజు రామస్వామి  ( నవంబర్ 5,1850 – అక్టోబర్ 30,1919 )                     నువ్వు నవ్వితే నీతో కలిసి నవ్వుతుంది లోకం,              ఏడ్చావా, ఒంటరిగానే  ఏడ్వాల్సి ఉంటుంది;              పుడమికీ వుంది పుట్టెడు దుఃఖం.   – ఎల్లా వీలర్ విల్ కాక్స్   పై వాక్యాలు ఆమె ప్రసిద్ధ కవిత Solitude లోనివి.     ఎల్లా వీలర్ విలుకాక్స్ అమెరికన్ రచయిత్రి, కవయిత్రి. ఆమె రచించిన ముఖ్యమైన కవితా సంపుటులు Passion […]

Continue Reading
Posted On :

అనుసృజన-తెగితే అతకదు ఈ బంధం

తెగితే అతకదు ఈ బంధం   హిందీ మూలం – జ్యోతి జైన్ అనుసృజన – ఆర్.శాంతసుందరి అనుభ,  కవిత చదవటం పూర్తిచేయగానే ఆ చిన్న హాలు చప్పట్లతో మారుమోగింది.  ఆమె కొద్దిగా వంగి, అందరికీ నమస్కరించి వెళ్లి తన కుర్చీలో కూర్చుంది.
” అనుభ గారూ ఎంత బావుందండీ కవిత ! కవితలోని మీ భావం కూడా అద్భుతం ! కంగ్రాచులేషన్స్ ,”అంటూ జుబేర్ తన చేతిని అనుభవైపు చాపాడు . 
”థ్యాంక్స్, ” అంటూ అనుభ అతనికి కరచాలనం చేసి, […]

Continue Reading
Posted On :

చిత్రలిపి-దీపావళి

చిత్రలిపి -ఆర్టిస్ట్ అన్వర్  ఎవరు ఎవర్ని చంపారు? ఎంత వాతావరణ కాలుష్యం నింపారు? మనకున్న మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల అరవై అయిదు పండగలు వచ్చినా  ఈ దరిద్రం ఎప్పటికీ వదిలేది కాదు కాని వినండి. నాకు తెలిసి దీపావళి పిల్లల పండగ. నేనూ  ఒకప్పుడు పిల్లాడిగా ఉన్నా కదా! నాకు తెలీదా ఏం మా పిల్లల సంగతి ? తిక్క స్వామి ఉరుసుకోసం, రంగులు చల్లుకునే ఉగాది కోసం, హసన్ హుసన్ […]

Continue Reading
Posted On :

అనుసృజన-అస్తిత్వపోరాటానికి చిరునామా: అమృతా ప్రీతమ్

అస్తిత్వపోరాటానికి చిరునామా :అమృతా ప్రీతమ్ – ఆర్.శాంతసుందరి ఒక స్త్రీ అందంగా ఉంటే,ఆపై ప్రతిభ గలదైతే,తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలని అధిగమించేందుకు ఈ ప్రపంచంతో హోరాహోరీ పోరాడుతూ పేరు తెచ్చుకోడం ప్రారంభిస్తే ఆమెకి ఎన్ని రకాల సమస్యలు ఎదురౌతాయో తెలుసుకోవాలనుకుంటే అమృతా ప్రీతమ్ జీవితమే దానికి మంచి ఉదాహరణ. అమృతా ప్రీతమ్ కూడా ప్రేమ్ చంద్ , శరత్ చంద్ర లాగ తెలుగు సాహితీ ప్రేమికులకి సుపరిచితమే. ౧౦౧౯,౨౧ ఆగస్ట్ లో పుట్టిన అమృత […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 4

నా జీవన యానంలో- (రెండవభాగం)- 4 -కె.వరలక్ష్మి  M.A. తెలుగులో స్పెషలైజేషన్ కి చేమకూర వేంకటకవిని ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన వ్రాసినవి రెండు కావ్యాలే అందుబాటులో ఉన్నాయి కాబట్టి. 1.విజయ విలాసము, 2. సారంగధర చరిత్రము. చదువుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు అనుకున్నాను. ఇప్పట్లాగా నెట్ లోనో , పుస్తకాల షాపుల్లోనో విరివిగా బుక్స్ దొరికే కాలం కాదు. నాకేమో మోహన్ కూడా పి.జి. చేసి హెడ్ మాస్టరో, లెక్చరరో అయితే బావుండునని ఉండేది. బుక్స్ కొనేస్తే తనే […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- అమ్రితా ప్రీతమ్

    క’వన’ కోకిలలు-  అమ్రితా ప్రీతమ్  -నాగరాజు రామస్వామి   ( ఆగస్టు 31 , 1919 – అక్టోబర్ 31 , 2005 )                                                            ” శాంతి కేవలం సంక్షోభ రాహిత్యం కాదు; […]

Continue Reading
Posted On :

కథా మధురం-దూరపు కొండలు (ఉమ అద్దేపల్లి)

కథా మధురం   కథా సాహిత్యం లో  – నే చదివిన స్త్రీలు దూరపు కొండలు (ఉమ అద్దేపల్లి కథ)  -ఆర్.దమయంతి శీర్షిక గురించి నాలుగు మాటలు : కథా సాహిత్యం లో  నే చదివిన స్త్రీలు ఎందుకు రాయాలనిపించిందంటే .. ఏ కథ చదివినా, ఎవరి కథ విన్నా అందులో స్త్రీ  పాత్ర ఏమిటా అని శ్రధ్ధ గా ఆలకిస్తూ, ఆ కారెక్టరైజేషన్ ని పరిశీలిస్తుంటాను.  ఈ గమనిక వల్ల, స్టడీ వల్ల, నాకు తెలీని ఎందరో […]

Continue Reading
Posted On :

గజల్-అమ్మచేతి గోరుముద్ద

  గజల్-అమ్మచేతి గోరుముద్ద –జ్యోతిర్మయి మళ్ల  అమ్మచేతి గోరుముద్ద తింటుంటే ఎంత హాయి అమ్మచీర కుచ్చిళ్ళలొ దాగుంటే ఎంత హాయి   అన్నలక్కలందరూ ఆడుకుంటు ఉంటారు అమ్మ ఒడిలొ కూచునీ చూస్తుంటే ఎంత హాయి   జ్వరమొచ్చిన బాధంతా లేనె లేదు హుష్ కాకి అమ్మ భుజమ్మీద నిదురపోతుంటే ఎంత హాయి   అందమంటే అమ్మదే ఎవరు లేరు లోకంలో అమ్మతోటి ఈమాటను చెబుతుంటే ఎంత హాయి   నవ్వు వెనక ఎంత బాధ దాగుందో తెలియదులే […]

Continue Reading
Posted On :

అనుసృజన- లీవ్ మి అలోన్(కవిత)

అనుసృజన- లీవ్ మి అలోన్       హిందీ మూలం  -సుధా అరోరా                                            అనువాదం : ఆర్.శాంతసుందరి  నాకప్పుడు పద్ధెనిమిదేళ్ళు కలల రెక్కల మీద తేలిపోతూ ఎప్పుడూ గాలిలో ఎగురుతూ ఉండేదాన్ని సీతాకోక చిలుకలుండే లోకంలో  రంగు రంగుల పూల తోటల్లో  అగరొత్తుల మెత్తటి సువాసన చిన్నగా వెలిగే దీపజ్వాల హఠాత్తుగా అమ్మ వచ్చి నిలబడుతుంది నా వెనకాల నేను విసుగ్గా అంటాను అబ్బ ,అమ్మా లీవ్ మి అలోన్ నా స్పేస్ నాకిస్తుంది అమ్మ నా మీద పూర్తి నిఘా […]

Continue Reading
Posted On :

కథా మధురం-3(స్వేచ్ఛ నుంచి పంజరం లోకి)

కథా మధురం-3 కె. రామలక్ష్మి గారి కథ : స్వేచ్ఛ నుంచి పంజరం లోకి -జగద్ధాత్రి  తెలుగు పాఠకులకి చిరపరిచితమైన పేరు కె. రామలక్ష్మి గారు. అయితే ఇప్పుడు కొత్త తరం కి కాస్త తెలపాలన్న ఆలోచనతో చిన్ని పరిచయం. కె. రామలక్ష్మి , రామలక్ష్మి ఆరుద్ర అనే పేరులతో 1951 నుండి రచనలు చేస్తున్న ప్రసిద్ధ రచయిత్రి. డిసెంబర్ 31 , 1930 న కోటనందూరు లో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి. ఏ. […]

Continue Reading
Posted On :

చిత్రలిపి-కుచ్ సుస్త్ కదం రస్తే!

చిత్రలిపి-కుచ్ సుస్త్ కదం రస్తే! –ఆర్టిస్ట్ అన్వర్  ఓ మధ్య ఊరికి వెళ్ళా. సమయం నాలుగు ముక్కాలు. నిజానికి నడిచే టైం కదా అని నడక మొదలెట్టా.  నడుస్తూ సంజీవనగర్ రామాలయం దగ్గరికి చేరుకున్నా. నిజానికి ఊరికి వెళ్ళడం బహు తక్కువ అయిపోయింది. వెళ్ళినా ఒక రోజు కు పైగా ఎక్కువ ఉండటం కూడా కష్టమే అయిపోయింది. కానీ ఆ తెల్లారు జామున నడుస్తుంటే ఎన్ని జ్ఞాపకాలో! నిజానికి ఊరు చాలా మారిపోయింది. అయినా బుర్ర మారలా […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- విస్లావా సిమ్ బోర్ స్కా

    క’వన’ కోకిలలు- విస్లావా సిమ్ బోర్ స్కా -నాగరాజు రామస్వామి   విస్లావా సిమ్ బోర్ స్కా     Wislawa Szymborska    ( 1923 – 2012 )                  Wisława  Szymborska is ” Mozart of Poetry” – Nobel committee. మారియా విస్లావా సిమ్ బోర్ స్కా ( Maria Wisława Anna Szymborska ) పోలాండ్ కు […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 3

నా జీవన యానంలో- (రెండవభాగం)- 3 -కె.వరలక్ష్మి  ఊళ్లో లయన్స్ క్లబ్ ప్రారంభించిన కొత్తరోజులు. వాళ్ల కమ్యూనిటీ హాలు మేమున్న ఇంటికి దగ్గర్లోనే ఉండేది. వాళ్ల పిల్లలకి ఫీజ్ కట్టడానికొచ్చిన లయన్ మెంబరొకాయన “మాస్టారూ మీరూ లయన్స్ క్లబ్ లో చేరచ్చు కదా” అని అడిగేడు. నేనా విషయం మోహన్ తో చెప్పి ‘చేరదామా’ అని అడిగేను . “శాంత, రుక్కుల పెళ్లిళ్లకి చేసిన అప్పులు నా నెత్తిమీదున్నాయి. నువ్విప్పుడిలాంటి సేవా కార్యక్రమాలు పెట్టకు” అన్నాడు. లయన్స్ […]

Continue Reading
Posted On :

అనుసృజన-వెస్టరన్ కల్చర్ మై డియర్ !

      వెస్టర్న్ కల్చర్ మై డియర్ ! హిందీ మూలం: స్వాతి తివారీ అనుసృజన : ఆర్. శాంతసుందరి ఎవరో తలుపు నెమ్మదిగా తట్టారు. తలుపు గడియపెట్టి పడుకున్న నాకు లేవబుద్ధి కాలేదు. ఎవరితోనూ మాట్లాడాలనీ లేదు.కానీ లేచి తలుపు తెరవక తప్పదు. ప్రణవ్ ఏదైనా మర్చిపోయి వెనక్కి వచ్చాడేమో.కానీ తాళం చెవులూ, రుమాలూ, ఫైళ్ళూ అన్నీ ఇచ్చి పంపించింది ప్రతిమ.అతను వెళ్ళగానే తలుపు గడియ పెట్టేసింది.అదే పనిగా బైటినుంచి తలుపు తడుతూ ఉండేసరికి […]

Continue Reading
Posted On :

గజల్-ఎదురుచూసి

గజల్-ఎదురుచూసి -జ్యోతిర్మయి మళ్ళ  ఎదురుచూసి ఎదురుచూసి కనులకేమొ అలుపయ్యెను ఎదనుతాకి మదిని కలచి  మరువలేని తలపయ్యెను సుఖమునెంచి కన్నెమనసు పంజరమున చిలకయ్యెను సఖుని  కినుక తాళలేని చెలియకిదియె అలకయ్యెను   సగమురేయి సిగమల్లెల పరిమళమే సెగలయ్యెను  మరునితెలుపు వలపేదో తనువుచేరి వగలయ్యెను  తలచినంత చెంతచేరు తరుణమేమొ కరువయ్యెను విరహబాధకోర్వలేని హ్రుదయమింక బరువయ్యెను  వెన్నెలమ్మ చందమామ సరసమపుడె మొదలయ్యెను ప్రియుని రాక కానరాక గుండెకిపుడు గుబులయ్యెను  ప్రేమచిలుకు సమయమంత కరిగితరిగి కల అయ్యెను ప్రణయసీమ సరిహద్దులొ ఆమెచూపు శిల అయ్యెను  […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు – సరోజినీ నాయుడు

క’వన’ కోకిలలు – 2   -నాగరాజు రామస్వామి సరోజినీ నాయుడు         ( ఫిబ్రవరి 13, 1879 – మార్చ్ 2, 1949 )           “Life is a prism of My light, And Death the shadow of My face.” – Sarojini Naidu         The Nightingale of India !            భారత నైటింగేల్ గా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు అలనాటి […]

Continue Reading
Posted On :

చిత్రలిపి-కపివరుండిట్లనియే….

కపివరుండిట్లనియే….  -ఆర్టిస్ట్ అన్వర్  చిన్నప్పుడు మాకు ఆంజనేయ స్వామి అంటే దేవుడని అసలు తెలీనే తేలీదు. ఆంజనేయుడు నా బాల్య కాలపు హీరో. మా సూపర్మాన్ ,డూపర్మాన్ , స్పైడర్మాన్, బ్యాట్మన్, హీమాన్, అదీ ఇదీ ఇత్యాది … నాకు ఒక్క ముక్కరాదు కానీ నా ఫ్రెండ్స్ చాలామంది హనుమాన్ చాలీసా వచ్చి ఉండేది , చిన్నప్పుడు దయ్యాలకు భూతాలకు భయపడేవాణ్ణి కాదు కావున హనుమాన్ చాలీసా నేర్చుకోవాల్సిన అవసరం అనిపించలా. నాకు లేదు కానీ నా […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 2

నా జీవన యానంలో- (రెండవభాగం)- 2 -కె.వరలక్ష్మి  మా మామగారికి అనకాపల్లి దగ్గర అడ్డు రోడ్డు కొరుప్రోలు ట్రాన్స్ ఫర్ అయ్యిందట. అక్కడి నుంచే మా అత్త గారొక సారి, మామగారొకసారి వచ్చి వెళ్లే వారు.  ఆ సంవత్సరం సెలవుల్లో మేం పిల్లల్ని తీసుకుని కొరుప్రోలు వెళ్లేం. రెండు గదుల డిపార్టుమెంట్ క్వార్టర్స్. పెద్ద కాంపౌండు లోపల చెట్లు , ఆఫీసు. పక్కనే రోడ్డు కవతల సంత. పెద్ద సైజు టేబులంతేసి పై డిప్పలున్న తాబేళ్లని నేనక్కడే […]

Continue Reading
Posted On :

కథా మధురం-2 (యాష్ ట్రే- చాగంటి తులసి)

కథా మధురం 2  చాగంటి తులసి గారి కథ “యాష్ ట్రే”  –జగద్ధాత్రి  డాక్టర్ చాగంటి తులసి గారు తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యవసరం లేని పేరు. చాసో కుమార్తె గానే కాక రచయిత్రి గా, అనువాదకురాలిగా, సాహిత్య కార్యకర్తగా ఆమె ప్రఖ్యాతిని పొందిన విశిష్టమైన , తెలుగు సాహిత్యం గర్వించదగ్గ సాహితీ మూర్తి. హిందీ, ఒడియా , తెలుగు నడుమ భాషా వారధి గా ఆమె ఎన్నో అనువాదాలు చేశారు. రాహుల్ సాంకృత్యాన్ ‘ఓల్గా నుండి […]

Continue Reading
Posted On :

కథామధురం (ఉడ్ రోజ్ – అబ్బూరి ఛాయాదేవి)

కథామధురం  -జగద్ధాత్రి ఆధునిక తెలుగు సాహిత్యం లో రచయిత్రులు ఇరవైయవ  శతాబ్దం లో అందించిన రచనలెన్నో ఉన్నాయి. అందులో రచయిత్రులు రాసిన కథలు, అలాగే స్త్రీల ను గురించిన కథలు ఈ శీర్షిక లో మనం చదువుకోబోతున్నాం. ఇక్కడ ఈ శీర్షికలో మహిళల గురించిన రచనలను అవి మహిళ చేసినా లేక రచయితలు రాసినవి అయినా ఆ కథను ఇక్కడ అందించ దలిచాము. తెలుగు సాహిత్యం లో చాలా మంచి కథలు వచ్చాయి వస్తున్నాయి. అయితే మిగిలిన […]

Continue Reading
Posted On :

అనుసృజన-నేను ఓడిపోలేదు

నేను ఓడిపోలేదు   హిందీ మూలం : ఊర్మిలా శిరీష్    అనుసృజన : ఆర్.శాంతసుందరి ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చిన్నప్పుడు అక్కడ ఎవరూ లేరు. నల్లటి నిశ్శబ్దం మాత్రం అలుముకుంది.దోమల రొద, తేమ వాసన గదినిండా పరుచుకునుంది.బైట వర్షం ఆగిపోయింది,కానీ నీళ్ళు పారుతున్న చప్పడూ, చినుకుల చిటపటలూ ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.రోడ్డుమీద మనుషుల సందడి వినిపిస్తోంది.ఆమె తన కళ్ళని చేత్తో తడిమింది…నిద్రపోతున్నానా, మేలుకునే ఉన్నానా… ఒక్క క్షణం పాటు అయోమయంగా అనిపించింది.ఇంకేదో రహస్యలోకం తన చుట్టూ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 1

నా జీవన యానంలో- (రెండవభాగం)- 1 -కె.వరలక్ష్మి  అప్పటికి నాకు ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తోంది. స్కూల్ ఫైనల్ (11 వ తరగతి ) తో నా చదువాగిపోయి పదేళ్లైపోయింది. స్కూల్ ఫైనల్లో నాకొచ్చిన మార్కుల వల్ల హిందీలో ప్రాధమిక, మాధ్యమిక చదవకుండానే డైరెక్టుగా రాష్ట్ర భాషకు అటెండై పాసయ్యాను . అప్పటికి హిందీ అక్కయ్యగారు ట్యూషన్స్ మానేసారని గుర్తు . నేను సొంతంగానే చదువుకునే దాన్ని . రాజమండ్రిలో పుష్కరాల రేవు పక్కనున్న రాణీ మహల్లో […]

Continue Reading
Posted On :

క“వన” కోకిలలు – మాయా ఆంజలోవ్

                                         క “వన” కోకిలలు   -నాగరాజు రామస్వామి                                                    మాయా ఆంజలోవ్  ( ఏప్రిల్ 4 , […]

Continue Reading
Posted On :

చిత్రలిపి (గంగమ్మా గౌరమ్మా)

చిత్రలిపి -అన్వర్ ఆ మధ్య ఊరికి పోతే ఇదిగో గంగమ్మా గౌరమ్మా కనబడినారు. ముచ్చట వేసింది. గంగమ్మా గౌరమ్మా అంటే మరేం కాదు. ఇంటికి భిక్ష అడగడానికి వచ్చేవాళ్లల్లో ఒక రకపు  వారు తమ చేతిలో ఒక పీఠం పైన గంగాదేవి, గౌరీ దేవి బొమ్మల్ని ఎదురెదురుగా కూచుని చెరో రోలు పుచ్చుకుని రోట్లో దంచడానికి సిద్దమై ఉంటారు. ఈ పీఠం పుచ్చుకున్న స్త్రీ కిందనుండి చేతులు ఉంచి ఆడించగానే ఇద్దరు సవతులు మర చేతులు ఊపుకుంటూ  […]

Continue Reading
Posted On :

ఆకాశమే ..గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ ఆకాశమే ఒక కాగితం హరివిల్లు దించేసుకోనా నా మనసునే కుంచెగా ఒక బొమ్మ నే గీసుకోనా ఆ కొండ కోనల్లొ ఆగనా ఆవాగు నీరల్లె సాగనా నా కంటిలో ఆ సోయగం పదిలంగ నిధి చేసుకోనా ఆతీగ పువ్వల్లె నవ్వనా ఆ కొమ్మలో కోయిలవ్వనా ఈ గుండెతో ఆ గీతిని మురిపెంగ పెనవేసుకోనా ఓ మేఘనీలమై మారనా ఓ సంధ్య ఎరుపై జారనా  ఆ వర్ణకాంతులే నిండుగా ఒళ్ళంత నే పూసుకోనా మధుమాస […]

Continue Reading
Posted On :